SpiritualityChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/writer-yandamoorid3e2c044-6166-4973-b11e-3491f83e1bb9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/writer-yandamoorid3e2c044-6166-4973-b11e-3491f83e1bb9-415x250-IndiaHerald.jpgరచయిత యండమూరి గురించి తెలియని తెలుగు సాహితీ అభిమానులు అరుదు. ఆయనకు లక్షలమంది అభిమానులున్నా ఆయన్ను విమర్శించేవారూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. తాజాగా ఆయన గురించి ఓ ఫేస్‌బుక్ పోస్టు బాగా వైరల్ అవుతోంది. దీనిపై కామెంట్ల వర్షం కురుస్తోంది. Hari Krishna MB రాసిన ఈ పోస్టు మీరూ చదవండి. నా స్మృతి లో యండమూరి.. CA చదివేవాళ్ళకి ఫైనల్ పరీక్షలు అయ్యాక ఒక 15 రోజులు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఉంటుంది. నేను అటెండ్ అయినప్పుడు, అందులో ఒకరోజు యండమూరి, ఇంకోరోజు గంపా నాగేశ్వర రావు లాంటి ఉద్దండులు వచ్చి writer-yandamoori;koti;hari;hari music;krishna;manu;varsha;gold;writer;cigarette;mahaరైటర్ యండమూరి గురించి ఓ వైరల్‌ పోస్ట్.. ఫుల్‌ కాంట్రావర్సీ..!?రైటర్ యండమూరి గురించి ఓ వైరల్‌ పోస్ట్.. ఫుల్‌ కాంట్రావర్సీ..!?writer-yandamoori;koti;hari;hari music;krishna;manu;varsha;gold;writer;cigarette;mahaThu, 18 Feb 2021 06:00:00 GMTరచయిత యండమూరి గురించి తెలియని తెలుగు సాహితీ అభిమానులు అరుదు. ఆయనకు లక్షలమంది అభిమానులున్నా  ఆయన్ను విమర్శించేవారూ  పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. తాజాగా ఆయన గురించి ఓ ఫేస్‌బుక్ పోస్టు బాగా వైరల్ అవుతోంది. దీనిపై కామెంట్ల వర్షం కురుస్తోంది.  
Hari krishna MB రాసిన ఈ పోస్టు మీరూ చదవండి.


నా స్మృతి లో యండమూరి..
CA చదివేవాళ్ళకి ఫైనల్ పరీక్షలు అయ్యాక ఒక 15 రోజులు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఉంటుంది. నేను అటెండ్ అయినప్పుడు, అందులో ఒకరోజు యండమూరి, ఇంకోరోజు గంపా నాగేశ్వర రావు లాంటి ఉద్దండులు వచ్చి వారి పైత్యం కక్కేవారు. యండమూరి కూడా CA నే...అప్పటికి నేనేమీ పెద్ద సాహిత్యం చదవలేదు. ఇప్పటికే చదవలేదు, అది వేరే సంగతి.. అయినా యండమూరి అంటే ఎందుకో కొంత క్రేజ్ ఉండేది.


ఒక రోజు పొద్దున్నే ఆయన వచ్చారు.. తాను routine గా చెప్పేవి అప్పుడూ చెప్పాడు.. కానీ రాను రాను తన ముందున్న పిల్లల్ని వెధవలు గా ఊహించుకుని, వీళ్ళు nothing అనే ఉద్దేశం లోనే అన్నీ చెబుతున్నాడు అనే ఫీలింగ్ వచ్చింది.. బ్రేక్ లో వెళ్లి ఈ విషయం పై మాట్లాడదాం అని ఆగాను.. తీరా బ్రేక్ లో బయటకి వెళ్తే ఆయన రెండు చేతి వేళ్ళ మధ్యలో రెండు సిగరెట్లు పెట్టుకుని ఒక దాని తర్వాత ఇంకోటి గ్యాప్ లేకుండా పీలుస్తున్నాడు.. అదీ తన చుటూ ముగ్గురు పిల్లల మధ్య... ఆ దెబ్బకి నా కళ్ళు రెండూ బార్లా తెరుచుకున్నాయి.. ఇక దగ్గరికి వెళ్లి అడిగే సాహసం కూడా చెయ్యలేదు..

 
సిగరెట్ తాగడం ఆయన పర్సనల్ విషయం... దాన్ని మనం పట్టించుకోవడం ఎందుకు అనే theory కూడా ఉంది... నేనలా అనుకోలేను ఇప్పటికీ చాలా విషయాల్లో... మనుషుల మధ్య పొగ తాగడం మంచిది కాదు, తనకూ మంచిది కాదు అనే విషయం తెలియని మనిషి పెద్ద పెద్ద కబుర్లు చెప్తే ఏం ఉపయోగం... ఆ తర్వాత ఎప్పుడో ఆయన అత్యంత ఇష్టమైన నవల అంతర్ముఖం చదివా... ఆ దెబ్బకు ఇక మళ్ళీ ఆయన పుస్తకాలు చదవకూడదు అని డిసైడ్ అయ్యా... చాలా మంది గొప్ప పుస్తకం అనేసరికి, నేనేమైనా తప్పుగా చదివానేమో అని మళ్ళీ ఒక ఛాన్స్ అని "ఆనందోబ్రహ్మ" చదివా.... ఇది ఇంకా బండలు... ఇక మళ్ళీ అటువైపు వెళ్ళలేదు..

అన్నీ చదవడం కాదు, ఏది చదవాలో, ఏది వదిలేయాలో తెలుసుకోవడం కూడా ముఖ్యమే. Not all that glitters is gold అని ఊరికే అనలేదు... మెరిసేదంతా బంగారం కాదు... ఆ మధ్య దున్నపోతుల అనే పుస్తకం రాసి, అందులో మతం మీద భక్తి మీద గట్టిగా కొన్ని మాటలు రాసి - తీరా పుస్తక విడుదల సమయం లో భక్తుల దాడికి భయపడి చాలావాటిని ఉపసంహరించుకున్న మహా మేధావి ఈయన.
ఇలాంటి నిరుద్యోగ వ్యక్తిత్వ వికాస నిపుణులకు positivity అంటే తెగ మోజు.. మనం వాస్తవం మాట్లాడితే అది negativity అయిపోతుంది... ఇలాంటి positive మహమ్మారి కి దూరం గా ఉండడం చాలా ముఖ్యం...

- Hari krishna MB




రెస్టారెంట్ సిబ్బందికి భారీ టిప్ ఇచ్చిన జంట.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..!

జగడ్డ : మొత్తం పంచాయతీ ఎన్నికలలోనే అతి పెద్ద ఓటమి ...?

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ హవా.. టీడీపీ క్లీన్ బౌల్డ్..!!

మూడో విడ‌త ఫలి‌తాల్లో ర‌స‌వ‌త్త‌ర పోరు.. తాజా లెక్క ఇదే!

విశాఖ ఉక్కుపై హామీ ఇచ్చిన సి‌ఎం జగన్ !!

ఈ వారం నాలుగు సినిమాలు.. గెలుపెవరిది ?

టాలీవుడ్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టపడే ఏకైక హీరో ఎవరో తెలుసా..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>