PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections5cc32a2b-0d66-40f3-bfd4-bafc0911d638-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections5cc32a2b-0d66-40f3-bfd4-bafc0911d638-415x250-IndiaHerald.jpgతొలి దశలో జరగాల్సిన ఎన్నికలు వెనక్కి పోయాయి. దాంతో ఆ తిప్పలు ముప్పులు అభ్యర్ధులకే ఎరుక. గత నెల రోజులుగా కాళ్ళరిగేలా తిరుగుతున్నారు. ఓటర్ దేవుళ్ళను ప్రసన్నం చేసుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు. ఇవన్నీ ఇపుడు చివరి విడత పంచాయతీ ఎన్నికల్లో కనిపించే విశేషాలూ, వింతలూనూ. jagan-nimmagadda-elections;deva;prasanna;srinivas;tiru;telugu;avanthi srinivas;vishakapatnam;panchayati;court;fort;ycp;pendurthi;v;partyజగడ్డ : భీమిలీ కంచుకోటలో పసందైన పంచాయతీ..?జగడ్డ : భీమిలీ కంచుకోటలో పసందైన పంచాయతీ..?jagan-nimmagadda-elections;deva;prasanna;srinivas;tiru;telugu;avanthi srinivas;vishakapatnam;panchayati;court;fort;ycp;pendurthi;v;partyThu, 18 Feb 2021 15:42:26 GMTపంచాయతీ ఎన్నికల్లో కనిపించే విశేషాలూ, వింతలూనూ.

రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలను ప్రకటించినపుడు తొలి దశలో విశాఖ అర్బన్ జిల్లాను ఆనుకుని ఉండే నియోజకవర్గాల పంచాయతీలకు పోలింగ్ జరగాల్సింది. అయితే ఎస్ఈసీ ఎన్నికల డెసిషన్ మీద ‌ సుపీం కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళడంతో పాటు అప్పటికి అధికారులు కూడా సమాయత్తం కాకపోవడంతో తొలి దశ అలా నిలిచిపోయింది. దాన్ని చివరి దశకు ఈ నెల 21కి ఎన్నికల సంఘం వాయిదా వేసింది.

ఆ విధంగా విశాఖ రెవిన్యూ డివిజన్ లోని భీమిలీ, పెందుర్తి తదితర నియోజకవర్గాలలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. భీమిలీ అంటేనే ఎలుగుదేశానికి కంచుకోట. తెలుగుదేశం పుట్టాక మూడే మూడు సార్లు ఆ పార్టీ ఓడింది. ఇప్పటికి తొమ్మిది సార్లు భీమిలీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే ఆరుసార్లు బంపర్ మెజారిటీతో గెలిచింది. ఓడిన ప్రతీ సారి అతి తక్కువ ఓట్ల తేడాతోనే జరిగింది.

ఇపుడు భీమిలీ కంచుకోటలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో విజయం ఎవరికి దక్కుతుంది అన్నదే పెద్ద చర్చగా ఉంది. భీమిలీలో మంత్రిగా వైసీపీ నుంచి గెలిచిన అవంతి శ్రీనివాస్ ఉన్నారు. ఆయనకు ఈ ఎన్నికలు ఒక సవాల్ గా మారాయి. భీమిలీ మండలం, పద్మనాభం, ఆనందపురం మండలాలలొని పంచాయతీలలో వైసీపీ టీడీపీల మధ్యన‌  ఢీ అంటే ఢీ అనే పరిస్థితి ఉంది. తెలుగుదేశం మద్దతుదారులు మంచి దూకుడు మీద ఉన్నారు. అదే సమయంలో అధికార  వైసీపీ  కూడా తనకు ఉన్న అన్ని రకాలైన బలాలతో ముందుకు సాగుతోంది. మెజారిటీ పంచాయతీలు గెలుచుకోకపోతే అవంతి సత్తాకు అసలైన  సవాలే అంటున్నారు మరి.






అమ్మమ్మో.. మెగా షూటింగ్ కు ‘సిద్ద’ అప్పుడే సిద్దమయ్యాడా?

జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భార్య గురించి ఆసక్తికర విషయాలు

ఒక్కరోజు CM అవుతున్న రాం చరణ్..!

బేబమ్మని చూసి నేర్చుకోండమ్మా..!

నాకు ఎనిమిదేళ్లు పట్టింది.. చరణ్ గట్స్ కు మెచ్చుకోవాల్సిందే..!

బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ లు వీళ్ళే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>