MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kruti-settidd158963-205a-43cd-8b7e-e232b182e63b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kruti-settidd158963-205a-43cd-8b7e-e232b182e63b-415x250-IndiaHerald.jpgవయసు పదహారు...సొగసు జలతారు అంటారు శృంగార కవులు. అలా అందం ఉన్నపుడే అవకాశాలు కూడా వెంటపడి మరీ వస్తాయి. గ్లామర్ ఫీల్డ్ లో అందమైన హీరోయిన్లకు ఎపుడూ డిమాండ్ ఉంటుంది. అయితే అందంతో పాటు రవ్వంత అదృష్టం కూడా ఉండాలి. ఈ రెండు జత కలిస్తేనే స్టార్ స్టాటస్ ని రీచ్ అవుతారు. kruti setti;nani;ram pothineni;shyam;tara;tollywood;cinema;telugu;tamil;love;heroineపదిహేడేళ్ల అందంతో టాలీవుడ్ లో జోరు...?పదిహేడేళ్ల అందంతో టాలీవుడ్ లో జోరు...?kruti setti;nani;ram pothineni;shyam;tara;tollywood;cinema;telugu;tamil;love;heroineFri, 19 Feb 2021 19:30:00 GMT
ఇదిలా ఉంటే ఇపుడు టాలీవుడ్ కి ఒక టీనేజ్ అందం పరిచయం అయింది. ఆమె ఉప్పెనలా దూసుకువచ్చింది. కుర్రకారు గుండెల్లో గూడు కట్టేసుకుంది. ఫస్ట్ మూవీ హిట్ కావడమే లక్ అనుకుంటే అంతకంటే ఎక్కువగా సూపర్ డూపర్ హిట్ అయింది ఉప్పెన. దాంతో అందులో నటించిన హీరోయిన్ కృతి శెట్టికి అవకాశాలు వెల్లువలా వచ్చేస్తున్నాయి. కృతి శెట్టి గొప్పతనం ఏంటి అంటే అచ్చ తెలుగు అమ్మాయిలా ఉండడం. దాంతో తెలుగుతనం ఉట్టిపడే ఈ అమ్మడుతో సినిమాలు చేసేందుకు అటు నిర్మాతలు ఇటు హీరోలు రెడీ అవుతున్నారు. కృతి ఇమ్మీడియెట్ గా కమిట్ అయిన మూవీ నాచురల్ స్టార్ నాని తో శ్యామ్ సింగరాయ్. ఈ మూవీలో ఒక హీరోయిన్ గా కృతి నటిస్తోంది.

అదే విధంగా లేటెస్ట్ గా వినిపిస్తున్న మరో టాక్ ఏంటి అంటే ఎనర్జిటిక్  స్టార్ పోతినేని రామ్ పక్కన హీరోయిన్ గా బుక్ అయిందని. తమిళ దర్శకుడు లింగు స్వామి డైరెక్షన్ లో  రామ్  నటించబోయే కొత్త చిత్రలో కృతి ని హీరోయిన్ గా ఫిక్స్ చేశారని టాక్. మరి ఈ అమ్మడు కోసం మరిన్ని సినిమాలు కూడా క్యూలో ఉన్నాయట. అమాయకత్వంతో కూడిన అందంతో ఉన్న ఈ ముద్దుగుమ్మతో ఎన్ని రకాలైన పాత్రలు అయినా చేయించవచ్చు అన్నది ఫిల్మ్ మేకర్ల ఆలోచన. అందులోనూ టీనేజ్ లో ఉన్న ఈ ముద్దు గుమ్మ లవ్ స్టోరీస్ కి కూడా పెర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని ఉప్పెన నిరూపించింది.మొత్తానికి ఈ సినిమా తో కృతి  దశ తిరిగింది అంటున్నారు.




రాజకీయ పార్టీలకు హైదరాబాద్ పోలీసులు షాక్...!

'పుష్ప' లో బన్నీకి చెల్లెలిగా నితిన్ హీరోయిన్..!!

ఐదెకరాల లోపు ఉంటేనే రైతు బంధు..?

హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డకు ఇన్ని షాకులు ఎందుకు తగులుతున్నాయబ్బా ?

మహేష్ కోసం ఏకంగా హాలీవుడ్ స్టార్స్ ని రప్పిస్తున్నారట.....??

నీ బుర్ర ఇంట్లో పెట్టి షూటింగ్ కి రమ్మంటు నాగార్జున ని అవమానించింది ఎవరు .?

హెరాల్డ్ ఎడిటోరియల్ : తొందరలో చంద్రబాబుకు మరో షాక్ తప్పదా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>