MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/why-does-praneetha-want-to-be-like-that3c10f6ac-8663-439b-a58a-69732d52d0a4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/why-does-praneetha-want-to-be-like-that3c10f6ac-8663-439b-a58a-69732d52d0a4-415x250-IndiaHerald.jpgఅనుష్క అనుభవం కళ్ల ముందే ఉంది. పెరిగిన బరువుతో కుదేలైన కెరీర్‌ కథలు కనిపిస్తూనే ఉన్నాయి. అయినా ప్రణీత మాత్రం బరువు పెరగడానికే డిసైడ్ అవుతోంది. అజయ్ దేవగణ్ సినిమా కోసం వెయిట్‌ గెయిన్ అవుతోంది. ప్రణీత ఆల్ రెడీ కష్టాల్లో ఉంది. ఇండస్ట్రీ జనాలు ఈమెని పట్టించుకోవడమే మానేశారు. సెకండ్ హీరోయిన్ రోల్స్‌ కూడా ఇవ్వడం లేదు. కొంతమందైతే ప్రణీత పనైపోయిందని కామెంట్స్‌ కూడా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వెయిట్‌ పెరగాలనుకుంటోంది ప్రణీత. అజయ్ దేవగణ్ 'భుజ్-ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' సినిమా కోసం బొద్దుగా మారాలనుకుంటwhy does praneetha want to be like that;ajay devgn;anoushka;ajay;india;cinema;industry;heroine;success;yogaప్రణీత ఎందుకు అలా కావాలనుకుంటోంది..!ప్రణీత ఎందుకు అలా కావాలనుకుంటోంది..!why does praneetha want to be like that;ajay devgn;anoushka;ajay;india;cinema;industry;heroine;success;yogaThu, 18 Feb 2021 20:30:00 GMTఅనుష్క అనుభవం కళ్ల ముందే ఉంది. పెరిగిన బరువుతో కుదేలైన కెరీర్‌ కథలు కనిపిస్తూనే ఉన్నాయి. అయినా ప్రణీత మాత్రం బరువు పెరగడానికే డిసైడ్ అవుతోంది. అజయ్ దేవగణ్ సినిమా కోసం వెయిట్‌ గెయిన్ అవుతోంది.

ప్రణీత ఆల్ రెడీ కష్టాల్లో ఉంది. ఇండస్ట్రీ జనాలు ఈమెని పట్టించుకోవడమే మానేశారు. సెకండ్ హీరోయిన్ రోల్స్‌ కూడా ఇవ్వడం లేదు. కొంతమందైతే ప్రణీత పనైపోయిందని కామెంట్స్‌ కూడా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వెయిట్‌ పెరగాలనుకుంటోంది ప్రణీత. అజయ్ దేవగణ్ 'భుజ్-ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' సినిమా కోసం బొద్దుగా మారాలనుకుంటోంది.

టాలీవుడ్‌లో సూపర్‌ ఇమేజ్‌ ఉన్న అనుష్క 'సైజ్‌జీరో' కోసం బరువు పెరిగింది. స్లిమ్‌ లుక్‌ నుంచి ఎక్స్‌ట్రా లార్జ్‌కి వెళ్లిపోయింది. అయితే ఈ సినిమా కోసం పెరిగిన బరువుని ఇప్పటికీ తగ్గించుకోలేకపోతోంది అనుష్క. ఎంత ట్రై చేసినా బొద్దుగానే కనిపిస్తోంది. దీంతో ఈమెకి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. లావుగా ఉందని సీనియర్ హీరోలు కూడా ఈమెని పక్కనపెట్టేస్తున్నారు.

అజయ్ దేవగణ్‌ సినిమాతో బాలీవుడ్‌కి వెళ్తోంది ప్రణీత. ఇక డెబ్యూ మూవీతోనే నార్త్‌ని ఇంప్రెస్‌ చెయ్యాలని క్యారెక్టర్‌లా మారుతోందట. 'భుజ్'లో ప్రణీత రెండు షేడ్స్‌లో కనిపించాలట. అందుకే ఒక రోల్‌లో లావుగా కనిపించాలని వెయిట్ గెయిన్ అవుతోందట. మరి యోగా టీచర్ అనుష్కనే బరువు తగ్గించుకోలేక సినిమాలు వదిలేసుకుంటోంటే, ప్రణీత మళ్లీ ఇదే మిస్టేక్‌ చేస్తోంది. దీంతో ప్రణీతకి కూడా సినిమాల మీద ఆశలు లేవేమో అందుకే బరువు పెరుగుతోందని కామెంట్‌ చేస్తున్నారు జనాలు.

మొత్తానికి ప్రణీత కావాలనే కష్టాలు కొనితెచ్చుకుంటోంది. భుజ్ సినిమా కోసం బరువు పెరిగేందుకు తెగ ప్రయత్నం చేస్తోంది. అనుష్క ఇప్పటికే అలాంటి ప్రయోగం చేసి భారీగా దెబ్బతింది. తీరా లావయ్యాక ఆ సినిమా సక్సెస్ కాకపోవడం.. ఆ తర్వాత లావు తగ్గేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి, చివరకు లేడీఓరియెంటెడ్ సినిమాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇలాంటి సందర్భం ఆమె కళ్లముందు తారసపడినా.. మేల్కోవడం లేదు. భుజ్ లో అజయ్ దేవగణ్ జోడీగా ప్రణీత నటిస్తోంది.








ఆ పదవి నాకే కావాలి.. కోర్టుకెక్కిన శశికళ

అల్లరి నరేష్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

రాధే శ్యామ్ కోసం ఏకంగా రైల్వేస్టేషన్ కట్టేశారా..!

మన వంటలక్క ఎంత పెద్ద చదువు చదివిందో తెలుసా..?

జగన్ అన్న ఒక్క మాట..... బీజేపీకి బ్రహ్మాస్త్రమా...?

జగడ్డ : భీమిలీ కంచుకోటలో పసందైన పంచాయతీ..?

జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>