Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kapatadhari568f5b4f-d6e9-4b43-beef-d430036539b2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kapatadhari568f5b4f-d6e9-4b43-beef-d430036539b2-415x250-IndiaHerald.jpgకొన్ని సినిమాలు కొందరు హీరోలకు నచ్చవు. ఆ కథలు తమకు సెట్ కావనో, లేదా అందులో పాత్ర నచ్చకనో వాటిని సదరు హీరోలు వదులుకుంటుంటారు. అయితే అలా వదులుకున్న సినిమాల్లో కొన్నింటిని వేరే హీరోలు చేసి బ్లాక్ బస్టర్లు కొట్టారు. అలా ఓ సినిమాను అక్కినేని హీరో సుమంత్ వద్దనుకున్నాడట. ఆ సినిమా అటు తిరిగి ఇటు తిరిగి అల్లు అర్జున్‌కు చేరిందట. దాంతో అప్పటివరకు తన కెరీర్లోనే..kapatadhari;allu arjun;nageshwara rao akkineni;suma;suma kanakala;sumanth;cinema;kannada;interview;blockbuster hit;hero;arjun 1సుమంత్ వద్దన్న సినిమాతో అల్లు అర్జున్ కెరీర్ బ్లాక్ బస్టర్ కొట్టాడంట!సుమంత్ వద్దన్న సినిమాతో అల్లు అర్జున్ కెరీర్ బ్లాక్ బస్టర్ కొట్టాడంట!kapatadhari;allu arjun;nageshwara rao akkineni;suma;suma kanakala;sumanth;cinema;kannada;interview;blockbuster hit;hero;arjun 1Fri, 19 Feb 2021 14:17:26 GMTఇంటర్నెట్ డెస్క్: కొన్ని సినిమాలు కొందరు హీరోలకు నచ్చవు. ఆ కథలు తమకు సెట్ కావనో, లేదా అందులో పాత్ర నచ్చకనో వాటిని సదరు హీరోలు వదులుకుంటుంటారు. అయితే అలా వదులుకున్న సినిమాల్లో కొన్నింటిని వేరే హీరోలు చేసి బ్లాక్ బస్టర్లు కొట్టారు. అలా ఓ సినిమాను అక్కినేని హీరో సుమంత్ వద్దనుకున్నాడట. ఆ సినిమా అటు తిరిగి ఇటు తిరిగి అల్లు అర్జున్‌కు చేరిందట. దాంతో అప్పటివరకు తన కెరీర్లోనే లేని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడట మన స్టైలిష్ స్టార్. ఈ విషయాన్ని సుమంత్ స్వయంగా చెప్పాడు. ఇంతకీ  ఆ సినిమా ఏదో తెలుసా..? దేశముదురు. అవును. ఈ సినిమానే సుమంత్ వద్దనుకున్నాడట.

‘ఓసారి ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ నన్ను సంప్రదించారు. మాస్‌, కమర్షియల్‌ హంగులున్న కథ చెప్పారు. కథ నాకెంతో నచ్చింది. కానీ అది నాకు సెట్‌ కాదు. దాంతో నేను సున్నితంగా తిరస్కరించాను. ఆ తర్వాత పూరీ.. అల్లు అర్జున్‌ని కలిశారు. ఆయన ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అలా వాళ్లిద్దరూ కాంబోలో ‘దేశముదురు’ తెరకెక్కింది. ఒకవేళ నేనే కనుక ఆ సినిమా చేసి ఉంటే తప్పకుండా ఫ్లాప్‌ అయి ఉండేది. బన్నీ చేశాడు కాబట్టే అది హిట్‌ అయ్యింది.’’ అని సుమంత్‌ చెప్పుకొచ్చాడు.

కథానాయకుడు సుమంత్‌ అక్కినేని.. అక్కినేని కుటుంబం నుంచి వెండితెరకు పరిచయమయ్యారు. ‘ప్రేమకథ’తో కెరీర్‌ ఆరంభంలోనే మంచి విజయాన్ని అందుకున్న ఆయన.. ఇప్పటివరకు దాదాపు 25 చిత్రాల్లో నటించారు. అందులో కొన్ని సినిమాలు సూపర్ హిట్‌లు కాగా.. మరికొన్ని మిక్స్‌డ్ టాక్ సంపాదించాయి. ఈ నేపథ్యంలో కన్నడ చిత్రం కవలుధారికి రీమేక్‌గా, ఆయన కథానాయకుడిగా వస్తున్న తెలుగు చిత్రం ‘కపటధారి’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే ‘కపటధారి’ ప్రమోషన్‌లో భాగంగా తాజాగా సుమంత్‌ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.





రష్మి మొదటిసారి బుల్లితెర మీద రెచ్చిపోయింది.. వామ్మో నా తప్పు ఏముందబ్బా అంటూ..!

యాక్టర్ ప్రసాద్ బాబు కొడుకు, కోడలు గురించి బయటపడ్డ నిజాలు..!

తెలంగాణలో ప్రైమరీ స్కూల్స్ ఇక లేనట్టే..

ఎన్టీయార్ కి సూపర్ సలహా ఇచ్చిన చెర్రీ.. ఫ్యాన్స్ ఖుషీ..?

నటి హేమ కు ఇంత పెద్ద కూతురు ఉందా..ఎంత క్యూట్ గా ఉందో కదా..!

ఇప్పటి వరకు ఏ హీరో సాధించని రికార్డు సృష్టిస్తున్న హీరో రామ్ చరణ్

పుర పోరు: ఒక్క మున్సిపాల్టీ... ముగ్గురు వైసీపీ నేత‌ల‌కు అగ్ని ప‌రీక్ష ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>