PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-k-nageswar208cef72-ad6f-4c12-9611-c72fef472d0c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-k-nageswar208cef72-ad6f-4c12-9611-c72fef472d0c-415x250-IndiaHerald.jpgవిశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటు పరం చేయాలనుకుంటోంది. ఈ విషయం బహిరంగంగానే చెప్పింది. ఇందుకు కారణం కూడా చెప్పింది.. విశాఖ ఉక్కు నష్టాల ఊబిలో కూరుకుపోతోంది. అందుకే ప్రైవేటు చేస్తున్నామని చెప్పింది. ఈ అంశంపై ఇప్పటికే ప్రధానికి లేఖరాసిన ఏపీ సీఎం జగన్.. నిన్న విశాఖ వెళ్లారు. అక్కడ కార్మిక నాయకులతో మాట్లాడారు. విశాఖ ఉక్కును కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. అదే సమయలో విశాఖ ఉక్కు లాభాల బాట పట్టే ఐడియా చెప్పారు జగన్. స్టీల్‌ప్లాంట్‌కు దాదాపు 20 వేల ఎకరాల భూములు ఉన్నాయి.. వాటిలో స్టీల్‌ ప్లాంట్‌కు ఉపయోగించjagan-k-nageswar;jagan;andhra pradesh;industries;vishakapatnam;professor;central government;ideaజగన్‌ ప్రతిపాదన శుద్ధ వేస్ట్.. కుండబద్దలు కొట్టిన ప్రొ.నాగేశ్వర్!?జగన్‌ ప్రతిపాదన శుద్ధ వేస్ట్.. కుండబద్దలు కొట్టిన ప్రొ.నాగేశ్వర్!?jagan-k-nageswar;jagan;andhra pradesh;industries;vishakapatnam;professor;central government;ideaFri, 19 Feb 2021 00:00:00 GMTవిశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటు పరం చేయాలనుకుంటోంది. ఈ విషయం బహిరంగంగానే చెప్పింది. ఇందుకు కారణం కూడా చెప్పింది.. విశాఖ ఉక్కు నష్టాల ఊబిలో కూరుకుపోతోంది. అందుకే ప్రైవేటు చేస్తున్నామని చెప్పింది. ఈ అంశంపై ఇప్పటికే ప్రధానికి లేఖరాసిన ఏపీ సీఎం జగన్.. నిన్న  విశాఖ వెళ్లారు. అక్కడ కార్మిక నాయకులతో మాట్లాడారు. విశాఖ ఉక్కును కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. అదే సమయలో విశాఖ ఉక్కు లాభాల బాట పట్టే  ఐడియా చెప్పారు జగన్.

స్టీల్‌ప్లాంట్‌కు దాదాపు 20 వేల ఎకరాల భూములు ఉన్నాయి.. వాటిలో స్టీల్‌ ప్లాంట్‌కు ఉపయోగించని భూమి కనీసం 7 వేల ఎకరాలు ఉంటుందని అంచనా. ఆ భూమిని వాణజ్యంగా ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం నుంచి ల్యాండ్‌ యూజ్‌ కన్వర్షన్‌కు అనుమతి ఇస్తామంటున్నారు జగన్. ఆ భూమిని ప్లాట్లు, లేఅవుట్లు వేసి విశాఖ స్టీల్ పరిశ్రమ ద్వారానే అమ్మించాలని జగన్ అంటున్నారు. అలా అమ్మగా వచ్చిన డబ్బును స్టీల్‌ప్లాంట్‌లోనే పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పరిశ్రమలో ఒకేసారి నగదు నిల్వలు పెరుగుతాయని.. ఇవన్నీ అమలైతే ప్రైవేటువారికి ఇవ్వాల్సిన అవసరం ఉండదని జగన్ అంటున్నారు.


అయితే.. స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నుంచి కాపాడేందుకు ఆ సంస్థకు ఉన్న 7 వేల ఎకరాల భూమిని అమ్మాలన్న సీఎం జగన్ ప్రతిపాదనను ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ తప్పుబట్టారు. భూములు అమ్మకం ఎప్పుడూ సమస్యకు పరిష్కారం కాదన్నారు. రేపు భవిష్యత్‌లో విశాఖ స్టీల్ పరిశ్రమ విస్తరించదలిస్తే.. అప్పుడు భూములు దొరకవని ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ గుర్తు చేశారు. భూమి అనేది పునరుత్పాదన చేయలేని వనరు అని ఆయన గుర్తు చేశారు.


స్టీల్ అవసరం రోజురోజుకూ పెరుగుతూనే ఉంటుందని.. భవిష్యత్ అవసరాల కోసం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను విస్తరించాల్సిన అవసరం వస్తుందని.. అప్పుడు భూములు ఎక్కడ దొరుకుతాయని ప్రశ్నించారు. అసలు భూముల అమ్మకుండానే విశాఖను లాభదాయకం చేయవచ్చని ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ సూచించారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించడం లేదా.. సెయిల్ వంటి సంస్థలతో అనుసంధానిస్తే ప్రైవేటీకరణ సమస్యే ఉండదన్నారు.




అల్లరి నరేష్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

రాధే శ్యామ్ కోసం ఏకంగా రైల్వేస్టేషన్ కట్టేశారా..!

మన వంటలక్క ఎంత పెద్ద చదువు చదివిందో తెలుసా..?

జగన్ అన్న ఒక్క మాట..... బీజేపీకి బ్రహ్మాస్త్రమా...?

జగడ్డ : భీమిలీ కంచుకోటలో పసందైన పంచాయతీ..?

జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భార్య గురించి ఆసక్తికర విషయాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>