PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/srinivas-reddy8b254bc3-4148-4b7d-a676-09fb2e2eeb0b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/srinivas-reddy8b254bc3-4148-4b7d-a676-09fb2e2eeb0b-415x250-IndiaHerald.jpgషేక్‌పేట తహసీల్దార్‌ శ్రీనివాస్‌ రెడ్డి ఆకస్మిక బదిలీపై రెవెన్యూ సంఘాలు నివురు గ‌ప్పిన నిప్పులా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. మూడు రోజుల క్రితం షేక్పేట మండల తహసీల్దార్ను అకారణంగా బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదంగా మారిన విష‌యం తెలిసిందే. అయితే త‌హ‌సీల్దార్‌కు పోస్టింగ్ ఇవ్వకుండా సీసీఎల్ఏకు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్న‌ట్లుగా తెలుస్తోంది. రిపోర్టు చేయ‌డ‌మంటే సాధార‌ణంగా ఏదైనా చేయ‌రాని త‌ప్పు చేస్తే పై అధికారుల‌కు సంజాయిషి ఇచ్చుకోవ‌డం. కానీ ఏ త‌ప్పు తాను చేయ‌లేద‌ని, ఏదైనా త‌ప్పు srinivas reddy;vijayalakshmi;danam nagender;police;mla;fire;reddy;srinivasareddy;banjara hills;kavuru srinivasషేక్‌పేట త‌హ‌సీల్దార్‌కు వేధింపులు...? ‌పోస్టింగ్ ఇవ్వ‌కుండా ఉత్త‌ర్వులుషేక్‌పేట త‌హ‌సీల్దార్‌కు వేధింపులు...? ‌పోస్టింగ్ ఇవ్వ‌కుండా ఉత్త‌ర్వులుsrinivas reddy;vijayalakshmi;danam nagender;police;mla;fire;reddy;srinivasareddy;banjara hills;kavuru srinivasThu, 18 Feb 2021 08:35:48 GMTశ్రీనివాస్‌ రెడ్డి ఆకస్మిక బదిలీపై రెవెన్యూ సంఘాలు నివురు గ‌ప్పిన నిప్పులా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. మూడు రోజుల క్రితం షేక్పేట మండల తహసీల్దార్ను అకారణంగా బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదంగా మారిన విష‌యం తెలిసిందే. అయితే  త‌హ‌సీల్దార్‌కు పోస్టింగ్ ఇవ్వకుండా  సీసీఎల్ఏకు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్న‌ట్లుగా తెలుస్తోంది. రిపోర్టు చేయ‌డ‌మంటే సాధార‌ణంగా ఏదైనా చేయ‌రాని త‌ప్పు చేస్తే పై అధికారుల‌కు సంజాయిషి ఇచ్చుకోవ‌డం. కానీ ఏ త‌ప్పు తాను చేయ‌లేద‌ని, ఏదైనా త‌ప్పు చేస్తే నిరూపిస్తే ఎలాంటి శాఖ‌ప‌ర‌మైన శిక్ష‌ల‌కైన తాను సిద్ధంగా ఉన్నానంటూ శ్రీనివాస‌రెడ్డి ఉద్యోగ సంఘాల నేత‌ల‌తో వాపోతున్న‌ట్లు స‌మాచారం. తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి చేసిన తప్పేమిటో ఉన్నతాధికారులు మాత్రం గోప్యంగా ఉంచ‌డం వెనుక కార‌ణాలేమిట‌న్న‌ది అర్థం కావ‌డం లేదు. రాజకీయ నాయకుల ఒత్తిడితోనే అతడిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి.


బంజారాహిల్స్‌ కార్పొరేటర్‌ విజయలక్ష్మి హైదరాబాద్‌ మేయర్‌గా ఎన్నికైన మరుసటి రోజు షేక్‌పేట తహసీల్దార్‌కు స్థానచలనం కలిగించడం సర్వత్రా చర్చనీయంశంగా మారిన విష‌యం తెలిసిందే. ఓ ఆదాయ ధ్రువీకరణపత్రం జారీ విషయంలో తనకు, మేయర్‌ విజయలక్ష్మికి మధ్య వివాదం తలెత్తిందని శ్రీనివాస‌రెడ్డి ఇటీవ‌ల విలేఖ‌రుల‌కు వివ‌రించారు.  వీఆర్‌వో వ్యవస్థ రద్దు కావడంతో కుల, ఆదాయ ధ్రువపత్రాల జారీ బాధ్యత మొత్తం ఆర్‌ఐ మీ ద పడుతోందన్నారు. దీనివల్ల కొన్నిసార్లు పొరపాట్లు జరగవచ్చునని, మేయర్‌ విజయలక్ష్మి ఫోన్‌ చేసినప్పుడు తాను ఇదే చెప్పానని తెలిపారు.


ఓ కోర్టు కేసు విషయంలో వెళ్తుండగా మేయర్‌ విజయలక్ష్మి కార్యాలయానికి వచ్చారని, ఇదే సందర్భంలో చిన్న వివాదం చోటుచేసుకుందని కూడా వివ‌రించారు.  ఈ విష‌యంలో త‌న‌పై క‌క్ష పూరితంగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఆ తర్వాత ఆర్‌వోకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే ఇంత వ‌ర‌కు బాగానే రెవెన్యూ సంఘాల తీరును త‌ప్పుబ‌డుతున్న‌ట్లుగా ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడ‌టంపై ఉద్యోగ సంఘాల నాయ‌కులు మండిప‌డుతున్నారు. షేక్‌పేట తహసీల్దార్‌ శ్రీనివా్‌సరెడ్డి బదిలీకి మేయర్‌కు ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్య‌నించ‌డంపై ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్నారు. పైగా  ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వెళ్లడం అధికారులకు సరికాదని, ఇదే విషయాలపై విజయలక్ష్మి నిలదీశారని ఎమ్మెల్యే పేర్కొన‌డంపై సంఘాల నాయ‌కులు గ‌రంగ‌రంగా ఉన్నాయి.




జ‌గ‌న్ vs పెద్దిరెడ్డి... ముఖ్య‌మంత్రిపై మంత్రిదే గెలుపు

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి భ‌య‌ప‌డుతున్న టీఆర్ ఎస్‌... అభ్య‌ర్థే దొర‌క‌డం లేదా..?

జగడ్డ: చంద్రగిరి టు కుప్పం.. కుప్పం టు అండమాన్..

తండ్రి వైసీపీ ఎమ్మెల్సీ... త‌న‌యుడు స‌ర్పంచ్‌

ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ రికార్డు విజ‌యం

మంత్రి పై బాంబు దాడి... ప‌రిస్థితి విష‌మం

రైటర్ యండమూరి గురించి ఓ వైరల్‌ పోస్ట్.. ఫుల్‌ కాంట్రావర్సీ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>