Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/whats-app7b3bdfd6-8e34-439c-9fef-fbceee348e02-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/whats-app7b3bdfd6-8e34-439c-9fef-fbceee348e02-415x250-IndiaHerald.jpgకొత్త పాలసీపై వాట్సాప్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. భారత్‌లో తమ పాలసీని కచ్చితంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. సుప్రీం కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ తమ కొత్త పాలసీలో కనీస మార్పులు చేసేందుకు కూడా ఫేస్‌బుక్ అనుబంధ సంస్థ సిద్ధంగా లేదు. తాము ముందుగా పేర్కొన్నట్లుగానే కొత్త నిబంధనలు వర్తిస్తాయని, అందులో ఎలాంటి మార్పు లేదని ఫేస్‌బుక్ తాజాగా..whats app;amala akkineni;yajamanya;delhi;whatsapp;court;letter;supreme court;andhra jyothiన్యూ పాలసీపై మరోసారి వివరణ ఇచ్చిన వాట్సాప్ ఆంధ్రజ్యోతిన్యూ పాలసీపై మరోసారి వివరణ ఇచ్చిన వాట్సాప్ ఆంధ్రజ్యోతిwhats app;amala akkineni;yajamanya;delhi;whatsapp;court;letter;supreme court;andhra jyothiFri, 19 Feb 2021 22:32:58 GMTన్యూఢిల్లీ: కొత్త పాలసీపై వాట్సాప్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. భారత్‌లో తమ పాలసీని కచ్చితంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. సుప్రీం కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ తమ కొత్త పాలసీలో కనీస మార్పులు చేసేందుకు  కూడా ఫేస్‌బుక్ అనుబంధ సంస్థ సిద్ధంగా లేదు. తాము ముందుగా పేర్కొన్నట్లుగానే కొత్త నిబంధనలు వర్తిస్తాయని, అందులో ఎలాంటి మార్పు లేదని ఫేస్‌బుక్ తాజాగా చెప్పడం, అంతేకాకుండా కొత్త నిబంధనలు ఏ తేదీ నుంచి అములు జరగనుందో ఆ తేదీని ప్రకటించడం వంటి చర్యలను చూస్తుంటే భారత్‌తో వార్‌కే వాట్సాప్ రెడీ అయినట్లు కనిపిస్తోంది.

వాట్సాప్ తమ ప్రైవసీపై వినియోగదారులకి మరోసారి వివరణ ఇచ్చింది. యాప్ లోని కొత్త నిబంధనలను తప్పనిసరిగా అంగీకరించాలని వాట్సాప్ యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు మే 15 నుంచి నిబంధనలను యూజర్‌కి కనిపించేలా డిస్‌ప్లే చేయనున్నట్లు పేర్కొన్నారు. వాట్సాప్ వ్యక్తిగత గోప్యత పరిరక్షణకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నామని యాజమాన్యం స్పష్టం చేసింది. బిజినెస్ ఖాతాల సమాచారం యూజర్‌ అనుమతిలేనిదే ఎవరితో పంచుకోమని తేల్చి చెప్పింది. వ్యక్తిగత సంభాషణలకు ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్‌ ఉంటుందని, వ్యక్తిగత సంభాషణలను వాట్సాప్ చదవడం, వినడం ఇప్పటి వరకు చేయలేదని, ఇకపై కూడా చేయబోదని వాట్సాప్ యాజమాన్యం వివరణ ఇచ్చింది.

ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం వాట్సాప్ ప్రకటించిన నూతన గోప్యతా విధానం దుమారం రేపిన విషయం తెలిసిందే. వాట్సాప్ యూజర్ సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో పంచుకోనున్నట్లు ఈ నూతన గోప్యతా విధానంలో భాగమని స్పష్టం చేయడమే విమర్శలకు ప్రధాన కారణం. ఆ తర్వాత వాట్సాప్ యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు దిగినప్పటికీ పెద్దగా ప్రయోజనం కనబడలేదు. వాట్సాప్‌పై. అనేక మంది విశ్వాసం కోల్పోయారు. దీంతో వారు సిగ్నల్ యాప్ వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. అనంతరం పెద్ద ఎత్తున  వాట్సాప్ వివరణ ఇచ్చుకుంది. అయినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. తాజాగా ఇచ్చిన వివరణ ఎంత వరకు యూజర్ల నమ్మకాన్ని తిరిగి తెస్తుందో వేచి చూడాలి.


అప్పుడంతా డూప్ అన్నారు.. ఇప్పుడు అదే కరోనిల్‌కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు

'పుష్ప' లో బన్నీకి చెల్లెలిగా నితిన్ హీరోయిన్..!!

పదిహేడేళ్ల అందంతో టాలీవుడ్ లో జోరు...?

హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డకు ఇన్ని షాకులు ఎందుకు తగులుతున్నాయబ్బా ?

మహేష్ కోసం ఏకంగా హాలీవుడ్ స్టార్స్ ని రప్పిస్తున్నారట.....??

నీ బుర్ర ఇంట్లో పెట్టి షూటింగ్ కి రమ్మంటు నాగార్జున ని అవమానించింది ఎవరు .?

హెరాల్డ్ ఎడిటోరియల్ : తొందరలో చంద్రబాబుకు మరో షాక్ తప్పదా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>