PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/venkayya-naidu486e3bbe-08e8-4914-9487-a05d1e10fdf5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/venkayya-naidu486e3bbe-08e8-4914-9487-a05d1e10fdf5-415x250-IndiaHerald.jpgఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు.. తెలుగు భాష అన్నా.. తెలుగు సంస్కృతి అన్నా ఎంతో మక్కువ. ఈ విషయం ఆయన ప్రసంగాల్లో తరచూ కనబడుతుంది. ప్రాసలతో ప్రసంగం అదరగొట్టడం వెంకయ్యనాయుడికి వెన్నతో పెట్టిన విద్య. తెలుగు ప్రాంతాల్లో ఆయన తరచూ తెలుగులోనే మాట్లాడతారు.. తెలుగు గొప్పదనం వివరిస్తారు. అయితే.. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ తెలుగు వాళ్ల సమావేశంలో మాత్రం ఆయన ఆంగ్లంలో ప్రసంగించారు. హైదరాబాద్‌లోని హోటల్‌ దస్‌పల్లాలో జరిగిన 'మేవరిక్ మెస్సయ్య' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో వెంకయ్య ఆంగ్లంలో కొద్దిసేపు ప్రసంగించారుvenkayya-naidu;ntr;choudary actor;jeevitha rajaseskhar;srinivas;vidya;telugu;writer;history;minister;culture;central government;nandamuri taraka rama rao;venkaiah naidu;sujana choudaryఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన వెంకయ్యనాయుడు..?ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన వెంకయ్యనాయుడు..?venkayya-naidu;ntr;choudary actor;jeevitha rajaseskhar;srinivas;vidya;telugu;writer;history;minister;culture;central government;nandamuri taraka rama rao;venkaiah naidu;sujana choudaryFri, 19 Feb 2021 06:00:00 GMTఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు.. తెలుగు భాష అన్నా.. తెలుగు సంస్కృతి అన్నా ఎంతో మక్కువ. ఈ విషయం ఆయన ప్రసంగాల్లో తరచూ కనబడుతుంది. ప్రాసలతో ప్రసంగం అదరగొట్టడం వెంకయ్యనాయుడికి వెన్నతో పెట్టిన విద్య. తెలుగు ప్రాంతాల్లో ఆయన తరచూ తెలుగులోనే మాట్లాడతారు.. తెలుగు గొప్పదనం వివరిస్తారు. అయితే.. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ తెలుగు వాళ్ల సమావేశంలో మాత్రం ఆయన ఆంగ్లంలో ప్రసంగించారు.

హైదరాబాద్‌లోని హోటల్‌ దస్‌పల్లాలో జరిగిన 'మేవరిక్ మెస్సయ్య' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో వెంకయ్య ఆంగ్లంలో కొద్దిసేపు ప్రసంగించారు. 'మేవరిక్‌ మెస్సయ్య' పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఎన్టీఆర్‌ రాజకీయ జీవితాన్ని ఫోకస్ చేసిన ఈ పుస్తకాన్ని ప్రముఖ పాత్రికేయుడు కందుల రమేశ్‌ రాశారు. ఈ పుస్తక ఆవిష్కరణ సభకు ప్రముఖ జర్నలిస్టు, రచయిత సంజయ్ బారు.. మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.

ఇంతకీ ఈ కార్యక్రమంలో వెంకయ్య తెలుగులో ఎందుకు మాట్లాడారంటే.. ఎన్టీఆర్‌కు చరిత్రలో చాలా అన్యాయం జరిగిందట. ఏ విషయంలో అంటే.. ఆయనకు దేశవ్యాప్తంగా రావాల్సినంత పేరు ప్రఖ్యాతులు రాలేదట. చరిత్రలో ఆయనకు తగినంత స్థానం దక్కలేదట. ఎందుకంటే.. తెలుగు కాకుండా ఇతర భాషల్లో ఎన్టీఆర్‌ గురించి విస్తృతమైన స్థాయిలో పుస్తకాలు రాలేదట.. ఎన్టీఆర్‌ తెలుగు వెలుగు అంటున్న వెంకయ్య అది ప్రపంచమంతా వెలగాలన్నారు. ఎన్టీఆర్‌ను తెలుగువారికే పరిమితం చేయడం తనకు ఇష్టం లేదని వెంకయ్య అంటున్నారు.

ఎన్టీఆర్ బహుముఖ ప్రజ్ఞ, రాజకీయ దురంధరత దేశమంతా తెలియాలని... ఎన్టీఆర్‌కు చరిత్ర తగిన న్యాయం చేయలేదని ఉపరాష్ట్రపతి వెంకయ్య బాధపడ్డారు. 'మేవరిక్‌ మెస్సయ్య' వంటి పుస్తకాలు మరిన్ని రావాలని.. ఎన్టీఆర్‌ జీవితంలోని అనేక కోణాలు వెలుగులోకి రావాలని వెంకయ్య ఆకాంక్షించారు. ఎన్టీఆర్‌ రాజకీయ సంస్కృతినే పునర్‌నిర్వచించారని.. ఎన్టీఆర్ రంగప్రవేశంతో రాజకీయాలు మారిపోయాయని వెంకయ్య నాయుడు గుర్తు చేసుకున్నారు.




ప్లాస్టిక్ కప్పుల్లో టీ తాగితే క్యాన్సర్ వస్తుందంటా..!

అల్లరి నరేష్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

రాధే శ్యామ్ కోసం ఏకంగా రైల్వేస్టేషన్ కట్టేశారా..!

మన వంటలక్క ఎంత పెద్ద చదువు చదివిందో తెలుసా..?

జగన్ అన్న ఒక్క మాట..... బీజేపీకి బ్రహ్మాస్త్రమా...?

జగడ్డ : భీమిలీ కంచుకోటలో పసందైన పంచాయతీ..?

జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>