- Mission 2020 Movie To Release On March 5th (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
- Mission 2020 Movie To Release On March 5th (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
- Mission 2020 Movie To Release On March 5th (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
మార్చ్ 5న విడుదల అవుతున్న మిషన్ 2020
హనీ బన్నీ క్రియేషన్స్ సమర్పణలో మధు మృదు ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై శ్రీ మిత్ర & మై విలేజ్ సమర్పణలో నవీన్ చంద్ర హీరో గా బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ గారి ప్రేరణ తో యదార్ధ సంఘటనల ఆధారంగా సమకాలీన రాజకీయ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న సినిమా "మిషన్ 2020". గతం లో శ్రీకాంత్ హీరో గా రాజకీయ నేపథ్యంతో విడుదలైన మెంటల్ పోలీస్, ఆపరేషన్ 2019 సినిమాలు ఘన విజయం సాధించాయి. ఆ రెండు సినిమాలకి కారణం బాబ్జి దర్శకుడు. ఇప్పుడు మిషన్ 2020 కూడా అలాంటి సమకాలీన రాజకీయ కథ కథనం తో రూపుదిద్దుకుంటుంది. కరణం బాబ్జి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా కుంట్లూర్ వెంకటేష్ గౌడ్ మరియు కె వి ఎస్ ఎస్ ఎల్ రమేష్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకున్న ఈ చిత్రం మార్చ్ 5న విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో చిత్ర విశేషాలు తెలియచేసారు.
నిర్మాత కుంట్లూర్ వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ " నిర్మాతగా మేము చేస్తున్న మొదటి సినిమా ఇది. ఈ సినిమాను చూసి ఏషియన్ ఫిలిమ్స్ వాళ్ళు విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించిన వాళ్లకు ఈ సినిమా నచ్చిందంటే అక్కడే మేము సక్సెస్ అయినట్టు. సమాజానికి కావలసిన మంచి సందేశంతో ఈ చిత్రాన్ని నిర్మించాం . తప్పకుండా మార్చ్ 5న నైజం లో ఆసియన్ ఫిలిమ్స్ ద్వారా విడుదల అవుతున్న ఈ సినిమా పెద్ద విషయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు.
ఆసియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగ్ : ఈ సినిమా చూసాను, చాలా బాగుంది. ఈ రోజుల్లో కూడా ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న కథతో సినిమా తీయడం అంటే నిజంగా డేరింగ్ స్టెప్ అనుకోవచ్చు. సినిమా బాగా నచ్చింది కాబట్టి మా ఆసియన్ ఫిలిమ్స్ ద్వారా నైజం లో విడుదల చేస్తున్నాం అన్నారు.
ఎక్సిభిటర్ శ్రీధర్ మాట్లాతుడు .. : ఈ సినిమా చూసాను చాలా బాగుంది. తల్లి దండ్రులకు బాగా తెలుస్తుంది. తప్పకుండా ఈ సినిమా పెద్ద విషయం సాధిస్తుంది. ఇలాంటి సినిమాలు మరిన్ని రావలసిన అవసరం ఉంది అన్నారు.
దర్శకుడు కరణం బాబ్జి మాట్లాడుతూ " చిన్న సినిమాగా తీసాం ఈ సినిమాను కానీ ఈ సినిమా చుసిన ఆసియన్ ఫిలిం సునీల్ నారంగ్ గారు నైజం లో విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాను వాళ్ళు విడుదల చేయడంతోనే మేము సగం సక్సెస్ అయినట్టు భావిస్తున్నాం అన్నారు. నేటి సమాజంలో జరుగుతున్నా పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం అన్నారు.
నిర్మాత కె వి ఎస్ ఎస్ ఎల్ రమేష్ రాజు మాట్లాడుతూ : మార్చ్ 5న విడుదల చేస్తున్నాం .. ఆసియన్ సునీల్ గారు ఈ చిత్రాన్ని విడుదల చేయడం నిజంగా ఆనందంగా ఉంది. ఈ సినిమాలోని సాంగ్స్ కూడా బాగున్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయి సినిమా పై భారీ అంచనాలు పెంచాయి. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చి పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను అన్నారు.
సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ మాట్లాడుతూ " మా డైరెక్టర్ కరణం బాబ్జి తో ఇది నా రెండో సినిమా. ఆసియన్ సినిమాస్ ద్వారా మా చిత్రాన్ని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇలాంటి గొప్ప బ్యానర్ లో మా సినిమా విడుదల అవ్వడం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.ఆ లగే ఈ సినిమాలో అల్లుడా గారెలొండాలా .. అల్లుడా .. బూరె లొండాలా సాంగ్ సూపర్ హిట్ అయింది. ఇది ఒక బాధ్యతగల సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. తప్పకుండా నాకు మ్యూజిక్ పరంగా మంచి పేరు తెచ్చి పెట్టే సినిమా అవుతుంది " అన్నారు.
నటి నటులు : నవీన్ చంద్ర, నాగ బాబు, జయ ప్రకాష్, సత్య ప్రకాష్, అజయ్ రత్న, దిల్ రమేష్, కోటేష్ మానవ, స్వాతి, సమీర్, చలాకి చంటి, బుల్లెట్ భాస్కర్, శ్రీ సుధా, సంధ్య జనక్, తదితరులు.
కెమెరా మాన్ : వెంకట్ ప్రసాద్
సంగీతం : ర్యాప్ రాక్ షకీల్
ఎడిటర్ : ఎస్ బి ఉద్ధవ్
ఆర్ట్ డైరెక్టర్ : జె కె మూర్తి
ఫైట్స్ : సింధూరం సతీష్, వై రవి
డాన్స్ మాస్టర్ : గణేష్ మాస్టర్
కథ, కథనం, మాటలు, డైరెక్టర్ : కరణం బాబ్జి
నిర్మాతలు : కుంట్లూర్ వెంకటేష్ గౌడ్ మరియు కె వి ఎస్ ఎస్ ఎల్ రమేష్ రాజు