PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/face-paralysis-to-13-people-who-took-corona-vaccinebc59fe34-13c8-4e94-9c4f-111ee418e8a5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/face-paralysis-to-13-people-who-took-corona-vaccinebc59fe34-13c8-4e94-9c4f-111ee418e8a5-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సిన్ విషయంలో కాస్త ఆసక్తికర పరిణామాలు ఉంటున్నాయి. చాలా మంది వ్యాక్సిన్ విషయంలో ఆసక్తి చూపించడం లేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తమవుతుంది. తాజాగా కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఎండి.ఇంతియాజ్‌ కీలక వ్యాఖ్యలు చేసారు. నేడు కరోనా పట్ల ప్రజల నిర్లక్ష్యం కనిపిస్తుంది అని ఆయన అన్నారు. కరోనా మళ్లీ విజృభిస్తుంది, అందరు జాగ్రత్త వహించాలి అని ఆయన సూచించారు. కరోనా వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేసారు. కరోనా పట్ల,కరోనా వ్యాక్సిన్‌ పట్ల ప్రజల నిర్లక్vaccine;krishna river;andhra pradesh;cinema;collectorషాకింగ్: కృష్ణా జిల్లాలో వ్యాక్సిన్ వద్దంటున్నారు...?షాకింగ్: కృష్ణా జిల్లాలో వ్యాక్సిన్ వద్దంటున్నారు...?vaccine;krishna river;andhra pradesh;cinema;collectorFri, 19 Feb 2021 20:54:30 GMTఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సిన్ విషయంలో కాస్త ఆసక్తికర పరిణామాలు ఉంటున్నాయి. చాలా మంది వ్యాక్సిన్ విషయంలో ఆసక్తి చూపించడం లేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తమవుతుంది. తాజాగా కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఎండి.ఇంతియాజ్‌ కీలక వ్యాఖ్యలు చేసారు. నేడు కరోనా పట్ల ప్రజల నిర్లక్ష్యం కనిపిస్తుంది అని ఆయన అన్నారు. కరోనా మళ్లీ విజృభిస్తుంది, అందరు జాగ్రత్త వహించాలి అని ఆయన సూచించారు. కరోనా వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేసారు.

కరోనా పట్ల,కరోనా వ్యాక్సిన్‌ పట్ల ప్రజల నిర్లక్ష్యం కనిపిస్తోంది అని ఆయన అన్నారు. కరోనా నుంచి బయటపడ్డామనే భావనలో నుంచి ప్రజలు బయటకురావాలి  అని ఆయన సూచించారు. ఇకపై అందరు మాస్క్‌లు ధరించి, కరోనా నిబంధనలు పాటించాలి అని తెలిపారు. సినిమా హాల్స్‌, హోటళ్లు, వ్యాపార కూడళ్లు, కార్పొరేట్‌ సంస్ధల కార్యాలయాల వద్ద  కరోనా జాగ్రత్తలు పాటించటం లేదు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో బెడ్లు లేనంతగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి అని తెలిపారు.

ఆ పరిస్థితి మళ్ళీ మనం తెచ్చుకోకూడదు అని ఆయన సూచించారు. రాష్ర్టంలో కరోనా వాక్సిన్ మూడవ దశతో ప్రజల ముందుకు తీసుకురానున్నాము అని అన్నారు. హెల్త్ వర్కర్లు కరోనా వాక్సిన్ తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు  అని అన్నారు. ఇతర దేశాల్లో వ్యాక్సిన్‌ దొరకక ఇబ్బంది పడుతున్నారు,మన రాష్ర్టంలో వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు అని, ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేసినా వ్యాక్సిన్‌ కోసం ముందుకు రావటం లేదు అని అన్నారు. 55 సంవత్సరాలు ఉన్న నేను కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నాను, నాకు ఎటువంటి చిన్న పాటి ఇబ్బంది లేదు అని కలెక్టర్ అన్నారు అందరికీ ఒకటే మనవి కరోనా పట్ల నిర్లక్ష్యం వహించవద్దు, వ్యాక్సిన్‌ తీసుకునేందుకు అందరూ ముందుకు రావాలి అని కోరారు.


రాజకీయ పార్టీలకు హైదరాబాద్ పోలీసులు షాక్...!

'పుష్ప' లో బన్నీకి చెల్లెలిగా నితిన్ హీరోయిన్..!!

ఐదెకరాల లోపు ఉంటేనే రైతు బంధు..?

పదిహేడేళ్ల అందంతో టాలీవుడ్ లో జోరు...?

హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డకు ఇన్ని షాకులు ఎందుకు తగులుతున్నాయబ్బా ?

మహేష్ కోసం ఏకంగా హాలీవుడ్ స్టార్స్ ని రప్పిస్తున్నారట.....??

నీ బుర్ర ఇంట్లో పెట్టి షూటింగ్ కి రమ్మంటు నాగార్జున ని అవమానించింది ఎవరు .?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>