Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sasikala50b6c71f-91c3-4776-a1f5-f97ccd028f33-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sasikala50b6c71f-91c3-4776-a1f5-f97ccd028f33-415x250-IndiaHerald.jpgతమిళ రాజకీయాలు ప్రసుతం వేడెక్కుతున్నాయి. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్టీలన్నీ వేగంగా పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా జైలు నుంచి చిన్నమ్మ శశికళ విడుదలై రావడంతో ఎన్నికలపై మరింత ఉత్కంఠ పెరిగింది. మిగతా పార్టీలు ఏ స్థాయిలో రాణిస్తాయో పక్కన పెడితే.. చిన్నమ్మ రాకతో అన్నాడీఎంకే పార్టీపైనే అందరి చూపులూ..sasikala;jayalalitha;palani;tamil;court;chief minister;car;assembly;chennai;partyఆ పదవి నాకే కావాలి.. కోర్టుకెక్కిన శశికళఆ పదవి నాకే కావాలి.. కోర్టుకెక్కిన శశికళsasikala;jayalalitha;palani;tamil;court;chief minister;car;assembly;chennai;partyThu, 18 Feb 2021 20:31:08 GMTచెన్నై: తమిళ రాజకీయాలు ప్రసుతం వేడెక్కుతున్నాయి. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్టీలన్నీ వేగంగా పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా జైలు నుంచి చిన్నమ్మ శశికళ విడుదలై రావడంతో ఎన్నికలపై మరింత ఉత్కంఠ పెరిగింది. మిగతా పార్టీలు ఏ స్థాయిలో రాణిస్తాయో పక్కన పెడితే.. చిన్నమ్మ రాకతో అన్నాడీఎంకే పార్టీపైనే అందరి చూపులూ నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో అన్నాడీఎంకే జనరల్‌ సెక్రటరీ పదవిని తిరిగి దక్కించుకునేందుకు శశికళ పావులు కదుపుతున్నారు. దీనికోసం ఏకంగా కోర్టుకు కూడా ఎక్కారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వంకు వ్యతిరేకంగా చెన్నై కోర్టులో పిటిషన్‌ కూడా వేశారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన తరువాత ఆమెకు అత్యంత సన్నిహితురాలైన శశికళ అన్నాడీఎంకే బాధ్యతలు తీసుకున్నారు. పార్టీ జనరల్‌ సెక్రటరీ పదవి కూడా ఆమెకే దక్కింది. ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టాలని తెగ ఆశపడ్డారు. కానీ ఊహించని రీతిలో అవినీతి కేసులో ఇరుక్కుని జైలుకెళ్లారు. దీంతో అనుకోని పరిస్థితుల్లో పళనిస్వామిని సీఎం అయ్యారు. ఆ తర్వాత పళని, పన్నీర్‌సెల్వం వర్గాలు ఒకటైపోయి పళని, పన్నీర్‌ సెల్వం కలిసి అన్నాడీఎంకే జనరల్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేశారు. అందులో శశికళను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించడమేగాక, పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే, ఈ నిర్ణయంపై 2017లోనే ఆమె కోర్టుకెక్కారు. ఆ కేసు ఇప్పటికీ నడుస్తూనే ఉంది.
   
ఇక ఈ మధ్యనే చిన్మమ్మ జైలు నుంచి విడుదలయ్యారు. అన్నాడీఎంకే పార్టీని తన హస్తగతం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఆమె జైలు నుంచి విడుదలై చెన్నైకి వస్తున్నప్పుడు కూడా తన కారుపై పార్టీ జెండాను ఉంచుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. ఈ పిటీషన్‌పై కోర్టులో వచ్చేనెల 15న విచారణ జరగనుంది.


అల్లరి నరేష్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

రాధే శ్యామ్ కోసం ఏకంగా రైల్వేస్టేషన్ కట్టేశారా..!

మన వంటలక్క ఎంత పెద్ద చదువు చదివిందో తెలుసా..?

జగన్ అన్న ఒక్క మాట..... బీజేపీకి బ్రహ్మాస్త్రమా...?

జగడ్డ : భీమిలీ కంచుకోటలో పసందైన పంచాయతీ..?

జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భార్య గురించి ఆసక్తికర విషయాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>