MoviesGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/moviese45ff591-50a1-41f7-b0fd-f9cb7e48f838-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/moviese45ff591-50a1-41f7-b0fd-f9cb7e48f838-415x250-IndiaHerald.jpgమెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ పాన్ ఇండియా సినిమాలే చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లున్నారు. తాజాగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ ఆర్ ఆర్‌లో న‌టిస్తున్న చ‌ర‌ణ్ త‌న త‌ర్వాత సినిమా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్నారు. దిల్ రాజు నిర్మాణంలో అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతున్న‌ట్లు స‌మాచారం. దిల్ రాజు బ్యాన‌ర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థకు ఇది 50వ చిత్రమ‌వుతుంది. movies;bhama;dil raju;geetha;shankar;india;cinema;sangeetha;king;kannada;dilరామ్‌చ‌ర‌ణ్‌-ర‌ష్మిక కాంబినేష‌న్‌రామ్‌చ‌ర‌ణ్‌-ర‌ష్మిక కాంబినేష‌న్‌movies;bhama;dil raju;geetha;shankar;india;cinema;sangeetha;king;kannada;dilThu, 18 Feb 2021 10:16:06 GMTమెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ పాన్ ఇండియా సినిమాలే చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లున్నారు. తాజాగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ ఆర్ ఆర్‌లో న‌టిస్తున్న చ‌ర‌ణ్ త‌న త‌ర్వాత సినిమా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్నారు. దిల్ రాజు నిర్మాణంలో అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతున్న‌ట్లు స‌మాచారం. దిల్ రాజు బ్యాన‌ర్ శ్రీ  వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థకు ఇది 50వ చిత్రమ‌వుతుంది.  ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకముందే దీన్ని గురించిన‌ పలు వార్తలు సోషల్ మీడియాలో ఉధృతంగా వ‌స్తున్నాయి.

సినిమా నిర్మాణం విష‌యంలో రాజీప‌డ‌ని శంక‌ర్ త‌న సినిమాకు ఎంత బ‌డ్జెట్ కేటాయించాలి? ఎవ‌రెవ‌ర‌న్ని తీసుకోవాల‌ని?  వారి రెమ్యున‌రేష‌న్ ఎంత ఉంటుంది?  నాణ్య‌త త‌గ్గ‌కుండా సినిమా రావాలంటే మొద‌టినుంచి నిర్మాత‌ల‌కు ప‌లు ష‌ర‌తులు విధించే శంక‌ర్ త‌న తాజా సినిమాకు కూడా దిల్ రాజుకు ఇదేవిధ‌మైన ష‌ర‌తులు విధించిన‌ట్లు స‌మాచారం. దీనికి దిల్ రాజు ఏమాత్రం త‌గ్గ‌కుండా ఎంత‌వ‌ర‌కైనా బ‌డ్జెట్ పెట్ట‌డానికి సిద్ధమ‌య్యార‌ని, సినిమా మాత్రం భారీ స్థాయిలో వ్యాపారం చేయాల‌నేది త‌న ల‌క్ష్య‌మంటూ శంక‌ర్‌కు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల మ‌ధ్య మంచి అవ‌గాహ‌న కుదిర‌న‌ట్లైంద‌ని సినీవ‌ర్గాలంటున్నాయి. దీంతో శంక‌ర్ గ‌త రెండు సినిమాల్లా కాకుండా ఈ సినిమా స‌జావుగా నిర్మాణం జ‌రుపుకునే అవ‌కాశం ఉండ‌టం కూడా ప్ల‌స్ పాయింటే.

ఈ సినిమాలో చరణ్ సరసన కథానాయికగా కన్నడ భామ రష్మికా మందన్నను తీసుకోవాలనుకుంటున్నారట. రష్మికకు దక్షిణాదిన అన్ని భాషల్లోనూ క్రేజ్ ఉన్న విష‌యం తెలిసిందే.  అలాగే `మిషన్ మజ్ను` సినిమాతో హిందీలోకి కూడా అడుగుపెడుతోంది. దీంతో అన్ని భాషల వారికి తెలిసిన రష్మికనే కథానాయికగా ఎంపిక చేయాలని శంకర్ అనుకున్న‌ట్లు స‌మాచారం.  దీనికి సంబంధించిన అన్ని ప్ర‌య‌త్నాల‌ను శంక‌ర్‌, దిల్ రాజు ముమ్మ‌రం చేసిన‌ట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన మ‌రో వార్త ఏంటంటే సంగీత ద‌ర్శ‌కుడిగా అనిరుధ్‌ను తీసుకోబోతున్నార‌ని చెబుతున్నారు. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే రానున్నాయి.


ఐదు ద‌శాబ్దాల‌ ' గంటా ' కంచుకోట బ‌ద్ద‌లు కొట్టిన అశోక్‌, ఎంపీ శ్రీథ‌ర్‌

నాకు ఎనిమిదేళ్లు పట్టింది.. చరణ్ గట్స్ కు మెచ్చుకోవాల్సిందే..!

బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ లు వీళ్ళే..?

పెదనాన్న కోసం ఆలోచనలను మార్చుకుంటున్న ప్రభాస్ !

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి భ‌య‌ప‌డుతున్న టీఆర్ ఎస్‌... అభ్య‌ర్థే దొర‌క‌డం లేదా..?

జగడ్డ: చంద్రగిరి టు కుప్పం.. కుప్పం టు అండమాన్..

తండ్రి వైసీపీ ఎమ్మెల్సీ... త‌న‌యుడు స‌ర్పంచ్‌




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>