PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/she-is-safe-a-blow-to-the-former-union-minister378bf705-4bfa-4233-bc83-e3bf0e9d0353-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/she-is-safe-a-blow-to-the-former-union-minister378bf705-4bfa-4233-bc83-e3bf0e9d0353-415x250-IndiaHerald.jpgప్రముఖ విలేఖరిపై పరువునష్టం దావా కేసులో మాజీ కేంద్రమంత్రి ఎంజే అక్బర్‌కు చుక్కెదురైంది. ఆమెపై ఎలాంటి అభియోగాలు రుజువు కాకపోవడంతో.. కేసును కొట్టేసింది ఢిల్లీ కోర్టు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రమాజీ మంత్రి ఎంజే అక్బర్‌ వేసిన పరువు నష్టం కేసులో ప్రముఖ విలేకరి ప్రియా రమణి నిర్దోషిగా తేలారు. ఈ కేసులో ఆమెకు వ్యతిరేకంగా ఎలాంటి అభియోగాలు రుజువు కాకపోవడంతో ..కేసును కొట్టివేస్తున్నట్లు ఢిల్లీ అదనపు చీఫ్‌ మెట్రోపొలిటన్‌ మెజిస్ట్రేట్‌ రవీంద్ర కుమార్‌ తీర్పు వెలువరించారు.she is safe a blow to the former union minister;priya;delhi;minister;october;woman;lie;kollu ravindraఆమె సేఫ్.. మాజీ కేంద్రమంత్రికి గట్టి దెబ్బ..!ఆమె సేఫ్.. మాజీ కేంద్రమంత్రికి గట్టి దెబ్బ..!she is safe a blow to the former union minister;priya;delhi;minister;october;woman;lie;kollu ravindraThu, 18 Feb 2021 18:30:00 GMTఢిల్లీ కోర్టు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కేంద్రమాజీ మంత్రి ఎంజే అక్బర్‌ వేసిన పరువు నష్టం కేసులో ప్రముఖ విలేకరి ప్రియా రమణి నిర్దోషిగా తేలారు. ఈ కేసులో ఆమెకు వ్యతిరేకంగా ఎలాంటి అభియోగాలు రుజువు కాకపోవడంతో ..కేసును కొట్టివేస్తున్నట్లు ఢిల్లీ అదనపు చీఫ్‌ మెట్రోపొలిటన్‌ మెజిస్ట్రేట్‌ రవీంద్ర కుమార్‌ తీర్పు వెలువరించారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లైంగిక వేధింపుల వల్ల మహిళల్లో ఆత్మవిశ్వాసం  సన్నగిల్లుతుందన్నారు. వారి మర్యాదకు భంగం కలుగుతుందని తెలిపారు. మహిళ తాను ఎదుర్కొన్న సమస్యలపై దశాబ్దాల తర్వాత కూడా ఫిర్యాదు చేసే హక్కు ఉందన్నారు. సమాజంలో ఉన్న పెద్ద మనిషి.. లైంగికంగా వేధించడని చెప్పలేమన్నారు. ఆ ఉన్నత వ్యక్తి పరువు కోసం మరో వ్యక్తి మర్యాదను తాకట్టుగా పెట్టలేమన్నారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై కూడా కోర్టు విచారం వ్యక్తం చేసింది. ఆడవాళ్లను గౌరవించాలని చెబుతూ రామాయణం, మహాభారతం లాంటి పవిత్ర గ్రంథాలను రాసిన నేలపైనే మహిళలపై దారుణాలు జరుగుతుండటం అవమానకరమని కోర్టు తెలిపింది.

2018లో ప్రపంచవ్యాప్తంగా మీటూ ఉద్యమం ఉద్ధృతంగా జరిగిన సమయంలో జర్నలిస్టు ప్రియారమణి.. అప్పటి కేంద్రమంత్రి ఎంజే అక్బర్‌పై సంచలన ఆరోపణలు చేశారు.తర్వాత పలువురు మహిళా విలేకరులు కూడా ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. అయితే వీటిని ఖండించిన ఎంజే అక్బర్‌.. ప్రియా రమణిపై 2018 అక్టోబరులో పరువు నష్టం కేసు వేశారు.

మొత్తానికి ఎంజే అక్బర్ కేసులో విలేకరి ప్రియా రమణి నిర్ధోషిగా తేలింది. అభియోగాలు రుజువుకాకపోవడంతో కేసు కొట్టివేశారు. దీంతో ఆమెకు ఉపశమనం లభించింది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయం ఇపుడు దేశవ్యాప్తంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మహిళా లోకం ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తోంది.









అల్లరి నరేష్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

రాధే శ్యామ్ కోసం ఏకంగా రైల్వేస్టేషన్ కట్టేశారా..!

మన వంటలక్క ఎంత పెద్ద చదువు చదివిందో తెలుసా..?

జగన్ అన్న ఒక్క మాట..... బీజేపీకి బ్రహ్మాస్త్రమా...?

జగడ్డ : భీమిలీ కంచుకోటలో పసందైన పంచాయతీ..?

జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భార్య గురించి ఆసక్తికర విషయాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>