PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mutthi-reddybcde5844-1c7a-42fa-9716-d13174bbf6ab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mutthi-reddybcde5844-1c7a-42fa-9716-d13174bbf6ab-415x250-IndiaHerald.jpgజ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి మ‌రోసారి వార్త‌ల్లో నిలిచేలా వ్యాఖ్య‌లు చేశారు. ఈసారి మంత్రుల‌ను టార్గెట్ చేశారు. త‌న కంటే పార్టీలో జూనియ‌ర్ల‌యినా నేత‌ల‌కు మంత్రి ప‌ద‌వులు ల‌భించాయ‌ని, అయినా తాను ఎవ‌రితో గొడ‌వ ప‌డ‌లేద‌ని వ్యాఖ్య‌నించ‌డం విశేషం. ఎమ్మెల్యే వ్యాఖ్య‌లు ఆయ‌న మాట‌ల్లోనే య‌థావిధిగా... టీఆర్ఎస్‌లో నేను కొన్నేళ్లుగా ఎంతో కష్టపడి పని చేస్తున్నాను... పార్టీలోకి నిన్న‌మొన్న వ‌చ్చిన వారికి మంత్రి పదవులు వచ్చినా ఎలాంటి గొడవ పడలేదు. సీఎం కేసీఆర్‌.. కార్యకర్తలు, నేతలకు సముచిత ప్రాధాన్యmutthi reddy;tara;mp;district;mla;minister;party;mantraనిన్న గాక మొన్న వ‌చ్చిన నా జూనియ‌ర్ల‌కు మంత్రి ప‌ద‌వులు... ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లునిన్న గాక మొన్న వ‌చ్చిన నా జూనియ‌ర్ల‌కు మంత్రి ప‌ద‌వులు... ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లుmutthi reddy;tara;mp;district;mla;minister;party;mantraFri, 19 Feb 2021 09:51:05 GMTఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి మ‌రోసారి వార్త‌ల్లో నిలిచేలా వ్యాఖ్య‌లు చేశారు. ఈసారి మంత్రుల‌ను టార్గెట్ చేశారు. త‌న కంటే పార్టీలో జూనియ‌ర్ల‌యినా నేత‌ల‌కు మంత్రి ప‌ద‌వులు ల‌భించాయ‌ని, అయినా తాను ఎవ‌రితో గొడ‌వ ప‌డ‌లేద‌ని వ్యాఖ్య‌నించ‌డం విశేషం. ఎమ్మెల్యే వ్యాఖ్య‌లు ఆయ‌న మాట‌ల్లోనే య‌థావిధిగా... టీఆర్ఎస్‌లో  నేను కొన్నేళ్లుగా ఎంతో కష్టపడి పని చేస్తున్నాను... పార్టీలోకి నిన్న‌మొన్న వ‌చ్చిన వారికి మంత్రి పదవులు వచ్చినా ఎలాంటి గొడవ పడలేదు. సీఎం కేసీఆర్‌.. కార్యకర్తలు, నేతలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చి ఏ సమస్యకైనా పరిష్కారం చూపుతారంటూ.. పేర్కొన్నారు. త‌న అసంతృప్తిని తెలియ‌జేస్తునే.. మ‌రోవైపు కేసీఆర్‌పై న‌మ్మ‌కం ముంద‌ని ప‌నిచేసేవారికి న్యాయం చేస్తార‌ని కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి పేర్కొన‌డం విశేషం.


గురువారం  జ‌న‌గామ‌లో పార్టీ స‌భ్య‌త్వ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే ఈ వ్యాఖ్య‌లు చేశారు. జ‌న‌గామ జిల్లా స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మ‌ ఇంచార్జ్  మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవితతో కలిసి నియోజకవర్గ స్థాయి సభ్యత్వ నమోదును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎ్‌సలో కార్యకర్తలకు సముచితమైన ప్రాధాన్యాన్ని కల్పించేందుకు అధిష్టానం చర్యలు తీసుకుంటుంది. ఇక నుంచి పార్టీ శ్రేణులు చెప్పిందే వేదం. కార్యకర్తలు సూచించిన వారికే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయి అని చెప్పారు. గ్రామాలు, పట్టణాలలో ఇకపై పార్టీ కార్యకర్తలు సూచించిన వారికే ఇళ్ల్లు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల మంజూరు జరుగుతుందన్నారు.


తాను కూడా కార్యకర్తల ప్రాధాన్యం కోసం ఇదే పద్ధతిని అవలంభిస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సూర్యచంద్రులు ఉన్నంత వరకూ టీఆర్‌ఎస్‌ పార్టీ బతికే ఉంటుందని, రెండు దశాబ్దాల తరువాత కేసీఆర్‌ తదనంతరం సీఎం పగ్గాలు చేపట్టేందుకు పార్టీలో సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడని అన్నారు. ఇదిలా ఉండ‌గా ముత్తిరెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఓరుగ‌ల్లు రాజ‌కీయాల్లోనే కాదు.. రాష్ట్ర రాజ‌కీయాల్లోనూ కాక పుట్టిస్తున్నాయి. పార్టీలో అనేక మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ర‌గిలిపోతున్నార‌ని అన‌డానికి ముత్తిరెడ్డి వ్యాఖ్య‌లే నిద‌ర్శ‌న‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.






ప్రపంచంలో అత్యంత ఖరీదైన ద్రవపదార్థం ఏంటో తెలుసా..?

పుర పోరు: క‌ర‌ణంను జ‌గ‌న్ ప‌క్క‌కు తోసేస్తాడా... ఏం జ‌రుగుతోంది ?

పుర పోరు: వైసీపీ నేత కెరీర్‌కు అగ్నిప‌రీక్ష‌గా మారిన ఎన్నిక‌... తేడా వ‌స్తే జ‌గ‌న్ సైడ్ చేసేస్తాడా ?

ఎన్.టి.ఆర్ తోనే ఉప్పెన బుచ్చి బాబు.. బ్యాక్ డ్రాప్ కథ రెడీ..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బీజేపీ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లో బ్రాహ్మ‌ణుల పాత్ర ఎంత ‌?

కాపు వేద‌న‌: పాలిటిక్సే కాదు.. ఆర్థిక వెత‌ల్లోనూ కాపులే ఫ‌స్ట్..‌!

పుర పోరు : విశాఖ షాక్ ఎవరికి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>