PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections810bd3cd-450b-400e-b40b-64798bb0e4e3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections810bd3cd-450b-400e-b40b-64798bb0e4e3-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో కృష్ణా గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని ఎదుర్కొని వైసీపీ 2019 ఎన్నికల్లో మంచి స్థానాలు సాధించింది. తెలుగుదేశం పార్టీని రెండు ఎంపీలకు నలుగురు ఎమ్మెల్యే లకు మాత్రమే రెండు జిల్లాలలో పరిమితం చేసింది. అయితే ఇప్పుడు వైసీపీలో కొన్ని సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ప్రధానంగా నందిగామ విషయంలో వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టడం లేదనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. నందిగామ పరిధిలో వైసీపీ ముందు నుంచి కూడా బలంగానే ఉంది. అయితే కొన్ని సమస్యల విషయంలో పరిష్కారం చూపించే విషయంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. tdp;bhavana;tiru;telugu desam party;krishna river;jagan;andhra pradesh;2019;telugu;mla;doctor;tdp;local language;ycp;party;mantraపురపోరు:నందిగామ వైసీపీలో టీడీపీ పెత్తనం...?పురపోరు:నందిగామ వైసీపీలో టీడీపీ పెత్తనం...?tdp;bhavana;tiru;telugu desam party;krishna river;jagan;andhra pradesh;2019;telugu;mla;doctor;tdp;local language;ycp;party;mantraFri, 19 Feb 2021 11:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో కృష్ణా గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని ఎదుర్కొని వైసీపీ 2019 ఎన్నికల్లో మంచి స్థానాలు సాధించింది. తెలుగుదేశం పార్టీని రెండు ఎంపీలకు నలుగురు ఎమ్మెల్యే లకు మాత్రమే రెండు జిల్లాలలో పరిమితం చేసింది. అయితే ఇప్పుడు వైసీపీలో కొన్ని సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ప్రధానంగా నందిగామ విషయంలో వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టడం లేదనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. నందిగామ పరిధిలో వైసీపీ ముందు నుంచి కూడా బలంగానే ఉంది. అయితే కొన్ని సమస్యల విషయంలో పరిష్కారం చూపించే  విషయంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ జగన్ కు వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉన్నా సరే ఆయనకు కొంత మంది నేతల నుంచి సహకారం లేదు. ఎమ్మెల్యే ప్రజలలో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. 2019 ఎన్నికలకు ముందు కూడా ఆయన ప్రజల్లోనే ఎక్కువగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నుంచి కొంత మంది స్థానిక నేతలు పార్టీలోకి వచ్చారు. కానీ వాళ్లు మాత్రం వైసీపీకి అనుకూలంగా పని చేయడం లేదు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కొంతమందికి పార్టీలో మంచి ప్రోత్సాహం ఎమ్మెల్యే నుంచి లభించిన స్థానిక నేతలు నియోజకవర్గంలో పార్టీ జెండా మోయడానికి అనేక సమస్యలు సృష్టిస్తున్నారు.

కార్యకర్తలు విషయంలో కూడా ఇలాగే వ్యవహరించడంతో ఇప్పుడు ఎమ్మెల్యే కూడా కాస్త సీరియస్గా ఉన్నారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే దీని మీద అధిష్టానం దృష్టి పెట్టిందని అంటున్నారు. కొంతమంది మంత్రులు కూడా నందిగామ నియోజకవర్గంలో పర్యటించే అవకాశాలున్నాయని త్వరలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో అక్కడి నేతలు అందరితో కూడా సమావేశాలు నిర్వహించి... విభేదాలు  లేకుండా పార్టీకి జవసత్వాలు నింపే విధంగా రాజకీయం చేయవచ్చు అని అంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చే వాళ్ళని పక్కన పెట్టేయాలి అని గతంలో వచ్చిన వాళ్లను కూడా పక్కన పెట్టడమే మంచిది అనే భావనను వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.


యాంకర్ రష్మీ నటించిన సినిమా లేవో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఇప్పటి వరకు ఏ హీరో సాధించని రికార్డు సృష్టిస్తున్న హీరో రామ్ చరణ్

పుర పోరు: ఒక్క మున్సిపాల్టీ... ముగ్గురు వైసీపీ నేత‌ల‌కు అగ్ని ప‌రీక్ష ?

పుర పోరు: ఆ టీడీపీ కుటుంబానికి బాబు ఫైన‌ల్ ఛాన్స్‌... ఓడిపోతే ష‌ట్ట‌ర్ క్లోజ్ చేస్కోవ‌డ‌మే ?

పుర పోరు: బెజ‌వాడ కార్పొరేష‌న్... నాడు-నేడు..!

పుర పోరు: శ్రీకాకుళం జిల్లాలో భార్య జోరుతో మంత్రి గారు బేజారు?

టీఆర్‌ఎస్‌ మెడకు బలంగా చుట్టుకుంటున్న లాయర్ల మర్డర్‌ కేసు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>