PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tsrtcb16a95a4-5970-4827-934f-7786534f697c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tsrtcb16a95a4-5970-4827-934f-7786534f697c-415x250-IndiaHerald.jpgసంస్థ‌కు దండిగా ఆదాయం వ‌స్తున్నా ... డీజిల్ ధ‌ర‌లు పెరిగిపోవ‌డంతో ఎక్క‌డిద‌క్క‌డే ఆవిరైపోతోంది. క‌నీసం జీతాలు చెల్లించుకోలేని ధైన్య స్థితి. క‌రోనా మిగిల్చిన న‌ష్టాల‌తో దిన‌దిన గండంలా బండిని నెట్టుకొస్తోంది. ఈ బాధంతా.. ఈ వ్య‌థంతా కూడా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీదే. ఈ క‌ష్ట న‌ష్టాల నుంచి ఒడ్డున ప‌డాలంటే చార్జీలు పెంచుకోవ‌డం ఒక్క‌టే మార్గంగా ఆ సంస్థ అధికారుల‌కు క‌న‌బ‌డుతోంది. అందుకే చార్జీల పెంపున‌కు సంబంధించిన ప్ర‌తిపాద‌న‌లను ముఖ్య‌మంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది.ఈ అన్ని వివరాలతts rtc;kcr;andhra pradesh;telangana;rtc;bus;chief minister;dieselభారీగా చార్జీలు పెంచేస్తున్న టీ ఎస్‌ ఆర్టీసీ.. ఎంత‌లా అంటే...భారీగా చార్జీలు పెంచేస్తున్న టీ ఎస్‌ ఆర్టీసీ.. ఎంత‌లా అంటే...ts rtc;kcr;andhra pradesh;telangana;rtc;bus;chief minister;dieselThu, 18 Feb 2021 07:00:00 GMTడీజిల్ ధ‌ర‌లు పెరిగిపోవ‌డంతో ఎక్క‌డిద‌క్క‌డే ఆవిరైపోతోంది. క‌నీసం జీతాలు చెల్లించుకోలేని ధైన్య స్థితి. క‌రోనా మిగిల్చిన న‌ష్టాల‌తో దిన‌దిన గండంలా బండిని నెట్టుకొస్తోంది. ఈ బాధంతా.. ఈ వ్య‌థంతా కూడా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీదే. ఈ క‌ష్ట న‌ష్టాల నుంచి ఒడ్డున ప‌డాలంటే చార్జీలు పెంచుకోవ‌డం ఒక్క‌టే మార్గంగా ఆ సంస్థ అధికారుల‌కు క‌న‌బ‌డుతోంది. అందుకే చార్జీల పెంపున‌కు సంబంధించిన ప్ర‌తిపాద‌న‌లను ముఖ్య‌మంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది.ఈ అన్ని వివరాలతో ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోవలసి ఉంది.


రోజురోజుకూ పెరుగుతున్న డీజిల్‌ ధరలు, కరోనాతో విధించిన లాక్‌డౌన్‌, గతంలో పేరుకుపోయిన బకాయిలు తదితర కారణాల వల్ల సంస్థ నష్టాలు కొనసాగుతున్నాయని ఆర్టీసీ అధికారులు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు విన్నవించామ‌ని అధికారులు ఆఫ్ ది రికార్డుల్లో వెల్ల‌డిస్తున్నారు.నష్టాలలో ఉన్న ఆర్టీసీని కాపాడుకునేందుకు చార్జీల పెంపు ఒక్కటే మార్గమని భావిస్తున్న అధికారులు ఆ దిశగా కసరత్తు మొదలెట్టారు. 2019లో చార్జీలు పెంచి టికెట్ ధరలను సమం చేశారు. టికెట్ కనీస ధరను రూ. 10గా నిర్ణయించారు. అయినా ఆర్టీసీకి లాస్ తప్పలేదు. లాక్ డౌన్ కారణంగా మరింత నష్టం వాటిల్లింది. డీజిల్ ధ‌ర‌ల్లో గ‌త నాలుగైదు మాసాల నుంచి పెరుగుద‌ల క‌నిపిస్తోంది.



ఈ ఐదు నెల‌ల్లోనే ఒక్క డీజిల్‌పై రూ.400 కోట్లు ఆర్టీసీ ఖ‌ర్చు చేసిన‌ట్లుగా లెక్క‌లు చెబుతున్నాయి. రోజూ ఆరు లక్షల లీటర్ల డీజిల్ ను వినియోగిస్తున్నారు. ఈనెల మ‌రీ దారుణంగా మారింది. లీటర్ డీజిల్పై రూ. ఆరు చొప్పున పెరిగింది. దీంతో ఒక్కనెలలోనే రూ.11 కోట్లు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. ఇదిలా ఉండ‌గా ఇపుడు కిలోమీటరుపై 15 పైసల చొప్పున పెంచేందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని బస్సులలో 10 పైసలు, మరికొన్ని బస్సులకు 15 పైసల చొప్పున పెంచేందుకు ప్రాథమికంగా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. బడ్జెట్ సమావేశాల అనంతరం చార్జీలను పెంచనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గతంతో పోలిస్తే ఆర్టీసీ పరిస్థితి ఎంతో మెరుగైందని, ప్రభుత్వం అందించిన ఇతోధిక సహాయం, ఆర్టీసీలో తీసుకున్న నిర్ణయాలతో పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చిందని అధికారులు తెలిపారు. ఏపీ రాష్ర్టానికి బస్సులు తిప్పడంతో ఆక్యుపెన్సీ 58 శాతానికి చేరుకున్నదని పేర్కొన్నారు.







తండ్రి వైసీపీ ఎమ్మెల్సీ... త‌న‌యుడు స‌ర్పంచ్‌

రైటర్ యండమూరి గురించి ఓ వైరల్‌ పోస్ట్.. ఫుల్‌ కాంట్రావర్సీ..!?

"వకీల్ సాబ్ " కోసం మహేష్ ను ఫాలో అవుతున్న పవన్ ..?

జగడ్డ : మొత్తం పంచాయతీ ఎన్నికలలోనే అతి పెద్ద ఓటమి ...?

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ హవా.. టీడీపీ క్లీన్ బౌల్డ్..!!

మూడో విడ‌త ఫలి‌తాల్లో ర‌స‌వ‌త్త‌ర పోరు.. తాజా లెక్క ఇదే!

విశాఖ ఉక్కుపై హామీ ఇచ్చిన సి‌ఎం జగన్ !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>