PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/central260a2c92-5c0c-488f-86b0-111f63ea379d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/central260a2c92-5c0c-488f-86b0-111f63ea379d-415x250-IndiaHerald.jpgస్వ‌యంగా మ‌న‌మే మ‌న జుట్టును కేంద్రం చేతిలో పెట్టాం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌రిస్థితులు ఏమిటి? ఎలా ఉన్నాయి? వాటిని మ‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డం ఎలా? త‌దిత‌ర ఆలోచ‌న‌ల‌తో ఉన్న కేంద్ర ప్ర‌భుత్వానికి మ‌నంత‌ట మ‌న‌మే స్వ‌యంగా మ‌న జుట్టును వాళ్ల చేతిలో పెట్టామ‌ని మీకు కొంచెమ‌న్నా అర్థ‌మ‌వుతోందా? 2004, 2009లో ఒక‌లా, ఒకేలా ఆలోచించిన తెలుగోడి ఆలోచ‌నా ధోర‌ణి క్ర‌మేణా మారుతూ వ‌చ్చింది. ఆ ఆలోచ‌నా ధోర‌ణిని అంచ‌నా వేసిన త‌ర్వాతే కేంద్ర ప్ర‌భుత్వం త‌న ప‌థ‌కానికి మెరుగులు దిద్దుకుంది. central;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;telugu;vishakapatnam;central government;party;amaravathiఅందితే జుట్టు... అంద‌క‌పోతే కాళ్లుఅందితే జుట్టు... అంద‌క‌పోతే కాళ్లుcentral;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;telugu;vishakapatnam;central government;party;amaravathiThu, 18 Feb 2021 01:49:00 GMTస్వ‌యంగా మ‌న‌మే మ‌న జుట్టును కేంద్రం చేతిలో పెట్టాం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌రిస్థితులు ఏమిటి? ఎలా ఉన్నాయి?  వాటిని మ‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డం ఎలా? త‌దిత‌ర ఆలోచ‌న‌ల‌తో ఉన్న కేంద్ర ప్ర‌భుత్వానికి మ‌నంత‌ట మ‌న‌మే స్వ‌యంగా మ‌న జుట్టును వాళ్ల చేతిలో పెట్టామ‌ని మీకు కొంచెమ‌న్నా అర్థ‌మ‌వుతోందా? 2004, 2009లో ఒక‌లా, ఒకేలా ఆలోచించిన తెలుగోడి ఆలోచ‌నా ధోర‌ణి క్ర‌మేణా మారుతూ వ‌చ్చింది. ఆ ఆలోచ‌నా ధోర‌ణిని అంచ‌నా వేసిన త‌ర్వాతే కేంద్ర ప్ర‌భుత్వం త‌న ప‌థ‌కానికి మెరుగులు దిద్దుకుంది. వాటి ప‌ర్య‌వ‌సాన‌మే ఇప్పుడు మ‌న‌మెదుర్కొంటోన్న తిప్ప‌లు.

ఇందిరాగాంధీ భార‌త‌దేశాన్ని ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగా ఏలుతున్న రోజుల్లోనే విశాఖ ఉక్కు క‌ర్మాగారం కోసం విశాఖ ఉక్కు - ఆంధ్రుల హ‌క్కు అంటూ నిన‌దించాం.. సాధించాం. కానీ ఇప్పుడు ఆ పోరాట ప‌టిమ ఏమైంది? ఉద్య‌మ‌స్ఫూర్తి ఎందుకు దెబ్బ‌తింది అంటే కేవ‌లం మ‌న ఆలోచ‌నా ధోర‌ణి మార‌డంవ‌ల్లే. 2014లో ఒక‌లా ఆలోచించిన తెలుగోడు 2019లో మ‌రోలా ఆలోచించాడు. ఎక్క‌డ ఏం జ‌రుగుతున్నా స్పంద‌న లేదు. వీధుల్లోకి వ‌చ్చి పోరాటం చేసే ప‌రిస్థితి లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి ఏమిటి?  తెలుగుదేశం పార్టీని ఎలా వంచాలి? జ‌న‌సేన ఎలాగూ మ‌న‌కు మిత్ర‌ప‌క్ష‌మే..క‌మ్యూనిస్టులు బ‌ల‌హీన‌ప‌డ్డారు. కాబ‌ట్టి మ‌న‌మేం చేసినా ఎదురే ఉండ‌ద‌నుకొంది కేంద్ర ప్ర‌భుత్వం. ఆయా పార్టీల అవ‌స‌రాలు, వాటి బ‌ల‌హీన‌త‌ల‌నే ఆదారంగా చేసుకుంది. దీంతో విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు తెర‌తీసింది. అస్మ‌దీయుల‌కు క‌ట్ట‌బెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. అది కూడా చాలా ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ఉంటుంది. అదంతా మ‌నం రాబోయే రోజుల్లో చూస్తాం.

ఇందిరాగాంధీనే దిగివచ్చేలా చేసిన ఆంధ్రులు ఇప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటుపరం కాకుండా అడ్డుకోవడానికి ఏం చేస్తారో చూడాలి! రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ప్రజల బలహీనతలను గమనించిన కేంద్రపెద్దలు విశాఖ ఉక్కు విషయంలో వెనక్కి త‌గ్గుతారా? అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది.  అదేమిటో గానీ ఏపీ ప్రజల‌కు కుల‌, మ‌తాలే ముఖ్య‌మ‌య్యాయి. త‌మ జీవితాల‌తోను, త‌మ భ‌విష్య‌త్తుతోను ముడిపడి ఉన్న ఏ విషయంపైనా స్పందించడం లేదు. అమ‌రావ‌తి రాజ‌ధాని అంశం ఏమైంది?  పోల‌వ‌రం ఏమైంది?  విశాఖ ఉక్కు కూడా అంతే..

ముందుగా మారాల్సింది మ‌న ఆలోచ‌నా ధోర‌ణి. ఆ త‌ర్వాత ఏం చేయాల‌నేది ఆలోచిస్తే క‌ర్త‌వ్యం బోధ‌ప‌డుతుంది. లేదంటే మ‌న జుట్టేకాదు.. కాళ్లు కూడా ప‌ట్టుకొని త‌ల‌కిందులుగా వేలాడ‌దీస్తారు. త‌స్మాత్ జాగ్ర‌త్త‌!!.




మోటో జీ నుంచి మరో స్మార్ట్ ఫోన్లు లాంఛ్.. ధర తక్కువే..!

అల్లరి నరేష్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

రాధే శ్యామ్ కోసం ఏకంగా రైల్వేస్టేషన్ కట్టేశారా..!

మన వంటలక్క ఎంత పెద్ద చదువు చదివిందో తెలుసా..?

జగన్ అన్న ఒక్క మాట..... బీజేపీకి బ్రహ్మాస్త్రమా...?

జగడ్డ : భీమిలీ కంచుకోటలో పసందైన పంచాయతీ..?

జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>