PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/74/will-ration-shop-prices-go-high1183c06f-4aeb-4688-8357-1a36b2a0fc4f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/74/will-ration-shop-prices-go-high1183c06f-4aeb-4688-8357-1a36b2a0fc4f-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా పెట్లో ఉత్పత్తుల రేట్లు భారీగా పెరిగిపోయాయి. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ తగ్గించి, రేట్లు విపరీతంగా పెంచారు. దీంతో ప్రజలు కూడా పెరిగిన రేట్లకు అలవాటు పడిపోయారు. ఎప్పుడు ఏ రేటు పెరిగినా తమకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. అన్నిటినీ పెంచేస్తున్న కేంద్ర ప్రభుత్వం, రేషన్ సరకుల రేట్లు కూడా పెంచుతుందనే ప్రచారం మొదలైంది. అదే జరిగితే దేశవ్యాప్తంగా రేషన్ పై ఆధారపడి జీవిస్తున్న పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ration prices;piyush goyal;minister;central government;aadhar;piyush chawlaరేషన్ సరకుల రేట్లు పెంచేస్తారా..?రేషన్ సరకుల రేట్లు పెంచేస్తారా..?ration prices;piyush goyal;minister;central government;aadhar;piyush chawlaFri, 19 Feb 2021 11:00:00 GMTకేంద్ర ప్రభుత్వం, రేషన్ సరకుల రేట్లు కూడా పెంచుతుందనే ప్రచారం మొదలైంది. అదే జరిగితే దేశవ్యాప్తంగా రేషన్ పై ఆధారపడి జీవిస్తున్న పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఈ సందర్భంగా కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ రేషన్ సరకుల రేట్ల పెంపుపై స్పందించారు. ఆన్ లైన్ ద్వారా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి రేషన్ సరకుల రేట్లు పెంచే ఆలోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. రేషన్ సరకులపై భారం మోపితే ప్రజలు ఇబ్బందులు పడతారని, అందుకే కేంద్రం అలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ప్రజలెవరూ అపోహలు పెట్టుకోవద్దని, కేంద్రం సబ్సిడీపై  ఇచ్చే రేషన్ సరకులు యథావిధిగానే కొనసాగుతాయని అన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్గత సబ్సిడీని కొనసాగిస్తుండటంతో.. ఏ రాష్ట్రంలో కూడా రేషన్ సరకుల రేట్లు పెరిగే అవకాశం లేదని తేలిపోయింది.

రేషన్‌ కార్డు పోర్టబిలిటీపై కూడా మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. రెండేళ్ల క్రితం ప్రారంభించిన ‘ఒకే దేశం.. ఒకే రేషన్‌ కార్డు’ పథకం 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలవుతున్నట్లు చెప్పారు మంత్రి. మిగిలిన రాష్ట్రాల్లోనూ అమలయ్యేలా కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతోందని అన్నారు. ఈ పథకం ద్వారా 1.5 కోట్ల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నట్లు వివరించారు. జాతీయ ఆహార భద్రత చట్టం కింద మంజూరు చేసిన రేషన్‌ కార్డులను పూర్తిస్థాయిలో డిజిటలైజ్‌ చేసినట్లు చెప్పారు. 91 శాతం కార్డులకు ఆధార్‌ అనుసంధానం కూడా పూర్తయిందని అన్నారు. రేషన్ షాపుల్లో ఇచ్చే సరకుల రేట్లు మాత్రం పెంచడంలేదని స్పష్టం చేశారు.




యాంకర్ రష్మీ నటించిన సినిమా లేవో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఇప్పటి వరకు ఏ హీరో సాధించని రికార్డు సృష్టిస్తున్న హీరో రామ్ చరణ్

పుర పోరు: ఒక్క మున్సిపాల్టీ... ముగ్గురు వైసీపీ నేత‌ల‌కు అగ్ని ప‌రీక్ష ?

పుర పోరు: ఆ టీడీపీ కుటుంబానికి బాబు ఫైన‌ల్ ఛాన్స్‌... ఓడిపోతే ష‌ట్ట‌ర్ క్లోజ్ చేస్కోవ‌డ‌మే ?

పుర పోరు: బెజ‌వాడ కార్పొరేష‌న్... నాడు-నేడు..!

పుర పోరు: శ్రీకాకుళం జిల్లాలో భార్య జోరుతో మంత్రి గారు బేజారు?

టీఆర్‌ఎస్‌ మెడకు బలంగా చుట్టుకుంటున్న లాయర్ల మర్డర్‌ కేసు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>