BusinessParisa Rama Krishna Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/business/technology_videos/amazon-strategy-kills-india-retailca9a666f-a426-43c4-96a2-eaf915dece91-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/business/technology_videos/amazon-strategy-kills-india-retailca9a666f-a426-43c4-96a2-eaf915dece91-415x250-IndiaHerald.jpg“ఈ సమాచారం అంతా రాజకీయంగా సున్నితమైంది. ఒకవేళ ఈ విషయం బయటకు తెలిస్తే భారత్‌ లో చిన్న వర్తకుల ఆగ్రహాన్నికి అజ్యం పోసినట్టు అవుతుంది. అమెజాన్ భారత చట్టాలకు ఎలా ఝలక్ ఇస్తూ బడాబాబులకు మేలు చేస్తోందని వారు భావించే అవకాశం ఉంది. చిన్న వర్తకులే ప్రధాన ప్రాతిపదికగా ఎదిగిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇది ఆగ్రహాన్ని కలిగించవచ్చు. అదే సమయంలో అమెజాన్ సంస్థ తాము చిన్న వర్తకుల మిత్రుడు అనే భావన తొలగిపోయే ప్రమాదం ఉంది”amazon strategy kills india retail;view;cbn;chiranjeevi;bhavana;maya;mithra;india;american samoa;2019;barack obama;amazon;capital;minister;press;customer;april;washington dc;narendraభారత్ ను మోసం చేసే ప్రయత్నం - రాయిటర్ రట్టు చేసిన అమెజాన్ గుట్టు - సీక్రెట్ స్ట్రాటజీ ఫట్!భారత్ ను మోసం చేసే ప్రయత్నం - రాయిటర్ రట్టు చేసిన అమెజాన్ గుట్టు - సీక్రెట్ స్ట్రాటజీ ఫట్!amazon strategy kills india retail;view;cbn;chiranjeevi;bhavana;maya;mithra;india;american samoa;2019;barack obama;amazon;capital;minister;press;customer;april;washington dc;narendraThu, 18 Feb 2021 13:30:00 GMTభారతీయ చట్టాలను రహస్యంగా  దగా, మాయ, మోసం తో  ఉల్లంఘించి తాను ఇక్కడ ఎదిగేందుకు అమెజాన్ వేసిన ఒక వ్యూహాత్మక ఎత్తుగడ “సీక్రెట్ స్ట్రాటజీ ” ని రచ్చరచ్చ చేసింది “రాయిటర్ వార్తా సంస్థ” కథనం. 


2019 ఏప్రిల్‌ లో అమెజాన్ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ “జే కార్నే” (అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వద్ద ప్రెస్ సెక్రటరీ గా గతంలో పనిచేశారు) అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ లో భారత రాయబారితో చర్చించటానికి సమావేశం నిర్ణయించబడింది. కానీ ఆ సమావేశం జరగలేదని తెలుస్తుంది.


అదే సమయంలో భారత ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి కొన్ని మార్పులు తెచ్చింది.  అయితే, ఆ మార్పులు వల్ల అమెజాన్‌ కు భారత్‌లో పెద్దదెబ్బ పడడం ఖాయమని తేలింది. అప్పుడు సమావేశం కు ముందు అమెజాన్ ఉద్యోగులు “జే కార్నే” కోసం “నోట్” సిద్ధం చేశారు. అందులో ఏం చెప్పాలి? ఏం చెప్పకూడదు? అనే అంశాలను ప్రస్తావించారు. ఆ “నోట్‌” ను రాయిటర్స్ సంపాదించినట్టు తెలిపింది.

అమెజాన్ సంస్థ భారత్‌లో 5.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతుందని, నాలుగు లక్షల మంది భారతీయ చిరువర్తకులకు తమ వ్యాపార కలాపాలు సాగించేందుకు “ఆన్ లైన్ రిటైల్ ప్లాట్ ఫాం” కల్పిస్తుందనే అంశానికి ప్రాముఖ్యత ఇవ్వాలని అందులో చెప్పారు.

అయితే, కంపెనీ వెబ్ సైట్‌లో విక్రయించే మొత్తం వస్తువుల విలువలో మూడింట ఒక వంతు కేవలం 33 మంది మంది అమెజాన్ అమ్మకందారులే అనే విషయాన్ని మాత్రం బయటకు చెప్పొద్దని ఆ నోట్‌ లో పేర్కొన్నారు. అది చాలా సున్నితమైన, బహిర్గతం చేయకూడని అంశంగా తెలిపారు.



ఇంకా మరికొన్ని పత్రాలు కూడా ఇలాంటి మరిన్ని విషయాలను వెల్లడించాయి. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, అమెజాన్ సంస్థ పరోక్షంగా పెట్టుబడులు కలిగిన ఉన్న మరో రెండు పెద్ద వ్యాపార సంస్థలు, 2019వ సంవత్సరంలో అమెజాన్ ప్లాట్ ఫాం మీద జరిపిన విక్రయాల్లో 35 శాతం వాటాను కలిగి ఉన్నాయి.



అంటే, మొదట 33 మంది మూడింట ఒక వంతు, ఈ రెండు పెద్ద వ్యాపార సంస్థలు మరో 35 శాతం వాటా అంటే మొత్తంగా మూడింట రెండు వంతులు కలిగి ఉన్నట్లే కదా!  నాలుగు లక్షల మంది వ్యాపారులు చేసేది మూడింట ఒక వంతు అయితే, ఈ 35 మంది చేసేది మూడింట రెండు వంతులు.


ఈ సమాచారం అంతా రాజకీయంగా సున్నితమైంది. ఒకవేళ ఈ విషయం బయటకు తెలిస్తే భారత్‌ లో చిన్న వర్తకుల ఆగ్రహాన్నికి అజ్యం పోసినట్టు అవుతుంది. అమెజాన్ భారత చట్టాలకు ఎలా ఝలక్ ఇస్తూ బడాబాబులకు మేలు చేస్తోందని వారు భావించే అవకాశం ఉంది. చిన్న వర్తకులే ప్రధాన ప్రాతిపదికగా ఎదిగిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇది ఆగ్రహాన్ని కలిగించవచ్చు. అదే సమయంలో అమెజాన్ సంస్థ తాము చిన్న వర్తకుల మిత్రుడు అనే భావన తొలగిపోయే ప్రమాదం ఉంది” 




అయితే, ఈ విషయాన్ని జే కార్నే భారత రాయబారికి చెప్పారో? లేదో? తెలీదు కానీ 2019 ఏప్రిల్‌ లో ఎలాంటి సమావేశం జరగలేదు. ప్రపంచం లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నఅమెజాన్ కు భారత్ ప్రధాన మార్కెట్‌ గా పేరుంది. బయటకు లక్షలాది మంది వర్తకులకు “ఆన్ లైన్ రిటైల్ ప్లాట్ ఫాం”  అందిస్తున్నట్టు చెబుతున్న అమెజాన్, వాస్తవంలో పెద్ద కంపెనీలకే ఎక్కువ వ్యాపారన్ని అందిస్తోంది.



అమెజాన్ బడా బాబులకే ఎక్కువ లబ్ధి చేకూరుస్తోందని కొందరు చిన్న వర్తకులు చాలా కాలం గా పలు విధాలుగా ఆరోపణలు చేస్తున్నారు. అయితే, ఈ వాదనను అమెజాన్ ఖండించింది. భారత చట్టాలను తాము గౌరవిస్తున్నామని తెలిపింది.



అమెరికాలో అయితే, వెబ్ సైట్ సొంత ఉత్పత్తులను కూడా విక్రయించుకోవచ్చని, కానీ ఇక్కడ అలాంటిదేమీ లేకుండా కేవలం తాము కొంత ఫీజు తీసుకుని అమ్మకం దారులు, కొనుగోలుదారుల మధ్య “ఆన్ లైన్ రిటైల్ ప్లాట్ ఫాం” అందిస్తున్నట్టు పేర్కొంది.






బస్సులో ఉన్న ప్రయాణికులు కూడా సాక్షులే... తెలంగాణా హైకోర్ట్ సంచలన వ్యాఖ్యలు

జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భార్య గురించి ఆసక్తికర విషయాలు

ఒక్కరోజు CM అవుతున్న రాం చరణ్..!

బేబమ్మని చూసి నేర్చుకోండమ్మా..!

నాకు ఎనిమిదేళ్లు పట్టింది.. చరణ్ గట్స్ కు మెచ్చుకోవాల్సిందే..!

బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ లు వీళ్ళే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Parisa Rama Krishna Rao]]>