PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla5ae6d911-c10f-4319-abc2-30930e860d2c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla5ae6d911-c10f-4319-abc2-30930e860d2c-415x250-IndiaHerald.jpgఈ పంచాయ‌తీపై పునాది వేసుకునే చింత‌ల‌పూడి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగాడు. 2013 వ‌ర‌కు గంటా ముర‌ళీ కుటుంబం చేతిలోనే ఉన్న పంచాయ‌తీ ఆ త‌ర్వాత కూడా అదే ముర‌ళీకి స‌న్నిహితులే అయిన గంటా కుటుంబాల చేతుల్లోకి మారింది. ఓవ‌రాల్‌గా మండ‌ల కేంద్రంగా ఉన్న ఈ మేజర్ పంచాయ‌తీ ఐదు ద‌శాబ్దాల పాటు పాతూరు కేంద్రంగా గంటా కుటుంబీకుల‌ చేతుల్లోనే కొన‌సాగింది. అయితే ఇప్పుడు వీరి ఆధిపత్యానికి ఏలూరు ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్‌తో పాటు మాజీ ఏఎంసీ చైర్మ‌న్ మేడ‌వ‌ర‌పు అశోక్ చెక్ పెట్టారు. గంటా చేతుల క‌బంద హ‌స్తాల నుంచి కామ‌వ‌ర‌పుకోట పంysrcp;ashok;mp;mla;fort;cheque;letter;central government;ycp;fatherఐదు ద‌శాబ్దాల‌ ' గంటా ' కంచుకోట బ‌ద్ద‌లు కొట్టిన అశోక్‌, ఎంపీ శ్రీథ‌ర్‌ఐదు ద‌శాబ్దాల‌ ' గంటా ' కంచుకోట బ‌ద్ద‌లు కొట్టిన అశోక్‌, ఎంపీ శ్రీథ‌ర్‌ysrcp;ashok;mp;mla;fort;cheque;letter;central government;ycp;fatherThu, 18 Feb 2021 10:19:35 GMTఐదు ద‌శాబ్దాల పాటు ఏక‌చ‌క్రాధిప‌త్యంగా కొన‌సాగిన గంటా కంచుకోట బ‌ద్ద‌లు అయ్యింది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గం కామ‌వ‌ర‌పుకోట మేజ‌ర్ పంచాయ‌తీ ఐదు ద‌శాబ్దాల పాటు గంటా కుటుంబాల‌కు చెందిన నేత‌ల చేతుల్లోనే ఉంది. ముందుగా చింత‌లపూడి మాజీ ఎమ్మెల్యే గంటా ముర‌ళీ రామ‌కృష్ణ తండ్రి హ‌నుమంత‌రావు టైంలో కొన్నేళ్ల పాటు వాళ్లే పంచాయ‌తీని కంట్రోల్ చేశారు. ఆ త‌ర్వాత ముర‌ళీ సోద‌రుడు స‌త్యంబాబు స‌ర్పంచ్ అయ్యారు. ఆ త‌ర్వాత ముర‌ళీ కుటుంబీకులు స‌ర్పంచ్‌లుగా నిల‌బెట్టిన వాళ్లే ఇక్క‌డ స‌ర్పంచ్‌లుగా గెలుస్తూ వ‌చ్చారు.
ముర‌ళీ ఈ పంచాయ‌తీపై పునాది వేసుకునే చింత‌ల‌పూడి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగాడు. 2013 వ‌ర‌కు గంటా ముర‌ళీ కుటుంబం చేతిలోనే ఉన్న పంచాయ‌తీ ఆ త‌ర్వాత కూడా అదే ముర‌ళీకి స‌న్నిహితులే అయిన గంటా కుటుంబాల  చేతుల్లోకి మారింది. ఓవ‌రాల్‌గా మండ‌ల కేంద్రంగా ఉన్న ఈ మేజర్ పంచాయ‌తీ ఐదు ద‌శాబ్దాల పాటు పాతూరు కేంద్రంగా గంటా కుటుంబీకుల‌ చేతుల్లోనే కొన‌సాగింది. అయితే ఇప్పుడు వీరి ఆధిపత్యానికి ఏలూరు ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్‌తో పాటు మాజీ ఏఎంసీ చైర్మ‌న్ మేడ‌వ‌ర‌పు అశోక్ చెక్ పెట్టారు.

గంటా చేతుల క‌బంద హ‌స్తాల నుంచి కామ‌వ‌ర‌పుకోట పంచాయ‌తీకి విముక్తుల‌ను చేశారు. వీరు బ‌ల‌ప‌రిచిన వైసీపీ అభ్య‌ర్థి క‌రిపోతు అనూష 1500 ఓట్ల మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించింది. ఓ వైపు టీడీపీతో పోటీ ఎదుర్కొంటూనే.. అటు ఎమ్మెల్యే  ఎలీజా ఫ్యానెల్‌ను సైతం ఎదుర్కొని మ‌రీ గెలిచింది. మొత్తం 18 వార్డుల‌కు గాను ఎంపీ బ‌ల‌ప‌రిచిన ఫ్యానెల్‌కు 13 వార్డులు రాగా.. టీడీపీకి 3, ఎమ్మెల్యే ఎలీజా ఫ్యానెల్‌కు 2 వార్డులు వ‌చ్చాయి. మొత్తానికి కామ‌వ‌ర‌పుకోట పంచాయ‌తీ అంటే ఐదు ద‌శాబ్దాలుగా పాతూరు కేంద్రంగా గంటా వాళ్ల ఆధ్వర్యంలో న‌డిచిన రాజ‌కీయానికి చెక్ ప‌డింది. 


నాకు ఎనిమిదేళ్లు పట్టింది.. చరణ్ గట్స్ కు మెచ్చుకోవాల్సిందే..!

బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ లు వీళ్ళే..?

పెదనాన్న కోసం ఆలోచనలను మార్చుకుంటున్న ప్రభాస్ !

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి భ‌య‌ప‌డుతున్న టీఆర్ ఎస్‌... అభ్య‌ర్థే దొర‌క‌డం లేదా..?

జగడ్డ: చంద్రగిరి టు కుప్పం.. కుప్పం టు అండమాన్..

తండ్రి వైసీపీ ఎమ్మెల్సీ... త‌న‌యుడు స‌ర్పంచ్‌

ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ రికార్డు విజ‌యం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>