PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/yelamancilie600efa5-e07f-47a7-b135-dc31867b41af-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/yelamancilie600efa5-e07f-47a7-b135-dc31867b41af-415x250-IndiaHerald.jpgవిశాఖ రూరల్ జిల్లాలో ఎలమంచిలి మునిసిపాలిటీకి ఏడేళ్ల తరువాత ఎన్నికలు జరుగుతున్నాయి. గత రెండున్నరేళ్ళుగా స్పెషల్ ఆఫీసర్ పాలనలో ఉన్న ఈ మునిసిపాలిటీకి ఇపుడు కొత్త పాలకవర్గం రాబోతోంది. యలమంచిలిలో టీడీపీకి ఒకపుడు గట్టిగా బలం ఉండేది. 2018 వరకూ కూడా ఇక్కడ ఎదురులేకుండానే ఉండేది. yelamancili;anand malayalam actor;tiru;vijayakumar;2019;anakapalle;vishakapatnam;panchayati;mla;cycle;winner;tdp;ycp;yelamanchili;anand deverakonda;partyపుర పోరు : యలమంచిలి.... ముంచేదెవరినో...?పుర పోరు : యలమంచిలి.... ముంచేదెవరినో...?yelamancili;anand malayalam actor;tiru;vijayakumar;2019;anakapalle;vishakapatnam;panchayati;mla;cycle;winner;tdp;ycp;yelamanchili;anand deverakonda;partyFri, 19 Feb 2021 14:50:58 GMTవిశాఖ రూరల్ జిల్లాలో ఎలమంచిలి మునిసిపాలిటీకి ఏడేళ్ల తరువాత ఎన్నికలు జరుగుతున్నాయి. గత రెండున్నరేళ్ళుగా స్పెషల్ ఆఫీసర్ పాలనలో ఉన్న ఈ మునిసిపాలిటీకి ఇపుడు కొత్త పాలకవర్గం రాబోతోంది. యలమంచిలిలో టీడీపీకి ఒకపుడు గట్టిగా బలం ఉండేది. 2018 వరకూ కూడా ఇక్కడ ఎదురులేకుండానే ఉండేది.

అయితే బలమైన నాయకుడు సుందరపు విజయకుమార్ టీడీపీలో ఎమ్మెల్యే టికెట్ దక్కక ఆసంతృప్తితో జనసేనలో చేరిపోయాడు.  ఆ తరువాత 2009 ఎన్నికల నాటికి టీడీపీకి మద్దతు కరవైంది. వైసీపీ నుంచి పోటీ చేసిన కన్నబాబు రాజు జెండా ఎగరేశారు. ఇక తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వైసీపీ పరం అయ్యాయి.

ఇక్కడ ఎన్నికల రాజకీయాలను శాసించే విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసీరావు కుటుంబం మొత్తం వైసీపీలో చేరిపోవడంతో ఆ పార్టీకి ఒక్కసారిగా బలం పెరిగింది. గత ఎన్నికల్లో తులసీరావు కుమార్తె రమాదేవి ఎలమంచిలి మునిసిపల్ చైర్ పర్సన్ గా టీడీపీ నుంచి నెగ్గారు. ఈసారి ఆమె వైసీపీలో ఉన్నారు. ఇక ఆమె సోదరుడు, అనకాపల్లి నుంచి 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసిన ఆడారి ఆనంద్  కూడా తరువాత రోజులలో  వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

ఇలా మంచి పట్టు ఉన్న ఆడారి కుటుంబం ఇపుడు వైసీపీలో ఉండడంతో ఫ్యాన్ ఎలమంచిలి మునిసిపాలిటీలో గిర్రున‌ తిరుగుతుందా అన్న చర్చ అయితే ఉంది. అదే సమయంలో యలమంచిలికి 2014 లో ఎమ్మెల్యేగా పనిచేసిన టీడీపీ నేత పంచకర్ల రమేష్ బాబు కూడా వైసీపీలో చేరిపోయారు. ఈ పరిణామాలతో ఇక్కడ సైకిల్ పార్టీ చిక్కుల్లో ఉందని చెప్పాలి. ఇప్పటికైతే వైసీపీకి ధీమా ఎక్కువగా ఉన్నా కూడా వర్గ పోరు కూడా అదే స్థాయిలో ఉంది. చూడాలి మరి  ఎవరి విజేత అవుతారో. ఏది ఏమైనా ఇక్కడ రసవత్తరమైన పోరు సాగుతుంది అనే చెప్పాలి.









బ్రేకింగ్:హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్...!

రష్మి మొదటిసారి బుల్లితెర మీద రెచ్చిపోయింది.. వామ్మో నా తప్పు ఏముందబ్బా అంటూ..!

యాక్టర్ ప్రసాద్ బాబు కొడుకు, కోడలు గురించి బయటపడ్డ నిజాలు..!

తెలంగాణలో ప్రైమరీ స్కూల్స్ ఇక లేనట్టే..

ఎన్టీయార్ కి సూపర్ సలహా ఇచ్చిన చెర్రీ.. ఫ్యాన్స్ ఖుషీ..?

నటి హేమ కు ఇంత పెద్ద కూతురు ఉందా..ఎంత క్యూట్ గా ఉందో కదా..!

ఇప్పటి వరకు ఏ హీరో సాధించని రికార్డు సృష్టిస్తున్న హీరో రామ్ చరణ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>