MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vantalakkani-follow-avuthoo-maro-serialc712386c-9113-4d9a-835b-08e3b5e5a5d3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vantalakkani-follow-avuthoo-maro-serialc712386c-9113-4d9a-835b-08e3b5e5a5d3-415x250-IndiaHerald.jpgతెలుగులో సినిమాలు ఎంతగా పాపులర్ అవుతాయో డైలీ సీరియల్స్ అంత కన్నా పాపులర్ అవుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా కొన్ని సీరియల్స్ పెద్దల నుంచి పిల్లల దాకా అందరికీ కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో అలా కనెక్ట్ అయిన ఒక సీరియల్ ఏదైనా ఉందా అంటే అది కార్తీక దీపం అనే సీరియల్ అని చెప్పక తప్పదు. ఈ సీరియల్ హీరోయిన్ అయినా వంటలక్క అలియాస్ దీపకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒకరకంగా ఈ పాత్రను ప్రేమి విశ్వనాధ్ అనే ఆవిడ పోషించారు.ఆవిడ చామన ఛాయలో ఉంటుంది కానీ పాత్ర ప్రకారం ఆమెను నల్లగా మార్చేశారు దర్శకనిర్మాతలు. ఈ దెబ్బకు ram;deepa;krishna;thulasi;telugu;kanna lakshminarayana;episode;tulasi;doctor;wife;heroine;singer;raghavendraవంటలక్కని ఫాలో అవుతూ మరో సీరియల్.. రాఘవేంద్రుడి హ్యాండ్ కూడా ?వంటలక్కని ఫాలో అవుతూ మరో సీరియల్.. రాఘవేంద్రుడి హ్యాండ్ కూడా ?ram;deepa;krishna;thulasi;telugu;kanna lakshminarayana;episode;tulasi;doctor;wife;heroine;singer;raghavendraThu, 18 Feb 2021 08:00:00 GMTతెలుగులో సినిమాలు ఎంతగా పాపులర్ అవుతాయో డైలీ సీరియల్స్ అంత కన్నా పాపులర్ అవుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా కొన్ని సీరియల్స్ పెద్దల నుంచి పిల్లల దాకా అందరికీ కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో అలా కనెక్ట్ అయిన ఒక సీరియల్ ఏదైనా ఉందా అంటే అది కార్తీక దీపం అనే సీరియల్ అని చెప్పక తప్పదు. ఈ సీరియల్ హీరోయిన్ అయినా వంటలక్క అలియాస్ దీపకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒకరకంగా ఈ పాత్రను ప్రేమి విశ్వనాధ్ అనే ఆవిడ పోషించారు.ఆవిడ చామన ఛాయలో ఉంటుంది కానీ పాత్ర ప్రకారం ఆమెను నల్లగా మార్చేశారు దర్శకనిర్మాతలు. ఈ దెబ్బకు ఆవిడ మీద ఉన్న సానుభూతితో పాటు డాక్టర్ బాబు ఈవిడ మీద చూపించే కోపం లాంటివి అన్ని కలిపి ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ ఎక్కడికో తీసుకు పోయాయి. 

ఎలా అయినా తన భర్తకు దగ్గర కావాలని దీప చేసే ప్రయత్నాలు ఒక పక్క అయితే డాక్టర్ బాబు రెండో భార్య దీపను దగ్గరకు రాకుండా చేయడానికి చేసే ప్రయత్నాలు మరో పక్క, ఇలా ఆసక్తికరంగా ఈ సీరియల్ సాగి పోతూ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ తోనే రాఘవేంద్ర రావు సమర్పణలో ఒక సీరియల్ టెలికాస్ట్ కి సిద్ధమైంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణ, సమర్పణలో కృష్ణ తులసి అనే సీరియల్ ఈ నెల 22వ తారీకు నుంచి టెలికాస్ట్ అవుతోంది. ఈ సీరియల్ కథ ప్రకారం శ్యామ అనే ఒక గాయని చుట్టూ కథ నడుస్తూ ఉంటుంది. 

మంచి పాపులర్ సింగర్ అయిన శ్యామా తన కుటుంబం కోసం తన గొంతును ఎందుకు తాకట్టు పెట్టాల్సి వచ్చింది అనే కథాంశంతో ఈ సీరియల్ నడుస్తుందని అంటున్నారు. అయితే ఇందులో హీరోయిన్ ని చూసినా సరే అందరికీ వంటలక్క ఎపిసోడ్ గుర్తు రావడం ఖాయం. ఎందుకంటే ఇందులో హీరోయిన్ ని కూడా నల్లగా మార్చేశారు మరి. ఈ సీరియల్ కథ ప్రకారం తన సవతి తల్లి కోరిక మేరకు తన గొంతును తన చెల్లెలు(సవతి తల్లి కూతురు) గొంతుగా చెబుతూ ఎప్పుడూ తెర వెనుక ఉండే పాత్రలో ఆమె నటిస్తుందని అంటున్నారు. మరి ఈ సీరియల్ ఎంత మేరకు హిట్టవుతుందనే ది చూడాల్సిందే.




అయ్యా బాబోయ్...ఇది బైకా లేక ఎడ్ల బండా..!

ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ రికార్డు విజ‌యం

మంత్రి పై బాంబు దాడి... ప‌రిస్థితి విష‌మం

రైటర్ యండమూరి గురించి ఓ వైరల్‌ పోస్ట్.. ఫుల్‌ కాంట్రావర్సీ..!?

"వకీల్ సాబ్ " కోసం మహేష్ ను ఫాలో అవుతున్న పవన్ ..?

జగడ్డ : మొత్తం పంచాయతీ ఎన్నికలలోనే అతి పెద్ద ఓటమి ...?

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ హవా.. టీడీపీ క్లీన్ బౌల్డ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>