EditorialSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/default/415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/default/415x250-IndiaHerald.jpgహైదరాబాద్,రంగారెడ్డి,మహబూబ్నగర్ ప‌ట్ట‌భ‌ద్రుల స్థానంలో పోటీ చేయ‌డంపై అధికార టీఆర్ ఎస్ పార్టీ వెనుకా ముందు ఆలోచిస్తుండ‌టం గ‌మ‌నార్హం. పార్టీ ఇక్క‌డ నుంచి అభ్య‌ర్థిని నిల‌బెడుతుందా లేదా అన్న‌ది శ్రేణులు తేల్చుకోలేక‌పోతున్నారు. విశ్వ‌స‌నీయంగా తెలుస్తున్న స‌మాచారం ప్ర‌కారం.. ఇక్క‌డ అభ్య‌ర్థిని నిల‌బెట్టినా.. గెలుపు సాధ్యం కాద‌న్న స‌మాలోచ‌న‌లోనే అధిష్ఠానం ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీ ఉనికిని కాపాడుకోవ‌డానికైనా అభ్య‌ర్థిని ప్ర‌క‌టించాల‌ని అధినేత కేసీఆర్ యోచిస్తున్న‌ట్లుగా స‌మాచారం. పార్టీ బ‌trs;kcr;prasad;srinivas;hyderabad;telangana rashtra samithi trs;warangal;nalgonda;ranga reddy;professor;mahbubnagar;partyహెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి భ‌య‌ప‌డుతున్న టీఆర్ ఎస్‌... అభ్య‌ర్థే దొర‌క‌డం లేదా..?హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి భ‌య‌ప‌డుతున్న టీఆర్ ఎస్‌... అభ్య‌ర్థే దొర‌క‌డం లేదా..?trs;kcr;prasad;srinivas;hyderabad;telangana rashtra samithi trs;warangal;nalgonda;ranga reddy;professor;mahbubnagar;partyThu, 18 Feb 2021 08:00:00 GMTపార్టీ వెనుకా ముందు ఆలోచిస్తుండ‌టం గ‌మ‌నార్హం. పార్టీ ఇక్క‌డ నుంచి అభ్య‌ర్థిని నిల‌బెడుతుందా లేదా అన్న‌ది శ్రేణులు తేల్చుకోలేక‌పోతున్నారు. విశ్వ‌స‌నీయంగా తెలుస్తున్న స‌మాచారం ప్ర‌కారం.. ఇక్క‌డ అభ్య‌ర్థిని నిల‌బెట్టినా.. గెలుపు సాధ్యం కాద‌న్న స‌మాలోచ‌న‌లోనే అధిష్ఠానం ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీ ఉనికిని కాపాడుకోవ‌డానికైనా అభ్య‌ర్థిని ప్ర‌క‌టించాల‌ని అధినేత కేసీఆర్ యోచిస్తున్న‌ట్లుగా స‌మాచారం. పార్టీ బ‌లాన్ని చాటేలా, ప్ర‌జ‌లు స‌పోర్ట్ చేసే అభ్య‌ర్థి కోసం జ‌ల్లెడ ప‌డుతున్నా... అలాంటి అభ్య‌ర్థి పేరు అధిష్ఠానం దృష్టికి రాక‌పోవ‌డ‌మే ఇక్క‌డ నుంచి పోటీ చేయ‌డంపై స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.


కొద్దిరోజుల క్రితం వ‌ర‌కు ఇక్క‌డ నుంచి పోటీ చేయ‌డానికి టీఆర్ ఎస్‌లోని విద్యావంతులు ముందుకు వ‌చ్చారు. ఒక ద‌శ‌లో టికెట్ నాకే కావాలంటూ కేటీఆర్‌ను క‌లిసి కూడా విన్న‌వించుకున్న‌రంట‌. దానికి ఆయ‌న స‌రే అని అన్నా... ఇప్పుడు తీరా ఎన్నిక‌ల స‌మ‌యం వ‌చ్చే నాటికి ఎవ‌రూ నోరు మెద‌ప‌డం లేద‌ని స‌మాచారం. టికెట్ ఆశించిన వారిలో ప్ర‌ధానంగా  జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, టీఎస్ఏడబ్ల్యూడీసీ ఛైర్మన్ నాగేందర్గౌడ్, పీఎల్ శ్రీనివాస్, శుభప్రసాద్ పటేల్తో పాటు గతంలో పోటీ చేసి ఓడిన దేవీ ప్రసాద్ వంటి వారి పేర్లు వినిపించాయి. ఇక్కడ ఓడిపోతే ఏదైనా నామినేటెడ్ పోస్టు ఇస్తామని హామీ ఇస్తే మాత్రం పోటీ చేస్తామంటూ నేత‌లు అధిష్ఠానం పెద్ద‌ల‌కు ష‌ర‌తు విధిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.



హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్కు వరుస పరాజయాలు ఎదుర‌వుతుండ‌ట‌మే అభ్య‌ర్థులెవ‌రూ పోటీ చేసేందుకు ముందుకు రావ‌డం లేద‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. 2007లో టీఆర్ఎస్ నుంచి యెన్నం శ్రీనివాస్రెడ్డిని పోటీ చేసి ఓడిపోయారు. 2009లో ఇలాంటి పరిస్థితులే కనిపించడంతో పోటీ చేయ‌కుండా  ప్రొఫెసర్ నాగేశ్వర్కు మద్దతునిచ్చింది. ఆ తర్వాత 2015లో టీఎన్జీఓ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న దేవీ ప్రసాద్ను పోటీలో నిలిపింది. ఆయ‌న ఓడిపోయారు.  దీంతో ఈ స్థానంలో పోటీ చేసినా ఫ‌లితం ఉండ‌ద‌న్న న‌మ్మ‌కంతో టీఆర్ ఎస్ ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా  వరంగల్–నల్గొండ–ఖమ్మం స్థానంలో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డిని బరిలో దింపి బీఫాం కూడా అప్పగించింది.  ప్ర‌చారంలో దూసుకెళ్తున్నారు.


అయ్యా బాబోయ్...ఇది బైకా లేక ఎడ్ల బండా..!

ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ రికార్డు విజ‌యం

మంత్రి పై బాంబు దాడి... ప‌రిస్థితి విష‌మం

రైటర్ యండమూరి గురించి ఓ వైరల్‌ పోస్ట్.. ఫుల్‌ కాంట్రావర్సీ..!?

"వకీల్ సాబ్ " కోసం మహేష్ ను ఫాలో అవుతున్న పవన్ ..?

జగడ్డ : మొత్తం పంచాయతీ ఎన్నికలలోనే అతి పెద్ద ఓటమి ...?

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ హవా.. టీడీపీ క్లీన్ బౌల్డ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>