Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/jhye-richardson-expressed-he-got-exhausted-after-ipl2021-auction66251b29-072c-4e63-b68e-bd4902acba65-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/jhye-richardson-expressed-he-got-exhausted-after-ipl2021-auction66251b29-072c-4e63-b68e-bd4902acba65-415x250-IndiaHerald.jpg ‘ఐపీఎల్ వేలం చూస్తే గురువారమే ఓ మ్యాచ్ ఆడినట్లనిపించింది. అంత ధర పలుకడం నమ్మలేకపోతున్నాను. ఈ వేలం నా జీవితాన్నే మార్చేసింది’ అని ఆసీస్ యువ బౌలర్ జ్యే రిచర్డ్‌సన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. జ్యేను పంజాబ్ కింగ్స్ జట్టు రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. తాను ఇంత ధర పలకడంపై ఆందోళనతో పాటు..ipl 2021 auction;rani;job;yuva;international;icc t20;punjabవామ్మో..నాకు అన్ని కోట్లిచ్చారా.. ఆందోళనలో ఆసీస్ బౌలర్వామ్మో..నాకు అన్ని కోట్లిచ్చారా.. ఆందోళనలో ఆసీస్ బౌలర్ipl 2021 auction;rani;job;yuva;international;icc t20;punjabFri, 19 Feb 2021 18:55:34 GMTయువ బౌలర్ జ్యే రిచర్డ్‌సన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. జ్యేను పంజాబ్ కింగ్స్ జట్టు రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. తాను ఇంత ధర పలకడంపై ఆందోళనతో పాటు ఆశ్చర్యం కూడా కలుగుతోందని అన్నాడు. తాను ఇంత ధర పలుకుతానని ఎన్నడూ అనుకోలేదని, ఇదంతా కలలా ఉందని జ్యే చెప్పుకొచ్చాడు.
     
జ్యే రిచర్డ్‌సన్ ఆసీస్ తరపున అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఆడాడు. త్వరలో న్యూజిల్యాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌లో పాల్గొనడం కోసం జ్యే ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాడు. ఆసీస్‌కు టీ20ల్లో కీలక బౌలర్‌గా జ్యే ఉన్నాడు. ఇక ఇటీవల జరిగిన బిగ్‌బ్యాష్‌లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్ తరపున ఆడిన రిచర్డ్‌సన్ అద్భుత ప్రదర్శన చేశాడు. టోర్నీలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 7.69 సగటుతో పవర్‌ ప్లే, పవర్ సర్జ్, డెత్ ఓవర్లనే తేడా లేకుండా పొదుపైన బౌలింగ్ వేయడమే కాకుండా కీలక వికెట్లను తీసి ప్రత్యర్థులను దెబ్బకొట్టాడు.

బౌలింగ్‌లో మాత్రమే కాకుండా బ్యాటింగ్‌లో కూడా జ్యే రాణించగలడు. బిగ్‌బ్యాష్ లీగ్-10లో 19.20 సగటుతో బ్యాటుతో కూడా జ్యే అనేకసార్లు రాణించాడు. అనేకాసార్లు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాడు. దీంతో అతడిపై ఐపీఎల్ ఫ్రాంచైజీల కన్ను పడింది. అతడిని దక్కించుకుంటే కింది స్థాయి వరకు బ్యాటింగ్ చేయడమే కాకుండా బౌలింగ్ కూడా బలపడుతుందని పంజాబ్ భావించింది. ఈ క్రమంలోనే అతడిని దక్కించుకునేందుకు బెంగళూరు, పంజాబ్ జట్లు పోటీ పడ్డాయి. అయితే చివరకి పంజాబ్ సొంతం చేసుకుంది. జ్యే మాత్రమే కాకుండా ఆస్ట్రేలియాకే చెందిన అన్‌క్యాప్డ్ ప్లేయర్ రైలీ మెరిడిత్‌ను కూడా రూ.8 కోట్ల రికార్డు ధరకు పంజాబ్ కొనుగోలు చేసింది.




రాజకీయ పార్టీలకు హైదరాబాద్ పోలీసులు షాక్...!

'పుష్ప' లో బన్నీకి చెల్లెలిగా నితిన్ హీరోయిన్..!!

ఐదెకరాల లోపు ఉంటేనే రైతు బంధు..?

పదిహేడేళ్ల అందంతో టాలీవుడ్ లో జోరు...?

హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డకు ఇన్ని షాకులు ఎందుకు తగులుతున్నాయబ్బా ?

మహేష్ కోసం ఏకంగా హాలీవుడ్ స్టార్స్ ని రప్పిస్తున్నారట.....??

నీ బుర్ర ఇంట్లో పెట్టి షూటింగ్ కి రమ్మంటు నాగార్జున ని అవమానించింది ఎవరు .?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>