Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radhesyam75fe0e68-6d27-4b0c-80df-fd2f03933b56-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radhesyam75fe0e68-6d27-4b0c-80df-fd2f03933b56-415x250-IndiaHerald.jpg ‘నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా..?’, ‘ఛ వాడు ప్రేమ కోసం చచ్చాడు.. నేను ఆ టైప్ కాదు` ఈ రెండు డైలాగ్‌లు ప్రస్తుతం ఎంతగా పాపులర్ అవుతున్నాయో వేరే చెప్పక్కర్లేదు. `గ్లింప్స్ ఆఫ్ రాధేశ్యామ్`లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ పూజా హెగ్దేలు చెప్పిన ఈ డైలాగ్స్ ప్రస్తుతం యువతను ఉర్రూతలూగిస్తోంది. అంతేకాదు పిరియాడికల్ లవ్ స్టోరీ అయిన ఈ చిత్రంపై అంచనాలను..radhesyam;prabhas;pooja hegde;geetha;krishnam raju;prema;india;italy;cinema;sangeetha;love;heroine;train;lie;vemuri radhakrishna;v;love story;chitramరాధేశ్యామ్ గ్లింప్స్ సెట్.. అమ్మో! అంత ఖర్చు చేశారా..?రాధేశ్యామ్ గ్లింప్స్ సెట్.. అమ్మో! అంత ఖర్చు చేశారా..?radhesyam;prabhas;pooja hegde;geetha;krishnam raju;prema;india;italy;cinema;sangeetha;love;heroine;train;lie;vemuri radhakrishna;v;love story;chitramThu, 18 Feb 2021 12:16:08 GMTఇంటర్నెట్ డెస్క్: ‘నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా..?’, ‘ఛ వాడు ప్రేమ కోసం చచ్చాడు.. నేను ఆ టైప్ కాదు` ఈ రెండు డైలాగ్‌లు ప్రస్తుతం ఎంతగా పాపులర్ అవుతున్నాయో వేరే చెప్పక్కర్లేదు. `గ్లింప్స్ ఆఫ్ రాధేశ్యామ్`లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ పూజా హెగ్దేలు చెప్పిన ఈ డైలాగ్స్ ప్రస్తుతం యువతను ఉర్రూతలూగిస్తోంది. అంతేకాదు పిరియాడికల్ లవ్ స్టోరీ అయిన ఈ చిత్రంపై అంచనాలను విపరీతంగా పెంచేశాయి.

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా `రాధేశ్యామ్` యూనిట్ `గ్లింప్స్ ఆఫ్ రాధేశ్యామ్` పేరుతో ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. వింటేజ్ స్టైల్లో ఉన్న ఆ వీడియో, అందులోని ప్రభాస్ లుక్, పురాతన రైల్వే స్టేషన్ సెట్‌తో అదిరిపోయేలా ఉన్న ఈ గ్లింప్స్‌ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ చిన్న గ్లింప్స్‌లో కనిపించిన ఈ సెట్ కోసం ఖర్చు భారీగా అయిందట. నిర్మాతలు ఏమాత్రం వెనకాడకుండా ఈ ఖర్చుకు రెడీ అయిపోయారట.

ఇంతకీ ఈ ట్రైన్ సెట్ కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా..? ఏకంగా 1.6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట. ఈ సెట్ కోసం 250 మంది 30 రోజుల పాటు కష్టపడ్డారట. పీరియాడిక్ డ్రామాగా ఇటలీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం ఇలాంటి ఎన్నో సెట్‌లను నిర్మించారట. ఎంతో జాగ్రత్తగా పురాతన ఇటలీ లుక్‌ను తీసుకొచ్చారట. మరి ఒక్క సెట్ కోసమే ఒకటిన్నర కోట్లకు పైగా ఖర్చు పెట్టారంటే ఇక మిగతా సెట్‌లకు ఇంకెంత ఖర్చయి ఉంటుందో కదా..!

ఇదిలా ఉంటే పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ డైరెక్షన్‌ డైరెక్షన్ వహిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్దే కథానాయిక. ఈ చిత్రానికి దక్షిణాది భాషల్లో జస్టిన్‌ ప్రభాకరన్‌ స్వరాలు అందిస్తుండగా.. హిందీలో మిథున్‌, మనన్‌ భరద్వాజ్‌ సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. యూవీ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ పాన్ ఇండియా ప్రేమకథతో ప్రభాస్ ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో చూడాలి.




ఒక్కరోజు CM అవుతున్న రాం చరణ్..!

బేబమ్మని చూసి నేర్చుకోండమ్మా..!

నాకు ఎనిమిదేళ్లు పట్టింది.. చరణ్ గట్స్ కు మెచ్చుకోవాల్సిందే..!

బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ లు వీళ్ళే..?

పెదనాన్న కోసం ఆలోచనలను మార్చుకుంటున్న ప్రభాస్ !

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి భ‌య‌ప‌డుతున్న టీఆర్ ఎస్‌... అభ్య‌ర్థే దొర‌క‌డం లేదా..?

జగడ్డ: చంద్రగిరి టు కుప్పం.. కుప్పం టు అండమాన్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>