MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-khushi9d8c4c85-4960-47c9-9262-0c6e77b8c416-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-khushi9d8c4c85-4960-47c9-9262-0c6e77b8c416-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన భారీ ఇండస్ట్రీ హిట్ మూవీ ఖుషి. 2001లో మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో గొప్ప సక్సెస్ సాధించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అతి పెద్ద హిట్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ని తెచ్చి పెట్టింది. భూమిక హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించారు. pawan kalyan;khushi;pawan;bhumika chawla;kalyan;kushi;mani sharma;pawan kalyan;s j surya;surya sivakumar;apherald;tollywood;cinema;festival;producer;industry;tiger;producer1;heroine;successమరొకసారి రిపీట్ కానున్న 'ఖుషి' కాంబినేషన్....పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పండగే ....??మరొకసారి రిపీట్ కానున్న 'ఖుషి' కాంబినేషన్....పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పండగే ....??pawan kalyan;khushi;pawan;bhumika chawla;kalyan;kushi;mani sharma;pawan kalyan;s j surya;surya sivakumar;apherald;tollywood;cinema;festival;producer;industry;tiger;producer1;heroine;successFri, 19 Feb 2021 19:30:34 GMTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన భారీ ఇండస్ట్రీ హిట్ మూవీ ఖుషి. 2001లో మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో గొప్ప సక్సెస్ సాధించి  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అతి పెద్ద హిట్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ని తెచ్చి పెట్టింది. భూమిక హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించారు.

శ్రీ సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా పలు కేంద్రాల్లో భారీ స్థాయిలో కలెక్షన్లు ఆర్జించింది. అయితే ఆ తర్వాత మరొక సారి పవన్, ఎస్ జె సూర్య కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ సినిమా కొమరం పులి. అయితే ఆ సినిమా మాత్రం ఆశించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయింది. మంచి ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పవర్ స్టార్ క్యారెక్టర్ అదిరిపోయినప్పటికీ కథాకథనాలు ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో ఈ మూవీ పరాజయం పాలైంది. ఇక లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి చాలా గ్యాప్ తర్వాత మరొకసారి పవర్ స్టార్ కోసం ఒక వండర్ఫుల్ స్టోరీ ని సిద్ధం చేసిన దర్శకుడు సూర్య ఇటీవల దానిని ఆయనకు వినిపించారని అంటున్నారు.

నిజానికి ఈ స్టొరీ ని ఎప్పుడో పవర్ స్టార్ కి చెబుదామని భావించిన సూర్య మధ్యలో ఆయన రాజకీయాల్లో బిజీ కావడంతో దానిని పక్కన పెట్టారని అలాగే ప్రస్తుతం వరుసగా పవన్ సినిమాలు చేస్తుండటంతో సూర్య కూడా పవన్ ని కలిసి స్టోరీ వినిపించినట్లు చెప్తున్నారు. అయితే సూర్య చెప్పిన కథ ఎంతో నచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాను చేస్తున్న కమిట్మెంట్స్ పూర్తయిన అనంతరం దానిని పట్టాలెక్కిద్దాం అంటూ మాట ఇచ్చినట్లు సమాచారం. టాలీవుడ్ కి చెందిన ఒక అగ్ర నిర్మాణ సంస్థ ఎంతో గ్రాండ్ లెవల్లో భారీగా నిర్మించనున్న ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందని తప్పకుండా చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఖుషి కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకోవడం ఖాయమని సమాచారం. మరి ఇదే గనుక నిజమైతే పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది మంచి పండుగ న్యూస్ అని చెప్పక తప్పదు......!!


రాజకీయ పార్టీలకు హైదరాబాద్ పోలీసులు షాక్...!

'పుష్ప' లో బన్నీకి చెల్లెలిగా నితిన్ హీరోయిన్..!!

ఐదెకరాల లోపు ఉంటేనే రైతు బంధు..?

పదిహేడేళ్ల అందంతో టాలీవుడ్ లో జోరు...?

హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డకు ఇన్ని షాకులు ఎందుకు తగులుతున్నాయబ్బా ?

మహేష్ కోసం ఏకంగా హాలీవుడ్ స్టార్స్ ని రప్పిస్తున్నారట.....??

నీ బుర్ర ఇంట్లో పెట్టి షూటింగ్ కి రమ్మంటు నాగార్జున ని అవమానించింది ఎవరు .?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>