PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/petro-is-known-to-cause-firesdcfd9022-de8c-45f4-88c9-1634e5e4c2e1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/petro-is-known-to-cause-firesdcfd9022-de8c-45f4-88c9-1634e5e4c2e1-415x250-IndiaHerald.jpgఅంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ధర 110 డాలర్లు ఉన్న సమయంలోనూ.. దేశంలో పెట్రోల్ ధర లీటర్‌కు 75 రూపాయలు మించలేదు. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ క్రూడ్ 60 డాలర్లకే లభిస్తుంటే.. పెట్రోల్ ధర మాత్రం వంద మార్కును టచ్ అవుతోంది. దీనికి కారణం క్రూడ్‌కు 30శాతం చెల్లిస్తున్న ప్రజలు.. కేంద్ర, రాష్ట్రాలకు పన్నుల రూపంలో 70 శాతం చెల్లించాల్సి వస్తోంది. గతేడాది కరోనా సమయంలో క్రూడ్ ధరలు భారీగా పతనమైనప్పుడు కూడా.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు.. లీటర్ పెట్రోల్ ధరపై 70 రూపాయలు వసూలు చేశాయి. ఇప్పుడు ధరpetro is known to cause fires;modi;petrol;diesel;central government;internationalపెట్రో మంటలు పుట్టించేదెవరో తెలిసిపోయింది..!పెట్రో మంటలు పుట్టించేదెవరో తెలిసిపోయింది..!petro is known to cause fires;modi;petrol;diesel;central government;internationalFri, 19 Feb 2021 16:30:47 GMTపెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ పోతున్నాయి. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర 90 రూపాయల పైమాటే పలుకుతోంది. ఇక రాజస్థాన్‌లో వంద గంట కొట్టేసింది. ఇంకా పైపైకి ధరలు పెరుగుతూనే పోతున్నాయి. వీటిని నియంత్రించాల్సిన కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు.. నెపాన్ని ఎదుటివారిపైకి నెట్టేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ధర 110 డాలర్లు ఉన్న సమయంలోనూ.. దేశంలో పెట్రోల్ ధర లీటర్‌కు 75 రూపాయలు మించలేదు.  ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ క్రూడ్ 60 డాలర్లకే లభిస్తుంటే.. పెట్రోల్ ధర మాత్రం వంద మార్కును టచ్ అవుతోంది. దీనికి కారణం క్రూడ్‌కు 30శాతం చెల్లిస్తున్న ప్రజలు.. కేంద్ర, రాష్ట్రాలకు పన్నుల రూపంలో 70 శాతం చెల్లించాల్సి వస్తోంది. గతేడాది కరోనా సమయంలో క్రూడ్ ధరలు భారీగా పతనమైనప్పుడు కూడా.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు.. లీటర్ పెట్రోల్ ధరపై 70 రూపాయలు వసూలు చేశాయి. ఇప్పుడు ధరలు పెరుగుదలను ప్రస్తావిస్తున్న ప్రభుత్వాలు.. అప్పుడెందుకు తగ్గించలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఎకనమిక్ టైమ్స్ లెక్కప్రకారం.. మూడేళ్లలో కేంద్ర, రాష్ట్రాలు.. ప్రజల నుంచి 14 లక్షల కోట్లు వసూలు చేశాయి. క్రూడ్ ధరల్లో మార్పు వల్ల ప్రభావితమయ్యేది కేవలం 30శాతం ధర మాత్రమే. మిగిలి 70 శాతం కేంద్ర, రాష్ట్రాల ఖజానాలోకి చేరుతోంది.సాదారణంగా పెట్రోల్, డీజిల్ ధరలపై సుంకం విధిస్తే..దాన్ని రాష్ట్రాలతో కేంద్రం పంచుకోవాల్సి ఉంటుంది. అందుకే మోడీ ప్రభుత్వం సుంకానికి బదులు.. సెస్ వేయడం మొదలు పెట్టింది. సెస్ విధిస్తే.. అది మొత్తం కేంద్రం ఖజానాకు చెందుతుంది. రానున్న ఏడాదిలో కేంద్రం.. పెట్రోల్, డీజిల్ పై సెస్ ద్వారా.. 3.2 లక్షల కోట్లు వసూలు చేయనుంది. ఇందులో రాష్ట్రాలకు వెళ్లేది కేవలం 7 వేల  కోట్లు కూడా ఉండదు.దీంతో  పన్ను తగ్గింపులు చేసి, ఆదాయం తగ్గించుకునేందుకు ..రాష్ట్రాలు సిద్ధంగా లేవు.


తన లవ్ గురించి చెప్పేసిన వైష్ణవ్.. కాలేజ్ లో సీనియర్ తో ఎఫైర్..?

నీ బుర్ర ఇంట్లో పెట్టి షూటింగ్ కి రమ్మంటు నాగార్జున ని అవమానించింది ఎవరు .?

హెరాల్డ్ ఎడిటోరియల్ : తొందరలో చంద్రబాబుకు మరో షాక్ తప్పదా ?

పురపోరు : తాడిపత్రిలో హాట్ టాపిక్ గా మారిన జేసీ మేలుకొలుపు...దానికే సంకేతమా ?

ఆర్జీవి అప్సరా రాణి.. సీటీమార్ లో ఐటం సాంగ్ రచ్చ రంబోలా..!

రష్మి మొదటిసారి బుల్లితెర మీద రెచ్చిపోయింది.. వామ్మో నా తప్పు ఏముందబ్బా అంటూ..!

యాక్టర్ ప్రసాద్ బాబు కొడుకు, కోడలు గురించి బయటపడ్డ నిజాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>