Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/liver0203c381-6fa2-49c0-af4c-0bc1b8949286-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/liver0203c381-6fa2-49c0-af4c-0bc1b8949286-415x250-IndiaHerald.jpgమన శరీరంలో ముఖ్యమైన అవయవము లివర్. అనేక కారణాల వల్ల సమస్యలు లివర్ను చుట్టుముడుతున్నాయి ఒక్కసారి ప్రమాదకర సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. వీటన్నిటిని ట్రీట్మెంట్ సరిచేసుకోవచ్చు. అలాగే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల లివర్ ను ఆరోగ్యంగా ఉంచే వచ్చు. ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాంliver;apple;vitamin;heart;cancer;fats;oil;coffeeలివర్ ఆరోగ్యంగా ఉండాలంటే, ఈ పదార్థాలు తీసుకోవాలి...లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే, ఈ పదార్థాలు తీసుకోవాలి...liver;apple;vitamin;heart;cancer;fats;oil;coffeeFri, 19 Feb 2021 06:00:00 GMT ఒక్కసారి ప్రమాదకర సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. వీటన్నిటిని ట్రీట్మెంట్  సరిచేసుకోవచ్చు. అలాగే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల లివర్ ను ఆరోగ్యంగా ఉంచే వచ్చు. ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

 కాఫీ తాగడం వల్ల రిలాక్స్ అవడమే కాకుండా లివర్ ఆరోగ్యంగా ఉంటుందని కొన్ని పరిశోధనలు తేల్చాయి. కాఫీలో కొన్ని ప్రత్యేకమైన గుణాల వల్ల లివర్ క్యాన్సర్ రాకుండా చేస్తాయని తేలింది.  అందుకే రోజూ కాఫీ తాగడం మంచిది.

 టీ తాగడం వల్ల కూడా లివరు ఆరోగ్యంగా ఉంటుంది. కాలేయాన్ని కాపాడడంలో టీ కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది. అలాగే టీ తాగడం వల్ల ఒత్తిడి దూరమవుతుంది.

 ద్రాక్షలో ఉండే ఆంటీయాక్సిడెంట్లు లివర్ ని  కాపాడ్డానికి సహాయపడతాయి. అందుకే ద్రాక్షను డైట్ లో చేర్చుకోవాలి.

 బ్లూ బెర్రీస్, క్రాన్ బెర్రీస్ వీటిలో ఆంథోసియానిన్స్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల కాలేయము ఆరోగ్యంగా ఉంటుంది.

 వెల్లుల్లిలో అనేక అద్భుత  గుణాలు ఉన్నాయి. వెల్లుల్లిని  రోజు తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సీన్స్ తొలగిపోతాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ను  తగ్గిస్తుంది. అలాగే కీళ్ళ నొప్పిని  నొప్పిని నివారిస్తుంది. కాలేయ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

 బీట్ రూట్, క్యారెట్ బంగాళాదుంపలు వీటిని  రోజూ తీసుకోవడం వల్ల కాలేయ కణాల పునరుత్పత్తి కి సహాయపడతాయి. అలాగే లివర్ ను  ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా లివర్ పనితీరును మెరుగు పడుతుంది.

 యాపిల్ లో ఫైబర్, కొవ్వు  పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. సోడియం, పొటాషియం తక్కువగా ఉండటం వల్ల కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా ఆపిల్ లో ఉండే మ్యాలీక్ యాసిడ్ పేగులు, కాలేయం, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

 ఆకుకూరలు తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్లు ప్రొటీన్లు బాగా  అందుతాయి. వీటిలో కొవ్వు శాతం తక్కువగా ఉండటం వల్ల శరీరంలోని  మలినాలను బయటకు పంపుతాయి.

 క్యాబేజీని తీసుకోవడం వల్ల కాలేయాన్ని శుభ్రపరిచి, ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే క్యాబేజీని డైట్ లో చేర్చుకోవాలి.

 నట్స్ లో గుడ్ ఫ్యాట్స్, చాలా పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ ఇవన్నీ కూడా లివర్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి.

 చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు లివర్ ని కాపాడటంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. అంతేకాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

 ఆలివ్ ఆయిల్ ను తీసుకోవడం వల్ల కూడా లివర్ ఆరోగ్యంగా ఉంటుందని పరిశోధనలో తేలింది. అంతేకాకుండా గుండె కూడా  ఆరోగ్యంగా ఉంటుందని తేలింది.


ప్లాస్టిక్ కప్పుల్లో టీ తాగితే క్యాన్సర్ వస్తుందంటా..!

అల్లరి నరేష్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

రాధే శ్యామ్ కోసం ఏకంగా రైల్వేస్టేషన్ కట్టేశారా..!

మన వంటలక్క ఎంత పెద్ద చదువు చదివిందో తెలుసా..?

జగన్ అన్న ఒక్క మాట..... బీజేపీకి బ్రహ్మాస్త్రమా...?

జగడ్డ : భీమిలీ కంచుకోటలో పసందైన పంచాయతీ..?

జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>