PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections7903f53f-2893-450d-8ab9-8159c0ad8305-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections7903f53f-2893-450d-8ab9-8159c0ad8305-415x250-IndiaHerald.jpgటీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు ఎస్‌ఈసీ నిమ్మగడ్డను చూస్తే కడుపు మండిపోతోంది. ప్రస్తుతం నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి. నిమ్మగడ్డ అంటే చంద్రబాబు కూ... టీడీపీకి ఎంత నమ్మకమో తెలిసిందే. అటు నిమ్మగడ్డ కూడా ఏమాత్రం అక్రమాలకు పాల్పడినా చర్యలు తీసుకుంటున్నారు. ఏకంగా మంత్రులకే నోటీసులు ఇస్తున్నారు. కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు.. మొదటి విడతలో చిత్తూరు, గుంటూరు జిల్లాల ఏకగ్రీవాలు కూడా మొదట్లో ఆపి.. ఆ తర్వాత పరిశీలన అనంతరం ఓకే చెప్పారు. అయితే ఇప్పుడు నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ కాస్jagan-nimmagadda-elections;cbn;kumaar;godavari river;district;east;east godavari;panchayati;tdp;mantraజగడ్డ: నిమ్మగడ్డను చూస్తే చంద్రబాబుకు కడుపు మండిపోతోంది..?జగడ్డ: నిమ్మగడ్డను చూస్తే చంద్రబాబుకు కడుపు మండిపోతోంది..?jagan-nimmagadda-elections;cbn;kumaar;godavari river;district;east;east godavari;panchayati;tdp;mantraThu, 18 Feb 2021 11:00:00 GMTటీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు ఎస్‌ఈసీ నిమ్మగడ్డను చూస్తే కడుపు మండిపోతోంది. ప్రస్తుతం నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి. నిమ్మగడ్డ అంటే చంద్రబాబు కూ... టీడీపీకి ఎంత నమ్మకమో తెలిసిందే. అటు నిమ్మగడ్డ కూడా ఏమాత్రం అక్రమాలకు పాల్పడినా చర్యలు తీసుకుంటున్నారు. ఏకంగా మంత్రులకే నోటీసులు ఇస్తున్నారు. కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు.. మొదటి విడతలో చిత్తూరు, గుంటూరు జిల్లాల ఏకగ్రీవాలు కూడా మొదట్లో ఆపి.. ఆ తర్వాత పరిశీలన అనంతరం ఓకే చెప్పారు.

అయితే ఇప్పుడు నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ కాస్త దూకుడు తగ్గించారు. అంతే కాదు.. పంచాయతీ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయని చెబుతున్నారు. తాజాగా మూడో విడత కూడా పూర్తయ్యాక ఆయన మళ్లీ స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని ఓటర్లు ఇనుమడింపజేశారని నిమ్మగడ్డ రమేశ్ కుమార్  అంటున్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో సమస్యాత్మక గ్రామాలున్నప్పటికీ  అంతా సహకరించారని నిమ్మగడ్డ రమేశ్ కుమార్  ప్రకటించారు.

ఏజెన్సీలో సుమారు 350 పోలింగ్‌ కేంద్రాల్లో బహిష్కరణ పిలుపును తిరస్కరించి ఓటర్లు పాల్గొనడం సంతోషకరమన్నారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్. ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేశారని కితాబిచ్చారు. తూర్పుగోదావరి  జిల్లాలో ఉపాధ్యాయురాలు దైవ కృపావతి మరణించడం విచాకరమన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ .. అస్వస్థతకు లోనై ఆసుపత్రిలో వైద్యం పొందుతూ ఆమె మృతి చెందడం బాధాకరమన్నారు.

విజయనగరం జిల్లా చౌడువాడలో హింసాత్మక ఘటన జరిగిందని.. అక్కడ విధుల్లోని కానిస్టేబుల్‌ కిషోర్‌కుమార్‌ సమర్దంగా నియంత్రించారని తెలిపారు. కమిషన్‌ తరఫున కానిస్టేబుల్‌ను  నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అభినందించారు. చివరి విడత ఎన్నికల్లోను పెద్ద సంఖ్యలో  ఓటర్లు పాల్గొనాలని ఎన్నికల కమిషనర్ విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పుడు ఎన్నికల కమిషనర్ తీరుపై చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు.. అక్రమాలు జరుగుతున్నాయని తాము కంప్లయింట్ చేస్తున్నా.. అబ్బే అంతా బాగా జరుగుతోందని నిమ్మగడ్డ ప్రకటించడం చూస్తే చంద్రబాబు కడుపుమండుతోందనే చెప్పాలి.





20 వేలతో మొదలు పెట్టి కోట్లకు ఎదిగిన రజిని సక్సస్ స్టోరీ

బేబమ్మని చూసి నేర్చుకోండమ్మా..!

నాకు ఎనిమిదేళ్లు పట్టింది.. చరణ్ గట్స్ కు మెచ్చుకోవాల్సిందే..!

బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ లు వీళ్ళే..?

పెదనాన్న కోసం ఆలోచనలను మార్చుకుంటున్న ప్రభాస్ !

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి భ‌య‌ప‌డుతున్న టీఆర్ ఎస్‌... అభ్య‌ర్థే దొర‌క‌డం లేదా..?

జగడ్డ: చంద్రగిరి టు కుప్పం.. కుప్పం టు అండమాన్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>