PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsd8e9e1c2-d6f9-4188-a71a-8dcb75a59694-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsd8e9e1c2-d6f9-4188-a71a-8dcb75a59694-415x250-IndiaHerald.jpgరాజకీయాల్లో ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అంతా బాగుంది అనుకుంటే పొరపాటే. అనూహ్యమైన పరిణామాలతో రాజకీయ కధ వేరే కొత్త మలుపు తిరుగుతుంది. ఇవన్నీ కామన్ అయినా కూడా రాజకీయ జీవులకు ఆ ఘటనలు ఎదురైనపుడు షాక్ కిందే ఫీల్ అవుతారు. jagan-nimmagadda-elections;tara;tiru;telugu desam party;telugu;panchayati;mla;air;cycle;tdp;central government;ycp;paderu;partyజగడ్డ : అక్కడ వైసీపీ ఎమ్మెల్యేకి గట్టి షాక్...?జగడ్డ : అక్కడ వైసీపీ ఎమ్మెల్యేకి గట్టి షాక్...?jagan-nimmagadda-elections;tara;tiru;telugu desam party;telugu;panchayati;mla;air;cycle;tdp;central government;ycp;paderu;partyThu, 18 Feb 2021 08:59:42 GMT
పంచాయతీ ఎన్నికలు కాదు కానీ ఎమ్మెల్యేల పనితీరు కి ఒక‌ కొలమానంగా నిలుస్తున్నాయి. ఏజెన్సీలో ఎదురులేదు అని గట్టిగా భావించిన వైసీపీకి పంచాయతీ ఎన్నికలు చాలా చోట్ల  చుక్కలు చూపించాయి. పాడేరు లో రెండేళ్ళ క్రితం మంచి మెజారిటీతో గెలిచిన భాగ్యలక్ష్మికి పంచాయతీ ఎన్నికలు మాత్రం పట్టు దొరకకుండా పోయాయి. ఏకంగా పాడేరు పంచాయతీయే వైసీపీ చేజారడం విశేషం.  ఎమ్మెల్యే గట్టిగానే ప్రచారం చేసినప్పటికీ పాడేరు పంచాయతీని నిలబెట్టుకోలేకపోయారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, వైసీపీ మద్దతుదారులు ఇద్దరూ పోటీ చేశారు. అయితే టీడీపీ రెబెల్ గా పోటీ చేసిన కొట్టిగళ్ల ఉషారాణి అనూహ్యంగా రేసులోకి ముందుకు దూసుకు వచ్చి విజయం సాధించడంతో ఎమ్మెల్యేకు భారీ షాకే తగిలింది.

దీంతో ఏజెన్సీలో ఫ్యాన్ పార్టీకి ఇరకాటం తప్పలేదు. ఏ ఎన్నిక వచ్చినా కూడా పొల్లుపోకుండా ఓట్లేసి గెలిపించే గిరిజనం ఈసారి మాత్రం తమ మనోగతానికి అనుగుణంగా ఓట్లేశారా అన్న చర్చ అయితే వస్తోంది. దాంతో పాడేరులో ఏకంగా నియోజకవర్గం ముఖ్య కేంద్రంలోని ప్రధాన పంచాయతీ చేజారడాన్ని వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. పైగా టీడీపీ రెబెల్ అక్కడ గెలిచింది అంటే సైకిల్ పార్టీకి మంచి రోజులు వచ్చినట్లేనా అన్న చర్చ సాగుతోంది. దాదాపుగా ఏడేళ్ల నుంచి వైసీపీని ఆదరిస్తున్న గిరిజనంలో ఈ మార్పు రావడం అంటే అధికార పార్టీ ఆలోచించుకోవాల్సిందే అన్న మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా మన్యంలో ఫ్యాన్ గాలి కొంత తగ్గిందా అన్న చర్చ అయితే వస్తోంది. ఇక మహిళా ఎమ్మెల్యేగా భాగ్యలక్ష్మి మరింతగా కష్టపడాలని కూడా ఈ ఫలితాలు సూచిస్తున్నాయి.








సూర్యగా వస్తున్న షణ్ముఖ్.. సాఫ్ట్ వేర్ డెవలపర్ కు మించిన క్రేజ్..!

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి భ‌య‌ప‌డుతున్న టీఆర్ ఎస్‌... అభ్య‌ర్థే దొర‌క‌డం లేదా..?

జగడ్డ: చంద్రగిరి టు కుప్పం.. కుప్పం టు అండమాన్..

తండ్రి వైసీపీ ఎమ్మెల్సీ... త‌న‌యుడు స‌ర్పంచ్‌

ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ రికార్డు విజ‌యం

మంత్రి పై బాంబు దాడి... ప‌రిస్థితి విష‌మం

రైటర్ యండమూరి గురించి ఓ వైరల్‌ పోస్ట్.. ఫుల్‌ కాంట్రావర్సీ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>