PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/high-court-comments-on-govt-of-telangana3c157655-230c-4c4e-a1d5-6f106215d884-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/high-court-comments-on-govt-of-telangana3c157655-230c-4c4e-a1d5-6f106215d884-415x250-IndiaHerald.jpgహైకోర్ట్ న్యాయవాది జంట హత్యల కేసు పై హైకోర్టు విచారణ జరిగింది. న్యాయవాదుల హత్య పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హైకోర్టు.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అడ్వకేట్ వామన్ రావు, అతని సతీమణి నాగమణి హత్య కేసును సుమోటోగా స్వీకరించింది. ఈ హత్యకు సంబంధించిన అన్ని ఆధారాలు పగడ్బందీగా సేకరించాలని అడ్వకేట్ జనరల్ ని ఆదేశించిన హైకోర్టు... మార్చి 1 లోపు సమగ్రమైన నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వానికి ,పోలీస్ శాఖ కు నోటిసులు జారీ చేసింది. హత్య జరిగినచోట అన్ని ఆధారాలను సేకరించి కేసు కు సంబంధించిన పూtelangana,ts;rtc;high court;bus;court;lawyer;murder.;traffic police;marchబస్సులో ఉన్న ప్రయాణికులు కూడా సాక్షులే... తెలంగాణా హైకోర్ట్ సంచలన వ్యాఖ్యలుబస్సులో ఉన్న ప్రయాణికులు కూడా సాక్షులే... తెలంగాణా హైకోర్ట్ సంచలన వ్యాఖ్యలుtelangana,ts;rtc;high court;bus;court;lawyer;murder.;traffic police;marchThu, 18 Feb 2021 15:06:41 GMTహైకోర్ట్ న్యాయవాది జంట హత్యల కేసు పై హైకోర్టు విచారణ జరిగింది. న్యాయవాదుల హత్య  పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హైకోర్టు.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అడ్వకేట్ వామన్ రావు, అతని సతీమణి నాగమణి హత్య కేసును సుమోటోగా  స్వీకరించింది. ఈ హత్యకు సంబంధించిన అన్ని ఆధారాలు పగడ్బందీగా సేకరించాలని  అడ్వకేట్ జనరల్ ని ఆదేశించిన హైకోర్టు... మార్చి 1 లోపు సమగ్రమైన నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వానికి ,పోలీస్ శాఖ కు నోటిసులు జారీ చేసింది. హత్య జరిగినచోట అన్ని ఆధారాలను సేకరించి  కేసు కు సంబంధించిన పూర్తి వివరాలు తెలపాలని హైకోర్టు ఈ సందర్భంగా ఆదేశించింది.

హత్య జరిగిన వెంటనే పోలీస్ శాఖ అప్రమత్తమైందని కోర్టుకు ఏజీ వివరించారు. హంతకులను అతి త్వరలోనే  అదుపులోకి తీసుకుంటామని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలంతా కూడా ప్రభుత్వం వైపు చూస్తున్నారని హైకోర్ట్ వ్యాఖ్యానించింది. ప్రభుత్వం పైన న్యాయ వ్యవస్థ పైన ప్రజలకు  నమ్మకం కలగాలంటే తప్పనిసరిగా ఈ కేసులో అన్ని ఆధారాలు సేకరించాలని హైకోర్టు ఆదేశించింది. పగడ్బందీగా ఆధారాలు సేకరించి వాటిని చాలా జాగ్రత్తగా భద్ర పరచాలని స్పష్టం చేసింది.

హత్య జరిగిన సమయంలో రెండు ఆర్టీసీ బస్సులు కూడా ఉన్నాయన్న హైకోర్టు.. ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణికులు ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా సాక్షులుగా తీసుకోవాలని హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సోషల్ మీడియాలో కూడా హత్యలు చిత్రీకరించిన కొన్ని క్లిప్స్ వస్తున్నాయి వాటిని వెరిఫై చేసి దాన్ని కూడా సాక్ష్యంగా భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. ఇది రాష్ట్ర ప్రతిష్టకు, ప్రజల భద్రతకు సంబంధించిన కేసు గా చూడాలని ఏజీ కి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మార్చ్ 1 కి వాయిదా  వేసింది కోర్ట్. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అదుపులోకి తీసుకున్నారు.


నాతో మైండ్ గేమ్ ఆడలేరు: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భార్య గురించి ఆసక్తికర విషయాలు

ఒక్కరోజు CM అవుతున్న రాం చరణ్..!

బేబమ్మని చూసి నేర్చుకోండమ్మా..!

నాకు ఎనిమిదేళ్లు పట్టింది.. చరణ్ గట్స్ కు మెచ్చుకోవాల్సిందే..!

బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ లు వీళ్ళే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>