MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips5c698215-0257-4a5a-9af0-c945260c0d34-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips5c698215-0257-4a5a-9af0-c945260c0d34-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు కి టాలీవుడ్ లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు విజయాలతో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. అయితే మహేష్ బాబు కెరియర్ లో కొన్ని సినిమాలకు ప్రఃత్యేక స్థానం ఉంటుంది. అలాంటి వాటిలో ఒక్కడు, దూకుడు సినిమాలు ముందు వరుసలో ఉంటాయి. 2003 వచ్చిన ఒక్కడు సినిమాతో మహేష్ కు స్టార్ గా మొదటి విజయం లభించింది. ఇక అలాగే మహేష్ కెరీర్ లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది దూకుడు.tollywood gossips;cbn;mahesh;mahesh babu;srinu vytla;varsha;tollywood;cinema;rajani kanth;producer;producer1;box office;letter;traffic police;chitramమహేష్ కోసం రెడీ అవుతున్న సిక్వల్స్ ..??మహేష్ కోసం రెడీ అవుతున్న సిక్వల్స్ ..??tollywood gossips;cbn;mahesh;mahesh babu;srinu vytla;varsha;tollywood;cinema;rajani kanth;producer;producer1;box office;letter;traffic police;chitramFri, 19 Feb 2021 06:00:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు కి టాలీవుడ్ లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు విజయాలతో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. అయితే మహేష్ బాబు కెరియర్ లో కొన్ని సినిమాలకు ప్రఃత్యేక స్థానం ఉంటుంది. అలాంటి వాటిలో ఒక్కడు, దూకుడు సినిమాలు ముందు వరుసలో ఉంటాయి. 2003 వచ్చిన ఒక్కడు సినిమాతో మహేష్ కు స్టార్ గా మొదటి విజయం లభించింది. ఇక అలాగే మహేష్ కెరీర్ లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది దూకుడు.

దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మహేష్ పోలీస్ గా నటించిన ఈ చిత్రంలో ఆయన బాడీ లాంగ్వేజ్ మరియు మహేష్ పలికిన తెలంగాణా యాసకి టాలీవుడ్ సినీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 2011 టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన దూకుడు విడుదలై 10ఏళ్ళు దాటుతున్న సమయంలో ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దూకుడు’ ఇచ్చిన న‌మ్మ‌కంతో `ఆగ‌డు` తీస్తే.. బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయం పాలు అయ్యింది. అక్క‌డి నుంచి శ్రీ‌నువైట్ల దూకుడు బాగా త‌గ్గిపోయింది. వ‌రుస ఫ్లాపులు ప‌ల‌క‌రించాయి. ప్రస్తుతం ఢీ సినిమాకు సీక్వెల్ చేస్తున్నడు.

 ఈ సినిమాతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం దూకుడు 2 కథను సిద్దం చేశాడట. మహేష్ బాబుకి ‘దూకుడు 2’ స్టోరీ నేరేట్ చేయడానికి వైట్ల శ్రీను ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారట. అయితే మహేష్ శ్రీను వైట్లకు అవకాశం ఇస్తాడా లేదా అనేది చూడాలి. అలాగే ఒక్కడు సినిమా సిక్వల్ కూడా ఉంటుందని ఆ మద్య ఆ సినిమా నిర్మాత ఎం‌ఎస్ రాజు ప్రకటించిన సంగతీ తెలిసిందే. ఏది ఏమైనప్పటికి రెండు అల్ టైమ్ సూపర్ హిట్ మూవీస్ యొక్క సిక్వల్స్ మహేష్ కోసం సిద్దం గా ఉన్నాయని తెలుస్తుంది. మరి మహేష్ వీటికి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి. 


ప్లాస్టిక్ కప్పుల్లో టీ తాగితే క్యాన్సర్ వస్తుందంటా..!

అల్లరి నరేష్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

రాధే శ్యామ్ కోసం ఏకంగా రైల్వేస్టేషన్ కట్టేశారా..!

మన వంటలక్క ఎంత పెద్ద చదువు చదివిందో తెలుసా..?

జగన్ అన్న ఒక్క మాట..... బీజేపీకి బ్రహ్మాస్త్రమా...?

జగడ్డ : భీమిలీ కంచుకోటలో పసందైన పంచాయతీ..?

జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>