PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tension-again-with-the-epidemic-will-those-bad-conec3137af-5bc7-4bc9-8364-08e0c854e565-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tension-again-with-the-epidemic-will-those-bad-conec3137af-5bc7-4bc9-8364-08e0c854e565-415x250-IndiaHerald.jpgదేశంలో మళ్లీ కరోనా విజృంభణ మొదలైందా.. జనం నిర్లక్ష్యమే కరోనా రివర్స్‌కి కారణమైందా? మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ పరిణామాలు చూస్తే అదే అనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా అదుపులోకి వస్తున్నా.. మహారాష్ట్రలో మాత్రం ఒక్కసారిగా పెరిగిపోయింది. కొత్తగా 4,787 కరోనా కేసులు, 40 మర-ణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 21 లక్షలను సమీపించగా.. మృతుల సంఖ్య 51 వేలు దాటింది. దీంతో మరోసారి ముంబై... లాక్‌ డౌన్ దిశగా అడుగులేస్తోంది. ప్రధానంగా ముంబైలో లోకల్‌ ట్రైన్లు, బస్సుల నుంచే కరోనా విస్తృతి పెరిగినట్లు కనిపిtension again with the epidemic will those bad con;kerala;mumbai;karnataka - bengaluru;maharashtra - mumbai;bus;bengaluru 1;maharashtra;coronavirusమహమ్మారితో మళ్లీ టెన్షన్ ఆ గడ్డు పరిస్థితులు మళ్లీ వస్తాయా..?మహమ్మారితో మళ్లీ టెన్షన్ ఆ గడ్డు పరిస్థితులు మళ్లీ వస్తాయా..?tension again with the epidemic will those bad con;kerala;mumbai;karnataka - bengaluru;maharashtra - mumbai;bus;bengaluru 1;maharashtra;coronavirusThu, 18 Feb 2021 18:05:50 GMTమహారాష్ట్ర, కేరళ, కర్ణాటకలలో  కోవిడ్‌ విరుచుకుపడుతోంది. వైరస్ విషయంలో జాగ్రత్త చర్యలు పాటించాలని ప్రభుత్వాలు గట్టిగా చెబుతున్నా జనంలో నిర్లక్ష్యం మాత్రం కొనసాగుతోంది.

దేశంలో మళ్లీ కరోనా విజృంభణ మొదలైందా.. జనం నిర్లక్ష్యమే కరోనా రివర్స్‌కి కారణమైందా? మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ పరిణామాలు చూస్తే అదే అనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా అదుపులోకి వస్తున్నా.. మహారాష్ట్రలో మాత్రం ఒక్కసారిగా పెరిగిపోయింది. కొత్తగా 4,787 కరోనా కేసులు, 40 మర-ణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 21 లక్షలను సమీపించగా.. మృతుల సంఖ్య 51 వేలు దాటింది. దీంతో మరోసారి ముంబై... లాక్‌ డౌన్ దిశగా అడుగులేస్తోంది. ప్రధానంగా ముంబైలో లోకల్‌ ట్రైన్లు, బస్సుల నుంచే కరోనా విస్తృతి పెరిగినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వాలు జాగ్రత్తగా వ్యవహరించాలని ఎంతగా సూచిస్తున్నా.. జనంలో అలక్ష్యం, వ్యాక్సిన్ వచ్చేసిందన్న ధీమా వెరసి, వైరస్‌కు బాటలు వేసినట్లు కనిపిస్తోంది.

ఇక బెంగళూరులో అయితే ఒకే అపార్ట్‌మెంట్‌లో 139 మందికి కరోనా సోకింది. బొమ్మనహల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వెయ్యిమందికిపైగా ఓ పార్టీలో పాల్గొన్నారు. కరోనా టెన్షన్ లేకుండా ఇష్టానుసారం ప్రవర్తించారు. ఫలితంగా 139 మందికి కరోనా సోకగా.. మరో 5 వందల మందికి పైగా అనుమానితులున్నారు. దీంతో ఇప్పుడు వారందరినీ, క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. .

దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుతున్నప్పటికీ కేరళ, మహారాష్ట్రలో మాత్రం కేసుల సంఖ్య భారీగానే ఉంటోంది. ప్రస్తుతం దేశంలోని మొత్తం యాక్టివ్‌ కేసుల్లో దాదాపు 70శాతం ఈ రెండు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. దేశంలో తొలి కరోనా కేసు నమోదైన కేరళ ఆ మధ్య వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసినప్పటికీ.. ఇటీవల మళ్లీ అక్కడ కేసులు పెరుగుతున్నాయి. మొత్తానికి కరోనా వైరస్ విజృంభిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటకల్లో కేసులు పెరిగిపోతున్నాయి. ఇదే ఇపుడు అక్కడి వారిని తెగ టెన్షన్ కు గురిచేస్తున్నాయి.




అల్లరి నరేష్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

రాధే శ్యామ్ కోసం ఏకంగా రైల్వేస్టేషన్ కట్టేశారా..!

మన వంటలక్క ఎంత పెద్ద చదువు చదివిందో తెలుసా..?

జగన్ అన్న ఒక్క మాట..... బీజేపీకి బ్రహ్మాస్త్రమా...?

జగడ్డ : భీమిలీ కంచుకోటలో పసందైన పంచాయతీ..?

జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భార్య గురించి ఆసక్తికర విషయాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>