PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcra8103544-b779-4513-9a54-a011ce5e870e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcra8103544-b779-4513-9a54-a011ce5e870e-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాల విషయంలో తప్పులు చేస్తున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయంలో సీఎం కేసీఆర్ జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఆ పార్టీకి చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. అయితే ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని సమాచారం. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఎంతమందికి సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయి ఏంటనే దానిపై ఆయన కొంత వివరాలు తెప్పించుకున్నట్లు తెలుkcr;kcr;amala akkineni;telangana rashtra samithi trs;congress;chief minister;partyకేసీఆర్ అధికారులకు చుక్కలు చూపిస్తారా...?కేసీఆర్ అధికారులకు చుక్కలు చూపిస్తారా...?kcr;kcr;amala akkineni;telangana rashtra samithi trs;congress;chief minister;partyThu, 18 Feb 2021 09:00:00 GMTముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాల విషయంలో తప్పులు చేస్తున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయంలో సీఎం కేసీఆర్ జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఆ పార్టీకి చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. అయితే ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని సమాచారం. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఎంతమందికి సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయి ఏంటనే దానిపై ఆయన కొంత వివరాలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది.

రాజకీయంగా భారతీయ జనతాపార్టీ కూడా దృష్టి పెట్టిన నేపథ్యంలో ఆయన కాస్త జాగ్రత్తగానే ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఉప ఎన్నికల మీద సీరియస్ గా  ఫోకస్ పెట్టింది. అయితే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అభ్యర్ధి లేకపోవడంతో ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉందని చెప్పాలి. ఈ తరుణంలో సీఎం కేసీఆర్ మరింత పక్కాగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఆయన సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుని సంబంధిత అధికారుల వద్ద నుంచి నివేదికలు తెప్పించుకున్నారని అంటున్నారు. ఈ నివేదికలో సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అమలు అవుతున్నాయి కొత్తగా పెన్షన్లు నమోదయ్యాయి అనే వివరాలను సీఎం కేసీఆర్ సేకరించారని తెలుస్తోంది. అయితే ఇక్కడ అధికారుల లోపాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని కూడా సీఎం కేసీఆర్ గుర్తించారని కూడా సమాచారం. అధికారులు కొంతమంది అలసత్వం ప్రదర్శించడంతో నాగార్జునసాగర్ పరిధిలో కొత్త పెన్షన్ నమోదు కావడం లేదని అలాగే టీఆర్ఎస్ పార్టీ నేతల్లో అనవసర ఉత్సాహం కూడా ఉంది అనే అంశాన్ని ఆయన గ్రహించారు అని అంటున్నారు. మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు. కానీ కొంతమంది అధికారులపై మాత్రం సీఎం కేసీఆర్ దృష్టి పెట్టే అవకాశాలున్నాయి.


సూర్యగా వస్తున్న షణ్ముఖ్.. సాఫ్ట్ వేర్ డెవలపర్ కు మించిన క్రేజ్..!

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి భ‌య‌ప‌డుతున్న టీఆర్ ఎస్‌... అభ్య‌ర్థే దొర‌క‌డం లేదా..?

జగడ్డ: చంద్రగిరి టు కుప్పం.. కుప్పం టు అండమాన్..

తండ్రి వైసీపీ ఎమ్మెల్సీ... త‌న‌యుడు స‌ర్పంచ్‌

ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ రికార్డు విజ‌యం

మంత్రి పై బాంబు దాడి... ప‌రిస్థితి విష‌మం

రైటర్ యండమూరి గురించి ఓ వైరల్‌ పోస్ట్.. ఫుల్‌ కాంట్రావర్సీ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>