PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lawyers-murders58139a41-0322-4896-af95-b1d757002f2e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lawyers-murders58139a41-0322-4896-af95-b1d757002f2e-415x250-IndiaHerald.jpgపెద్దపల్లి జిల్లాలో జరిగిన న్యాయవాద దంపతుల హత్యల కేసు చివరకు టీఆర్ఎస్ మెడకు చుట్టుకుంటోంది.. హత్యలు జరిగిన రోజే నిందితుడు కుంట శీను పేరును హత్యకు గురైన న్యాయవాది వామనరావు.. చావుబతుకుల మధ్య చెప్పిన సంగతి తెలిసిందే. సదరు కుంట శీను టీఆర్‌ఎస్ మంథని మండల అధ్యక్షుడు.. అప్పుడే ఇది టీఆర్ఎస్ మెడకు చుట్టుకోబోతోందని అర్థమైంది. ఆ తర్వాత.. ఇప్పుడు విచారణలో వెలుగు చూస్తున్న అంశాలు ఇందుకు మరింత బలం చేకూరుస్తున్నాయి. తాజాగా ఈ హత్యలకు కత్తులు, వాహనం సమకూర్చిన బిట్టు శ్రీను సాక్షాత్తూ జిల్లా ఛైర్మన్‌ పుట్ట మధlawyers-murders;telangana rashtra samithi trs;district;police;media;lawyer;murder.;kavuru srinivas;party;peddapalliటీఆర్‌ఎస్‌ మెడకు బలంగా చుట్టుకుంటున్న లాయర్ల మర్డర్‌ కేసు..?టీఆర్‌ఎస్‌ మెడకు బలంగా చుట్టుకుంటున్న లాయర్ల మర్డర్‌ కేసు..?lawyers-murders;telangana rashtra samithi trs;district;police;media;lawyer;murder.;kavuru srinivas;party;peddapalliFri, 19 Feb 2021 10:00:00 GMTపెద్దపల్లి జిల్లాలో జరిగిన న్యాయవాద దంపతుల హత్యల కేసు చివరకు టీఆర్ఎస్ మెడకు చుట్టుకుంటోంది.. హత్యలు జరిగిన రోజే నిందితుడు కుంట శీను పేరును హత్యకు గురైన న్యాయవాది వామనరావు.. చావుబతుకుల మధ్య చెప్పిన సంగతి తెలిసిందే. సదరు కుంట శీను టీఆర్‌ఎస్ మంథని మండల అధ్యక్షుడు.. అప్పుడే ఇది టీఆర్ఎస్ మెడకు చుట్టుకోబోతోందని అర్థమైంది. ఆ తర్వాత.. ఇప్పుడు విచారణలో వెలుగు చూస్తున్న అంశాలు ఇందుకు మరింత బలం చేకూరుస్తున్నాయి.

తాజాగా ఈ హత్యలకు కత్తులు, వాహనం సమకూర్చిన  బిట్టు శ్రీను  సాక్షాత్తూ జిల్లా ఛైర్మన్‌ పుట్ట మధు మేనల్లుడు కావడంతో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆత్మరక్షణలో పడింది. హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసులో అనూహ్యంగా  ఈ కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కుంట శ్రీనివాస్‌కు కారు ఇవ్వడంతో పాటు హత్యకు వినియోగించిన రెండు కత్తులనూ బిట్టు శ్రీనివాస్‌ అనే వ్యక్తి సమకూర్చాడని  పోలీసులు మీడియా సమావేశంలోనే  వెల్లడించారు.

ఈ బిట్టు శ్రీను పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధుకర్‌కు మేనల్లుడు కావడంతో ఇప్పుడు ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకొంది. పుట్ట మధు తన తల్లి పేరిట నిర్వహిస్తున్న ట్రస్ట్‌ బాధ్యతల్ని ఇతడే చూస్తుంటాడు. కత్తుల్ని మంథనిలో ఓ పండ్ల దుకాణం నుంచి తీసుకొచ్చారనే వాదన వినిపిస్తోంది. ఆ దుకాణం కూడా అధికార పార్టీకే చెందిన ఓ ప్రజాప్రతినిధిగా చెబుతున్నారు. ఆ ప్రజాప్రతినిధిని విచారిస్తే మరిన్ని విషయాలు బహిర్గతమవుతాయని  తెలుస్తోంది.

పోలీసులు మాత్రం బిట్టు శ్రీనివాస్‌ ఇంకా తమకు చిక్కలేదని పోలీసులు ప్రకటించారు. పుట్ట మధుకు సంబంధించి పలు విషయాల్లో న్యాయవాది వామన్‌రావు ఫిర్యాదులు, పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జంట హత్యల కేసులో బిట్టు శ్రీను పాత్రను పోలీసులు ఉటంకించడం సంచలనం రేకెత్తిస్తోంది. ఇప్పటికే కుంట శీనును పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన టీఆర్ఎస్‌ పుట్ట మధుపై చర్యలు తీసుకోవాలా వద్దా అనే మీమాంసలో ఉన్నట్టు తెలుస్తోంది.




ఇండియన్ నేవీలో ఉద్యోగాలు..!

పుర పోరు: క‌ర‌ణంను జ‌గ‌న్ ప‌క్క‌కు తోసేస్తాడా... ఏం జ‌రుగుతోంది ?

పుర పోరు: వైసీపీ నేత కెరీర్‌కు అగ్నిప‌రీక్ష‌గా మారిన ఎన్నిక‌... తేడా వ‌స్తే జ‌గ‌న్ సైడ్ చేసేస్తాడా ?

ఎన్.టి.ఆర్ తోనే ఉప్పెన బుచ్చి బాబు.. బ్యాక్ డ్రాప్ కథ రెడీ..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బీజేపీ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లో బ్రాహ్మ‌ణుల పాత్ర ఎంత ‌?

కాపు వేద‌న‌: పాలిటిక్సే కాదు.. ఆర్థిక వెత‌ల్లోనూ కాపులే ఫ‌స్ట్..‌!

పుర పోరు : విశాఖ షాక్ ఎవరికి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>