PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_analysis/somu-veerrajudd22f654-ba13-4f53-a632-d20ec98e5cbf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_analysis/somu-veerrajudd22f654-ba13-4f53-a632-d20ec98e5cbf-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో బిజెపి నేతలు ఈ మధ్య కాలంలో కాస్త స్పీడ్ గా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసారు. గుంటూరులోని నెహ్రూనగర్ లో బిజెపి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సమక్షంలో పార్టీలో స్థానిక ముస్లీం నాయకులు చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆలయాలపై దాడుల విషయంలో టీడీపీ వైసీపీ ఒక్కటి అయ్యాయి అని ఆరోపించారు. ఆలయాలపై దాడుల అంశాన్ని కనుమరుగు చేయడానికే విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం తెsomu veerraju;bhavana;bharatiya janata party;guntur;andhra pradesh;narendra modi;janasena;a p j abdul kalam;vishakapatnam;government;huzur nagar;tdp;local language;central government;ycp;janasena partyఉక్కుపై ఉద్యమం ఎందుకు...? సోము కీలక వ్యాఖ్యలుఉక్కుపై ఉద్యమం ఎందుకు...? సోము కీలక వ్యాఖ్యలుsomu veerraju;bhavana;bharatiya janata party;guntur;andhra pradesh;narendra modi;janasena;a p j abdul kalam;vishakapatnam;government;huzur nagar;tdp;local language;central government;ycp;janasena partyFri, 19 Feb 2021 13:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో బిజెపి నేతలు ఈ మధ్య కాలంలో కాస్త స్పీడ్ గా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసారు. గుంటూరులోని నెహ్రూనగర్ లో బిజెపి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సమక్షంలో పార్టీలో స్థానిక ముస్లీం నాయకులు చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆలయాలపై దాడుల విషయంలో టీడీపీ వైసీపీ ఒక్కటి అయ్యాయి అని ఆరోపించారు. ఆలయాలపై దాడుల అంశాన్ని కనుమరుగు చేయడానికే విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం తెచ్చారని అన్నారు.

ఆలయాలపై దాడుల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకుని వెళ్తాం అన్నారు. ప్రభుత్వంతో టీడీపీ చేతులు కలిపి బిజెపిని ఏకాకిని చేసింది అని ఆయన ఆరోపించారు. విశాఖ ఉక్కుపై అసలు నోటిఫికేషన్ రానప్పుడు ఉద్యమం ఎందుకు అని ప్రశ్నించారు. దేశంలో బిజెపి ఎక్కువ రాష్ట్రాలలో అధికారంలో ఉంది అని ఆయన అన్నారు. ఏమీ లేని స్థితి నుంచి దేశంలో అధికారంలోకి వచ్చే స్థాయికి బిజెపి ఎదిగింది అని ఆయన అన్నారు. దేశభక్తి భావన, శ్రీరాముని ఆలోచన బిజెపి మౌలిక సిద్ధాంతాలు అని స్పష్టం చేసారు.

దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు వందేమాతరం పాడాల్సిందే అని ఆయన అన్నారు. అబ్దుల్ కలాంని రాష్ట్రపతి చేసింది బిజెపి  అని ఆయన గుర్తు చేసారు. మైనార్టీల అభివృద్ధి బిజేపి తోనే సాధ్యం  అని ఆయన స్పష్టం చేసారు. అందుకే మైనార్టీలు బిజెపి లో చేరుతున్నారు అని ఆయన కొనియాడారు. ఏపీలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నవే అని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో రహదారులు మోదీ ఇచ్చిన నిధులతోనే నిర్మిస్తున్నారు అని సోము తెలిపారు. బిజెపి, జనసేన కార్యకర్తలు కలిసి ప్రజల్లోకి వాస్తవాలు తీసుకెళ్లాలి అని సోము కోరారు.


రష్మి మొదటిసారి బుల్లితెర మీద రెచ్చిపోయింది.. వామ్మో నా తప్పు ఏముందబ్బా అంటూ..!

యాక్టర్ ప్రసాద్ బాబు కొడుకు, కోడలు గురించి బయటపడ్డ నిజాలు..!

తెలంగాణలో ప్రైమరీ స్కూల్స్ ఇక లేనట్టే..

ఎన్టీయార్ కి సూపర్ సలహా ఇచ్చిన చెర్రీ.. ఫ్యాన్స్ ఖుషీ..?

నటి హేమ కు ఇంత పెద్ద కూతురు ఉందా..ఎంత క్యూట్ గా ఉందో కదా..!

ఇప్పటి వరకు ఏ హీరో సాధించని రికార్డు సృష్టిస్తున్న హీరో రామ్ చరణ్

పుర పోరు: ఒక్క మున్సిపాల్టీ... ముగ్గురు వైసీపీ నేత‌ల‌కు అగ్ని ప‌రీక్ష ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>