PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/camel03b95541-cebd-49e6-854c-413684f3ddd7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/camel03b95541-cebd-49e6-854c-413684f3ddd7-415x250-IndiaHerald.jpgజాతీయ ఆహార భద్రతా ప్రమాణాల శాఖ డిసెంబరు 2, 2016న ఒంటె పాలను మనుషులు ఆహారంగా స్వీకరించదగిన జంతు ఉత్పత్తుల జాబితాలో చేర్చ‌డం గ‌మ‌నార్హం. పరిశోధనలను బట్టి ఒంటె పాలు ఆటిజం, టైప్ 1 మధుమేహం, ఆహార ఎలర్జీలు, హెపటైటిస్ బి, ఇంకా అనేక ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్న వారికి ఎంతో ఉపయోగపడతాయని ప్రముఖ సంస్థల్లోని పౌష్టికాహార నిపుణులు అంటున్నారు.మ‌ధుమేహుల‌కు ఒంటెపాలు దివ్య ఔష‌ధంలా ప‌నిచేస్తాయ‌ని కూడా ప‌రిశోధ‌కులు వెల్ల‌డిస్తుండ‌టం విశేషం. ఇదీ ప్ర‌యోగాత్మ‌కంగా కూడా నిరూప‌ణ కావ‌డం విశేషం. మ‌ధుమేహ రోగుల్లో రక్తంలోని చక్camel;auto;manu;university;gold;divya bhatnagarఒంటె పాల‌తో మ‌ధుమేహానికి చెక్‌... డాక్ట‌ర్లే సూచిస్తున్నారుగా...ఒంటె పాల‌తో మ‌ధుమేహానికి చెక్‌... డాక్ట‌ర్లే సూచిస్తున్నారుగా...camel;auto;manu;university;gold;divya bhatnagarThu, 18 Feb 2021 09:00:07 GMT ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్న వారికి ఎంతో ఉపయోగపడతాయని ప్రముఖ సంస్థల్లోని పౌష్టికాహార నిపుణులు అంటున్నారు.మ‌ధుమేహుల‌కు ఒంటెపాలు దివ్య ఔష‌ధంలా ప‌నిచేస్తాయ‌ని కూడా ప‌రిశోధ‌కులు వెల్ల‌డిస్తుండ‌టం విశేషం. ఇదీ ప్ర‌యోగాత్మ‌కంగా కూడా నిరూప‌ణ కావ‌డం విశేషం. మ‌ధుమేహ రోగుల్లో రక్తంలోని చక్కెరలను శక్తిగా మార్చాల్సిన క్రోమ గ్రంథి ఆ పని సక్రమంగా చేయదు.


దీంతో ర‌క్తంలోకి గ్లూకోజ్ లెవ‌ల్స్ బాగా పెరిగిపోతుంది. ఒంటె పాలు క్లోమ గ్రంథి పని తీరును మెరుగుపరుస్తాయి. దాంతో రక్తంలోని చక్కెర పదార్థాలు జీర్ణమై శక్తిగా మారతాయి. ఒంటె పాలూ, ఆవు పాలతో కొందరు మధుమేహ రోగులపైనా, మధుమేహం లేని వారిపైనా 3 నెలల పాటు పరిశోధన చేశారు. ఒంటె పాలు తాగినవారిలో తినక ముందూ, తిన్న తర్వాత చక్కెర స్థాయిలు తగ్గటాన్ని గమనించారు. వారిలో సగటు చక్కెర స్థాయి (హెచ్‌బీ ఏ -1సీ) కూడా తగ్గుముఖం ప‌ట్టిన‌ట్లుగా గుర్తించారు.
 పరిశోధనలను బట్టి ఒంటె పాలు ఆటిజం, టైప్ 1 మధుమేహం, ఆహార ఎలర్జీలు, హెపటైటిస్ బి, ఇంకా అనేక ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్న వారికి ఎంతో ఉపయోగపడతాయని ఓహియో స్టేట్ యూనివర్సిటీ, వెక్స్‌నెర్ మెడికల్ సెంటర్, డయాబెటీస్ రీసెర్చ్ జర్నల్, క్లినికల్ ప్రాక్టీస్ వంటి సంస్థల్లో పని చేసే పౌష్టికాహార నిపుణులు అంటున్నారు.


మధుమేహం ఉన్న వారు ఈ పాలు తాగాలని వైద్యులు సూచిస్తుండ‌టంతో స‌హాజంగానే ఒంటె పాల‌కు డిమాండ్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఏర్ప‌డుతోంది. సౌత్ ఆప్రికా దేశం ఒంటె పాల‌ను ఎగుమ‌తి చేస్తున్న దేశాల్లో మొద‌టి స్థానంలో ఉంది. ఇక్క‌డి రైతులు పెద్ద సంఖ్య‌లో ఒంటెల‌ను పెంచుతున్నారు. అధిక ధ‌ర‌ల‌కు పాలను విక్రయిస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్నారు.  ఇక్క‌డి రైతుల‌కు దాదాపు ఏడాదికి 10 బిలియన్ వాణిజ్యం జ‌రుగుతుండ‌టం విశేషం. మొత్తంగా ఒంటెపాల వ్యాపారం  ఆఫ్రికా దేశాల రైతులకు తెల్ల బంగారంలా మారిందనే చెప్పాలి. తూర్పు ఆఫ్రికాలోని రైతులు సుమారుగా కోటీ 20 లక్షల ఒంటెలను పెంచుతున్నారంటే ఈ వ్యాపారం ఏ రేంజ్‌లో సాగుతోందో ఊహించుకోండి.


సూర్యగా వస్తున్న షణ్ముఖ్.. సాఫ్ట్ వేర్ డెవలపర్ కు మించిన క్రేజ్..!

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి భ‌య‌ప‌డుతున్న టీఆర్ ఎస్‌... అభ్య‌ర్థే దొర‌క‌డం లేదా..?

జగడ్డ: చంద్రగిరి టు కుప్పం.. కుప్పం టు అండమాన్..

తండ్రి వైసీపీ ఎమ్మెల్సీ... త‌న‌యుడు స‌ర్పంచ్‌

ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ రికార్డు విజ‌యం

మంత్రి పై బాంబు దాడి... ప‌రిస్థితి విష‌మం

రైటర్ యండమూరి గురించి ఓ వైరల్‌ పోస్ట్.. ఫుల్‌ కాంట్రావర్సీ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>