PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/unexpected-shock-to-the-lotus-party14a261cf-d18d-43b1-b9ee-be2ae6fe2dd1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/unexpected-shock-to-the-lotus-party14a261cf-d18d-43b1-b9ee-be2ae6fe2dd1-415x250-IndiaHerald.jpgపంజాబ్‌లో బీజేపీకి గట్టిషాక్ తగిలింది. పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ జయభేరీ మోగించింది. సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తున్న వేళ.. వారి ఆందోళనలు... పంజాబ్‌ మున్సిపోల్స్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో పంజాబ్‌ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్న వేళ.. ఆ రాష్ట్రంలో బీజేపీకి గట్టి షాక్‌ తగిలింది. మున్సిపోల్స్‌లో బీజేపీ ఓటమి చవిచూసింది. మొత్తం 8 మున్సిపల్‌ కార్పొరేషన్లలో 7 చోట్ల కాంగ్రెస్‌ నెగ్గింది. మరోచోట ఫలితం వెలువడాల్సి ఉంది. unexpected shock to the lotus party;bharatiya janata party;hosta;congress;capital;history;job;february;punjab;josh;partyకమలం పార్టీకి ఊహించని షాక్..!కమలం పార్టీకి ఊహించని షాక్..!unexpected shock to the lotus party;bharatiya janata party;hosta;congress;capital;history;job;february;punjab;josh;partyThu, 18 Feb 2021 19:00:00 GMTకాంగ్రెస్ జయభేరీ మోగించింది. సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తున్న వేళ.. వారి ఆందోళనలు... పంజాబ్‌ మున్సిపోల్స్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో పంజాబ్‌ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్న వేళ.. ఆ రాష్ట్రంలో బీజేపీకి గట్టి షాక్‌ తగిలింది. మున్సిపోల్స్‌లో బీజేపీ ఓటమి చవిచూసింది. మొత్తం 8 మున్సిపల్‌ కార్పొరేషన్లలో 7 చోట్ల కాంగ్రెస్‌ నెగ్గింది. మరోచోట ఫలితం వెలువడాల్సి ఉంది. ఈ ఫలితాల్లో బీజేపీ , రెండో స్థానంలోనూ నిలువలేకపోయింది.
 
రాష్ట్రంలోని మొత్తం 8 మున్సిపల్‌ కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లోని 2 వేల 302 వార్డులకు... ఫిబ్రవరి 14న ఎన్నికలు జరిగాయి.అబోహర్‌, బటిండా, కపూర్తల, హొషియార్‌పుర్‌, మోగ మున్సిపల్‌ కార్పొరేషన్లలో కాంగ్రెస్‌ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మరో రెండు కార్పొరేషన్లు బటాలా, పఠాన్‌కోట్‌ల‌ను  తన ఖాతాలో వేసుకుంది. నగర పంచాయతీల్లోనూ చాలా చోట్ల కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉండగా.. శిరోమణి అకాళీదళ్‌, ఆమ్‌ఆద్మీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.బీజేపీ నాలుగోస్థానానికి పడిపోయింది.

మొహాలీ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని రెండు పోలింగ్‌ కేంద్రాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో... అక్కడ మంగళవారం రీపోలింగ్‌ నిర్వహించారు. దీంతో ఈ కార్పొరేషన్‌లో ఓట్ల లెక్కింపు ఆలస్యం కానుంది.
బటిండా మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ పార్టీ చరిత్ర సృష్టించింది. 53ఏళ్లలో తొలిసారిగా ఇక్కడ మేయర్‌ పదవిని దక్కించుకుంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఈ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌కు 43 స్థానాలు రాగా.. శిరోమణి అకాలీదళ్‌ 7 చోట్ల గెలుపొందింది. దీంతో మేయర్‌ పదవి హస్తం పార్టీ కైవసం చేసుకుంది. మొత్తానికి బీజేపీ ఏదో ఊహించుకుంది మరేదో జరిగిపోయింది. ఎలాగైనా గెలిచితీరుతామనే ఓవర్ కాన్ఫిడెన్స్ కు పోయి చివరకు  చతికిలపడింది.

ముఖ్యంగా పంజాబ్ లో బీజేపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం.. రైతు వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా అక్కడి రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఇదే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బతీసింది. హస్తం పార్టీ గెలిచింది. ఇంకేముంది కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్ లో ఉంది.





ఆ పదవి నాకే కావాలి.. కోర్టుకెక్కిన శశికళ

అల్లరి నరేష్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

రాధే శ్యామ్ కోసం ఏకంగా రైల్వేస్టేషన్ కట్టేశారా..!

మన వంటలక్క ఎంత పెద్ద చదువు చదివిందో తెలుసా..?

జగన్ అన్న ఒక్క మాట..... బీజేపీకి బ్రహ్మాస్త్రమా...?

జగడ్డ : భీమిలీ కంచుకోటలో పసందైన పంచాయతీ..?

జగడ్డ : రెచ్చిపోయిన వైసీపీ, ఏకంగా బ్యాలట్ బాక్సులు ఎత్తుకెళ్ళి తగలబెట్టేశారు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>