PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pmcd67af1b-defd-4832-b4b1-2105c76227c7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pmcd67af1b-defd-4832-b4b1-2105c76227c7-415x250-IndiaHerald.jpgచెప్పేవాడికి వినేవాడు లోకువ‌ చెప్పేవాడికి వినేవాడు లోకువ‌ని పెద్దలు సామెత చెబుతుంటారు. అలాగే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ కూడా ఇప్పుడు దేశ ప్ర‌జ‌ల‌కు సుద్దులు చెబుతున్నారు. ఎనిమిది సంవ‌త్స‌రాలుగా అధికారం వెల‌గ‌బెడుతున్న‌ప్ప‌టికీ కేంద్ర ప్ర‌భుత్వంలో ఉన్న లోపాల‌న్నీ గ‌త ప్ర‌భుత్వాల‌పై నెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. pm;india;2019;central governmentచెప్పేవాడికి వినేవాడు లోకువ‌చెప్పేవాడికి వినేవాడు లోకువ‌pm;india;2019;central governmentThu, 18 Feb 2021 09:42:50 GMTచెప్పేవాడికి వినేవాడు లోకువ‌ని పెద్దలు సామెత చెబుతుంటారు. అలాగే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ కూడా ఇప్పుడు దేశ ప్ర‌జ‌ల‌కు సుద్దులు చెబుతున్నారు. ఎనిమిది సంవ‌త్స‌రాలుగా అధికారం వెల‌గ‌బెడుతున్న‌ప్ప‌టికీ కేంద్ర ప్ర‌భుత్వంలో ఉన్న లోపాల‌న్నీ గ‌త ప్ర‌భుత్వాల‌పై నెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఎనిమిది సంవ‌త్స‌రాల నుంచి మ‌న‌మేం చేశామ‌నేది ఆలోచించ‌డంపోయి ప్ర‌జ‌ల నుంచి న‌ర‌స‌న‌లు వ‌చ్చిన‌ప్పుడు, వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న‌ప్పుడు గ‌త ప్ర‌భుత్వాల‌దే పాపం అన‌డం ఫ్యాష‌నైపోయింది.

దేశంలో పెట్రోలు ధ‌ర‌లు పెర‌గ‌డానికి కార‌ణం గ‌త ప్ర‌భుత్వ విధానాలేనంటూ ప్ర‌ధాన‌మంత్రి తాజాగా ఆరోపించారు. త‌మిళ‌నాడులో స‌హ‌జ‌వాయువు పైప్‌లైన్ ను జాతికి అంకిత‌మిచ్చిన సంద‌ర్భంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఇంద‌న దిగుమ‌తులను త‌గ్గించ‌డంపై దృష్టిపెట్టి ఉంటే ఈరోజు పెట్రోలు ధ‌ర‌లు పెరిగి మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌పై భారం ప‌డేదికాదంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. న‌రేంద్ర‌మోడీ 2014లో అధికారంలోకి వ‌చ్చారు. 2019లో అధికారంలోకి వ‌చ్చారు. అప్ప‌టినుంచి ఆయ‌నే ప‌రిపాలిస్తున్నారు. విదాన ప‌ర‌మైన నిర్ణ‌యాల‌న్నీ ఎన్డీయే ప్ర‌భుత్వం తీసుకుంటోందికానీ గ‌త ప్ర‌భుత్వాలుకాదుక‌దా! ప్ర‌జ‌ల‌పై ఎటువంటి భారం ఉండ‌కూడ‌ద‌ని కేంద్రం అనుకుంటే పెట్రోలు ధ‌ర‌లు త‌గ్గించ‌డంపై దృష్టి సారించేవారుగా. కానీ అలా జ‌ర‌గ‌లేదు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని దేశాల్లో పెట్రోలు ధ‌ర‌లు చాలా త‌క్కువ‌గా ఉంటే మ‌న‌ద‌గ్గ‌ర మాత్రం రోజురోజుకు పైపైకి చేరుకుంటున్నాయి. ప్ర‌పంచ మార్కెట్‌లో క్రూడాయిల్ ధ‌ర‌లు త‌గ్గుతుంటే మ‌న‌ద‌గ్గ‌ర ధ‌ర‌లు ఎందుకు పెరుగుతున్నాయో అర్థంకాని అయోమ‌య స్థితిలో ప్ర‌జ‌లున్నారు.

 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలో భార‌త్ త‌న చ‌మురు అవ‌స‌రాల కోసం 85 శాతానికి పైగా దిగుమ‌తి చేసుకుంద‌ని, గ్యాస్ అవ‌స‌రాలు 53 శాతం దిగుమ‌తుల‌పై ఆధార‌ప‌డివున్నాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఈ ఎనిమిదేళ్ల‌లో అన్వేషించ‌లేదు. చ‌మురు ధ‌ర‌ల‌ను ఎలా త‌గ్గించాల‌నే విష‌యంపై చ‌ర్చించ‌లేదు. ఏ రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి? అక్క‌డ అధికారం ఎలా కైవ‌సం చేసుకుందాం? ఎమ్మెల్యేల క్యాంప్ రాజ‌కీయాలు ఎలా న‌డుపుదామ‌నే ఆలోచ‌న‌లోనే ఉన్న కేంద్ర పెద్ద‌ల‌కు మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల క‌ష్ట‌నష్టాలు ఎలా తెలుస్తాయిలే. రైతులు, వినియోగ‌దారుల కోసం ఇథ‌నాల్‌పై దృష్టి సారించిన‌ట్లు కేంద్రం చెపుతోంది. మేకిన్ ఇండియా ప్రాజెక్టు ఎక్క‌డుందో ఎవ‌రికీ తెలియ‌దు.. ఇప్పుడు ఇథ‌నాల్ పై దృష్టిసారిస్తే ప్ర‌జ‌ల‌కు ఎప్పుడు అందుబాటులోకి వ‌స్తుందో అర్థం చేసుకోవ‌చ్చు.


హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి భ‌య‌ప‌డుతున్న టీఆర్ ఎస్‌... అభ్య‌ర్థే దొర‌క‌డం లేదా..?

జగడ్డ: చంద్రగిరి టు కుప్పం.. కుప్పం టు అండమాన్..

తండ్రి వైసీపీ ఎమ్మెల్సీ... త‌న‌యుడు స‌ర్పంచ్‌

ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ రికార్డు విజ‌యం

మంత్రి పై బాంబు దాడి... ప‌రిస్థితి విష‌మం

రైటర్ యండమూరి గురించి ఓ వైరల్‌ పోస్ట్.. ఫుల్‌ కాంట్రావర్సీ..!?

"వకీల్ సాబ్ " కోసం మహేష్ ను ఫాలో అవుతున్న పవన్ ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>