PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections69f1d1e5-329e-4250-9d3b-074cc6496e96-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections69f1d1e5-329e-4250-9d3b-074cc6496e96-415x250-IndiaHerald.jpgఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల మూడు విడతలు పూర్తయ్యాయి. ఇక ఇప్పటికే దాదాపుగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైపోయింది అనే చెప్పాలి. ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించడంతో మున్సిపల్ ఎన్నికల కోడ్ కూడా అమలులోకి వచ్చేసింది. అయితే ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం పరిస్థితి వెనక చూస్తే నుయ్యి ముందు చూస్తే గొయ్యి అన్నట్లు తయారైంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ఎక్కడైతే ప్రక్రియ ఆగిందో ఆ ఆగిన చోట నుంచి కొనసాగిస్తూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇnimmagadda elections jagan;amala akkineni;andhra pradesh;panchayati;courtజగడ్డ : నిమ్మగడ్డకు ముందు నుయ్యి, వెనుక గొయ్యి !జగడ్డ : నిమ్మగడ్డకు ముందు నుయ్యి, వెనుక గొయ్యి !nimmagadda elections jagan;amala akkineni;andhra pradesh;panchayati;courtThu, 18 Feb 2021 12:00:00 GMTఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల మూడు విడతలు పూర్తయ్యాయి. ఇక ఇప్పటికే దాదాపుగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైపోయింది అనే చెప్పాలి. ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించడంతో మున్సిపల్ ఎన్నికల కోడ్ కూడా అమలులోకి వచ్చేసింది. అయితే ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం పరిస్థితి వెనక చూస్తే నుయ్యి ముందు చూస్తే గొయ్యి అన్నట్లు తయారైంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ఎక్కడైతే ప్రక్రియ ఆగిందో ఆ ఆగిన చోట నుంచి కొనసాగిస్తూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని కోరింది. అయితే ప్రభుత్వ ప్రతిపాదనలకు సంబంధించి ఎన్నికల సంఘం కమిషనర్ సమాలోచనలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. 

ఇప్పుడు ఏం చేయొచ్చు అనే దానిమీద ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తులు చేస్తుందట. అయితే మొత్తంగా ఎన్నికల కమిషన్ ముందు మూడు ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి ఆగిన చోట నుంచి ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టడం, రెండు కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం, మూడు ఈ ఎన్నికల నిర్వహణ ఇక్కడితో వదిలేసి కొత్త ఎస్ఈసీకి ఈ బాధ్యతలను అప్పగించడం. అయితే ఈ మూడు ఆప్షన్స్ లో మూడో ఆప్షన్ బెటర్ అని నిమ్మగడ్డ భావిస్తున్నారట. 

ఎందుకంటే ఆగిన చోటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తే ప్రతిపక్షాల నుంచి పెద్దఎత్తున అభ్యంతరాలు వస్తాయి, ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్నారని ప్రచారం మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. లేదు కొత్త నోటిఫికేషన్ ఇద్దామని ప్రయత్నం చేస్తే న్యాయపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో ఎన్నికల ప్రక్రియ ఆపేస్తున్నప్పుడే ఆగిన చోట నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామని గతంలో ప్రకటించారు. ఈ ప్రకటనను బేస్ చేసుకుని ప్రభుత్వం కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. సో ఈ రెండు ఆప్షన్స్ కంటే ఈ ఎన్నికల నిర్వహణను కొత్త ఎస్ఈసీకి వదిలివేయటం బెటర్ అని భావిస్తున్నారట. మరి చూడాలి ఏమవుతుంది అనేది..




కేకు మనిషి.. ఇతడిని కోసుకుని తినొచ్చు..

ఒక్కరోజు CM అవుతున్న రాం చరణ్..!

బేబమ్మని చూసి నేర్చుకోండమ్మా..!

నాకు ఎనిమిదేళ్లు పట్టింది.. చరణ్ గట్స్ కు మెచ్చుకోవాల్సిందే..!

బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ లు వీళ్ళే..?

పెదనాన్న కోసం ఆలోచనలను మార్చుకుంటున్న ప్రభాస్ !

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి భ‌య‌ప‌డుతున్న టీఆర్ ఎస్‌... అభ్య‌ర్థే దొర‌క‌డం లేదా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>