Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bihar-people-doing-something-weired-to-get-cheap-petrol56d791ae-96ff-4c36-acaa-063bb938a4e5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bihar-people-doing-something-weired-to-get-cheap-petrol56d791ae-96ff-4c36-acaa-063bb938a4e5-415x250-IndiaHerald.jpgమన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా రేట్లు పెరిగిపోయాయి. ముఖ్యంగా మిడిల్ క్లాస్‌ ప్రజలకు పెట్రోల్ ఎంతో అవసరం. ప్రస్తుతం దేశంలో అనేకచోట్ల పెట్రోల్ ధర అత్యధకంగా సెంచరీ పలుకుతోంది. దీంతో సగటు మనిషికి పెట్రోల్‌ భారంగా మారింది. అయితే బీహార్‌‌లోని కొంతమంది మాత్రం పెట్రోల్‌ను తక్కువ ధరకు పొందేందుకు..petrol;nepal;police;petrol;dieselతక్కువ రేటుకు పెట్రోల్ కోసం బీహారీలు ఏం చేస్తున్నారో చూడండితక్కువ రేటుకు పెట్రోల్ కోసం బీహారీలు ఏం చేస్తున్నారో చూడండిpetrol;nepal;police;petrol;dieselThu, 18 Feb 2021 17:52:32 GMTఇంటర్నెట్ డెస్క్: మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా రేట్లు పెరిగిపోయాయి. ముఖ్యంగా మిడిల్ క్లాస్‌ ప్రజలకు పెట్రోల్ ఎంతో అవసరం. ప్రస్తుతం దేశంలో అనేకచోట్ల పెట్రోల్ ధర అత్యధకంగా సెంచరీ పలుకుతోంది. దీంతో సగటు మనిషికి పెట్రోల్‌ భారంగా మారింది. అయితే బీహార్‌‌లోని కొంతమంది మాత్రం పెట్రోల్‌ను తక్కువ ధరకు పొందేందుకు ఓ విచిత్రమైన, చట్ట వ్యతిరేకమైన పని చేస్తున్నారు. ఇలా తక్కువ ధరకు తెచ్చిన పెట్రోల్‌ను వారు కొనుగోలు చేసుకోవడమే కాకుండా ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు కూడా.
               
మన దేశంలో పెట్రోలు ధరలు భగ్గుమంటున్నా పక్క దేశమైన నేపాల్‌లో మాత్రం పెట్రోల్ తక్కవ ధరకే లభిస్తోంది. దీంతో బీహార్‌ సరిహద్దుల్లోని అర్రియా, కిషన్‌గంజ్ జిల్లాలకు చెందినవారు నేపాల్ నుంచి పెద్దపెద్ద డబ్బాల ద్వారా అక్రమంగా ఇక్కడికి పెట్రోల్ తీసుకువస్తున్నారు. దానిని తీసుకొచ్చి వారు వాడుకోవడమే కాకుండా.. ఇతరులకు కూడా అమ్ముతున్నారు. అయితే ఇలా సొమ్ము చేసుకుంటున్నవారిని పోలీసులు పట్టుకుని వారి నుంచి పెట్రోల్‌ను స్వాధీనం చేసుకోవడమే కాకుండా.. వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

బీహార్‌లోని అర్రియాలో పెట్రోలు ధర రూ.93.50 రూపాయలుగా ఉండగా, నేపాల్‌లో లీటరు పెట్రోలు ధర రూ.70.62గా ఉంది. అంటే మన దేశంతో పోలిస్తే నేపాల్‌లో ప్రస్తుతం 22 రూపాయల తక్కువ ధరకే లీటరు పెట్రోల్ లభిస్తోంది. యూపీలోన గోరఖ్ పూర్, లఖీమ్‌పూర్ ఖీరీ, పీలీభీత్ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు నేపాల్ నుంచి వాహనాల ద్వారా డ్రమ్ములతో పెట్రోల్, డీజిల్‌ను ఇక్కడికి తరలిస్తున్నారు. అలా తీసుకొస్తున్న అనేకమందిని పోలీసులు పట్టుకుంటున్నా.. కొంతమంది మాత్రం పోలీసుల చేతికి దొరక్కుండా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఇక మన దేశంతో పోలిస్తే నేపాల్‌లో పెట్రోల్ మాత్రమే కాకుండా డీజిల్ ధరలు కూడా తక్కువగానే ఉన్నాయి.


అల్లరి నరేష్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

రాధే శ్యామ్ కోసం ఏకంగా రైల్వేస్టేషన్ కట్టేశారా..!

మన వంటలక్క ఎంత పెద్ద చదువు చదివిందో తెలుసా..?

జగన్ అన్న ఒక్క మాట..... బీజేపీకి బ్రహ్మాస్త్రమా...?

జగడ్డ : భీమిలీ కంచుకోటలో పసందైన పంచాయతీ..?

జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భార్య గురించి ఆసక్తికర విషయాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>