MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8f711dcd-5b49-4c16-90af-afe3fa0ef066-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8f711dcd-5b49-4c16-90af-afe3fa0ef066-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ నిజంగా అతి పెద్ద సినీ పరిశ్రమ. బాలీవుడ్ తరువాత చెప్పాలంటే టాలీవుడ్ నే అంటారు. అతి పెద్ద ప్రొడక్షన్ హౌస్ గా సౌత్ లో ఉంది. ఇక ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ని కూడా దాటేస్తూ టాలీవుడ్ దూసుకుపోతోంది. పాన్ ఇండియా మూవీస్ ఒక్క టాలీవుడ్ లోనే ఎక్కువగా తయారవుతున్నారు. వరసపెట్టి అర డజన్ మంది హీరోలు కూడా పాన్ ఇండియా కెప్టెన్లుగా రెడీ అయిపోతున్నారు. tollywood;chiranjeevi;nagarjuna akkineni;kranthi;kranti;tara;makar sakranti;india;korea, south;bollywood;tollywood;industries;cinema;sankranthi;king;film industry;king 1;success;house;nijam;krack;coronavirusటాలీవుడ్ నోట ఆ రెండు సినిమాలే...?టాలీవుడ్ నోట ఆ రెండు సినిమాలే...?tollywood;chiranjeevi;nagarjuna akkineni;kranthi;kranti;tara;makar sakranti;india;korea, south;bollywood;tollywood;industries;cinema;sankranthi;king;film industry;king 1;success;house;nijam;krack;coronavirusThu, 18 Feb 2021 20:30:00 GMTటాలీవుడ్ నిజంగా అతి పెద్ద సినీ పరిశ్రమ. బాలీవుడ్ తరువాత చెప్పాలంటే టాలీవుడ్ నే అంటారు. అతి పెద్ద ప్రొడక్షన్ హౌస్ గా సౌత్ లో ఉంది. ఇక ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ని కూడా దాటేస్తూ టాలీవుడ్  దూసుకుపోతోంది. పాన్ ఇండియా మూవీస్ ఒక్క టాలీవుడ్ లోనే ఎక్కువగా తయారవుతున్నారు. వరసపెట్టి అర డజన్ మంది హీరోలు కూడా పాన్ ఇండియా కెప్టెన్లుగా రెడీ అయిపోతున్నారు.

ఇంతటి స్టామినా ఉన్న టాలీవుడ్ ని ఒక్క లెక్కన బ్రేక్ చేసి పారేసింది కరోనా వైరస్. దాంతో సినిమాలు చాలానే ఆగిపోయాయి. ఏకంగా పది నెలల పాటు సినీ పరిశ్రమ మూతపడిపోయింది. ఇంత పెద్ద సంక్షోభం ఇంతకు ముందు ఎన్నడూ లేదని కూడా టాలీవుడ్ పెద్దలు చెబుతారు. ఇవన్నీ పక్కన పెడితే కరోనా వైరస్ కొంత తగ్గింది. ఆ తరువాత చూస్తే అన్ లాక్ తో మెల్లగా థియేటర్లు తెరచుకున్నాయి.

అయినా జనాలు వస్తారా అన్న డౌట్ మాత్రం అందరికీ ఉంది. అయితే సంక్రాంతికి విడుదల అయిన క్రాక్ మూవీ సూపర్ డూపర్ హిట్ కొట్టి సినీ జనాలకు గొప్ప ధైర్యం ఇచ్చింది. ఇక ఆ తరువాత వచ్చిన ఉప్పెన సినిమా అయితే అతి పెద్ద విజయమే నమోదు చేసింది. ఒక కొత్త హీరోకు ఇంతటి సక్సెస్ దక్కడ ఒక రికార్డుగా అంతా చెబుతున్నారు. దాంతో ఇపుడు ఈ రెండు సినిమాలను టాలీవుడ్ ప్రముఖులు పదే పదే స్మరిస్తున్నారు. టాలీవుడ్ లో ఈ రెండు సినిమాలు ఎనలేని నమ్మకాన్ని ఇచ్చాయని అంతా అంటున్నారు. మొన్నటికి మొన్న ఉప్పెన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి అయితే సంక్రాంతి సినిమాలు మళ్ళీ టాలీవుడ్ కి కొత్త ఆశలు కల్పించాయని చెప్పారు.

ఇక తాజాగా కపటధారి సినిమా ఫంక్షన్ లో  కింగ్ నాగార్జున కూడా అదే మాట అన్నారు. క్రాక్, ఉప్పెన సినిమాలు రెండూ రిలీజ్ అయి టాలీవుడ్ కి గొప్ప భరోసా ఇచ్చాయని నాగ్ చెప్పారు. మొత్తానికి ఈ రెండు సినిమాలను మాత్రం టాలీవుడ్ ఇప్పట్లో మరచిపోయేలా లేదు.




ఆ పదవి నాకే కావాలి.. కోర్టుకెక్కిన శశికళ

అల్లరి నరేష్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

రాధే శ్యామ్ కోసం ఏకంగా రైల్వేస్టేషన్ కట్టేశారా..!

మన వంటలక్క ఎంత పెద్ద చదువు చదివిందో తెలుసా..?

జగన్ అన్న ఒక్క మాట..... బీజేపీకి బ్రహ్మాస్త్రమా...?

జగడ్డ : భీమిలీ కంచుకోటలో పసందైన పంచాయతీ..?

జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>