LifeStyleParisa Rama Krishna Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/lifestyle/taurus_taurus/while-you--your-wife-enjoying-alone15cf9ab6-f4e1-4e20-b437-2a657dc55677-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/lifestyle/taurus_taurus/while-you--your-wife-enjoying-alone15cf9ab6-f4e1-4e20-b437-2a657dc55677-415x250-IndiaHerald.jpgమీరు భాగస్వామిని కౌగిలిలో బంధిస్తున్నారు. మీరు మీ భాగస్వామి ఒకటై - శృఙ్గార రసం తృప్తిగా గ్రోలుతున్నవేళ - ఉద్వేగభరితమైన క్షణాన్నిఆనందంగా, ఆస్వాదిస్తూ అనుభవిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో అకస్మాత్తుగా మీకు ఎవరో అంతరాయం కలిగించారు. మీ పిల్లలు మీ గది లోకి నడుచుకుంటు వచ్చేశారు.while you & your wife enjoying alone;bhavana;jeevitha rajaseskhar;paanakam;pithe;sex;letter;father;nijamమీ శృంగార పానకంలో పిల్లలే పుడకలై అడ్డొస్తే? ఈ "టెన్ కమాండ్మెంట్స్" వాడేయండి!మీ శృంగార పానకంలో పిల్లలే పుడకలై అడ్డొస్తే? ఈ "టెన్ కమాండ్మెంట్స్" వాడేయండి!while you & your wife enjoying alone;bhavana;jeevitha rajaseskhar;paanakam;pithe;sex;letter;father;nijamFri, 19 Feb 2021 20:00:00 GMT
ఒక చల్లని సాయంత్రమో, వెన్నెలరాత్రో  మీ మనసు, మీ మగువపై, మరులు గొల్పినప్పుడో అలా అలవోకగా మళ్లినప్పుడో - శృంగారం ఆస్వాదిద్దామని మీరు మీ జీవిత భాగస్వామి ఆ రసాస్వాదనలో తరిద్దామనుకున్నారు. ముందుగా ఏకాంత వాసానికి ఇరుగు పొరుగు తలుపులు కిటికీలు మూసేసారు. మీ పిల్లలు నిద్రపోయేది, ఆటలాడుకునేది, హోంవర్క్ చేసుకునేది, ఏదైనా ఆటలోనో, పాటలోనో మునిగి ఉన్నారని నిర్ధారించుకొని - శృఙ్గార సామ్రాజ్యాన్ని ఏలటానికి ఉపక్రమించారు.


కథానుక్రమణిక ప్రకారం రసపట్టులో చివరి అంకానికిచేరి, స్వేదం వరదైన వేళ, భళ్ళున తలుపు తెరచుకొని, పిల్లలు గుభిల్లున, మీ ఏకాంత వాసం లోకి ప్రవేశించిన సందర్భం - అప్పుడు మీరేం చేస్తారు? ఆ సందర్భాన్ని ఎలా సంభాళించు కుంటారు?

మీరు భాగస్వామిని కౌగిలిలో బంధిస్తున్నారు. మీరు మీ భాగస్వామి ఒకటై - శృఙ్గార రసం తృప్తిగా గ్రోలుతున్నవేళ - ఉద్వేగభరితమైన క్షణాన్నిఆనందంగా, ఆస్వాదిస్తూ అనుభవిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో అకస్మాత్తుగా మీకు ఎవరో అంతరాయం కలిగించారు. మీ పిల్లలు మీ గది లోకి నడుచుకుంటు వచ్చేశారు.


అపుడు ఒక్కసారిగా మీకేం  చేయాలో అర్థం కాదు. మీ మైండ్ బ్లాంక్, మనసు ఒక్కసారి ఖాళి అయి పోయిందనుకోండి,  మది సరిగ్గా పనిచేయని వేళ, వారేమి అడుగుతారో? మనమేమి చెప్పాలో? అని మీకు అనిపించొచ్చు.

ఇప్పుడు మీ పిల్లలు "మీరు ఏమి చేస్తున్నారు?" అని అడిగితే మీ మదిలో మాటలు ఉండక పోవచ్చు. మీ పిల్లలకు అప్పుడు ఏమి చెప్పాలో తెలియకపోవచ్చు. బాగా ఇబ్బందికరమైన ఈ క్షణాన్ని సందర్భాన్ని అధిగమించేందుకు మీరు ఈ కింది "టెన్ కమాండ్మెంట్స్" లాంటి  సూచనలను, ఎదో ఒకదాన్నో, కొన్నింటినో వాడేసి - పరిస్థితిని నియంత్రించండి. అప్పుడు మీ మార్గం సుగమం కావచ్చు.


1 పిల్లలను తిట్టొద్దు: మీరు శృంగారంలో ఉన్నప్పుడు మీ పిల్లలు చూసిన వెంటనే వారిని తిట్టాల్సిన అవసరం లేదు. వారిని తిట్టడం కోపంగా కఠినంగా మొరటుగా మాట్లాడటం వంటివి చేస్తే వారు ఏడుపును ప్రారంభిస్తారు. ఇలా మీరే వారి మానసిక స్థితిని మళ్లించటం చేస్తారు. అలాంటి సమయంలో ప్రశాంతంగా ఉండండి. మీరు ‘వెళ్లి ఆడుకో’ మని వారితో చెప్పండి. తర్వాత మీరు ఆ ఆట లో చేరతామని చెప్పండి.



2 ప్రతికూల భావోద్వేగాలను తొలగించండి: శృంగారం అనేది చెడు విషయం కాదు. అందువల్ల ప్రతికూల భావోద్వేగాలను అస్సలు శృంగారంతో ముడిపెట్ట కూడదు. ఆ పరిస్థితిలో మీ పిల్లలు మిమ్మల్ని చూసిన క్షణం, మీరు పరిస్థితిని తెలివిగా నిర్వహించాల్సి ఉంటుంది. మీరు ఏదైనా ప్రతికూల భావోద్వేగాలను చూపితే, మీరు ఏదో తప్పు చేస్తున్నారని లేదా “సెక్స్”శృంగారం ఒక చెడ్డ పని అని మీ పిల్లలు అనుకుంటారు. “కొత్త తల్లిదండ్రుల” సమస్యలు పిల్లల ప్రవర్తనను చాలా ప్రభావితం చేస్తాయి.


3 మిమ్మల్ని మీరు కవర్ చేసుకోండి: మీ పిల్లలు మీ గదిలోకి వచ్చిన క్షణం మీరు ఇబ్బంది పడితే మీరు తర్వాత ఏమి చేయాలో? లేదా ఏమి చెప్పాలో? ఆలోచించ లేక పోవచ్చు. కాబట్టి మీరు ఏదైనా చేసే ముందు లేదా ఏదైనా చెప్పే ముందు మీరు మీ నగ్న శరీరాన్ని రహస్యంగా ఉంచాలి. అంటే వెంటనే ఏవైనా కప్పేసుకోండి. ఇది చాలా వరకు ఇబ్బందిని తగ్గిస్తుంది. ఈ ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవటానికి నగ్న శరీరాన్ని దాచడం వాస్తవానికి మంచి ప్రారంభం. దీని తర్వాత మీరు, మీ పిల్లలతో ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన ఉండదు.


4 మీకు మరియు మీ భాగస్వామికి మధ్య సంబంధం ఇలాగే ఉంటుందని వారికి చెప్పండి: అమ్మ, నాన్న ఒకరినొకరు ప్రేమను చూపించే మార్గం ఇదని మీ పిల్లలకు మీరు చెప్పొచ్చు. "అమ్మ నాన్నఆట ఆడుతున్నాం " అని చెప్పే బదులు, "ఇది ప్రతి తల్లి తండ్రి మధ్య మాత్రమే ఉండే బంధం అని,  మరియు మేము తప్పు చేయడం లేదు" అని భావం ధ్వనించే లాగా మీరు మీ పిల్లలకు చెప్పవచ్చు.

5 మీకు అపరాధ భావన వద్దు: దీని గురించి అపరాధ భావన అస్సలు వద్దు. మీరు ఒక క్షణం ప్రేమను కలిగి ఉన్నారు. సరిగ్గా అదే సమయం లో మీ పిల్లలు మీ గదిలో నడిచారు. కాబట్టి, మీరు దాని అపరాధం భావించాల్సిన పని లేదు. మీ పిల్లలు మిమ్మల్నెవిధంగా చూస్తారని ఆందోళన చెందాల్సిన పనిలేదు. కానీ అపరాధభావం పరిష్కారం కాదు. అలా అయితే ఇది మీ పిల్లల్ని “నమ్మించేలా” చేస్తుంది. మీరు నిజంగా ఏదైనా చేయరాని తప్పు లేదా తీవ్రమైన పని చేస్తున్నారనే అనుమానాలను రేకెత్తిస్తుంది.


6 చిన్నతీపి జ్ఞాపకంగా ఉండనివ్వండి: ఆ సమయాన్ని చిన్న తీపి జ్ఞాపకంగా ఉండనివ్వండి. మీరు మీ పిల్లలకు ఏది వివరించినా దాన్ని చిన్నగా ఉంచేందుకు ప్రయత్నించండి. ఇది ఒక ఆట లేదా అలాంటిదే అని చెప్పి వారిని కంగారు పెట్టొద్దు. ‘మనం ఐస్ క్రీమ్ తీసుకుందాం‘ లేదా ‘స్పాంజ్ బాజ్ చూద్దాం‘ అని చెప్పడం ద్వారా కూడా మీ పిల్లలను మీరు ఆ ఆలోచన నుండి దారిమళ్లించొచ్చు.

7 మీ తదుపరి సెషన్ గురించి జాగ్రత్తగా ఉండండి: ఇలాంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తదుపరి సెషన్ కు మీరు మరియు మీ భాగస్వామి శృంగారంలో పాల్గొనేందుకు మీ తలుపు ను సరిగ్గా లాక్ చేశారో? లేదో? నిర్ధారించుకోండి. మీరు తలుపు లాక్ చేసి, మీ పిల్లలకు మీకు అవసరమని భావిస్తే, మీరు వారి వద్దకు వెళ్లే ముందు మిమ్మల్ని మీరు ప్రదర్శించు కోవద్దు. లేదా మీ పిల్లలు పాఠశాలకు వెళ్లినప్పుడు లేదా ఇతర ప్రదేశాల్లో మీరు ఎంచక్కా ఎంజాయ్ చేయవచ్చు.


8 అమ్మ నాన్నల మధ్య సంబంధం విభిన్నం: శృంగార శాస్త్రంలో తోలి పాఠం వారికి తెలిస్తే మంచిదే. తెలిస్తే మంచిదే కానీ చూస్తే మాత్రం మంచిది కాదు. అందుకే వెంటనే దుప్పట్లో దూరేస్తే మంచిది.


9 పిల్లలు ఒకవేళ చూస్తే కంగారు పడొద్దు: దుప్పట్లో దూరేసి మరి చిన్నపిల్లలైతే దగ్గరకు తీసుకొని చిన్న ముద్దు పెట్టి నెమ్మదిగా బయటకు వెళ్ళమని చెప్పొచ్చు.


10 మరి తప్పనప్పుడు అంజన కొట్టేయండి: గప్చిప్ గా, సర్దేసుకొని ఏమి లేనట్టు, ఏమి జరగనట్టు, దాన్ని దాటేస్తూ, పరిస్థితిని వారి దృష్టి నుండి దారి మళ్లించండి. పైగా ఒకసారి సిగ్గుపడండి. వారి బుగ్గలను చిదమండి.


 

 


కోరిక తీరేలా చేస్తూ.. ఆమెకు చెమటలు పట్టిస్తున్న హీరోలు..!

'పుష్ప' లో బన్నీకి చెల్లెలిగా నితిన్ హీరోయిన్..!!

ఐదెకరాల లోపు ఉంటేనే రైతు బంధు..?

పదిహేడేళ్ల అందంతో టాలీవుడ్ లో జోరు...?

హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డకు ఇన్ని షాకులు ఎందుకు తగులుతున్నాయబ్బా ?

మహేష్ కోసం ఏకంగా హాలీవుడ్ స్టార్స్ ని రప్పిస్తున్నారట.....??

నీ బుర్ర ఇంట్లో పెట్టి షూటింగ్ కి రమ్మంటు నాగార్జున ని అవమానించింది ఎవరు .?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Parisa Rama Krishna Rao]]>