PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsf24d3a72-7103-4237-a58a-16cdb794d478-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsf24d3a72-7103-4237-a58a-16cdb794d478-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలు జరుగుతున్నాయి. పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఈ ఎన్నికలు పేరుకు మాత్రమే అన్నట్లు అయిపోయింది.లీడింగ్ లో ఉన్న పార్టీలు వారి అభ్యర్థులను ఎలాగైనా గెలిపించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు పూర్తి చేసుకున్నాయి. మిగిలిన పార్టీల తో పోలిస్తే వైసీపీ, టీడీపీ పార్టీలు మాత్రం నియోజక వర్గాల్లో గట్టి పోటీని ఇస్తున్నారు.ఈ క్రమంలో అధికారంలో ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సహజంగానే అత్యధిక సర్పంచ్‌ పదవులను కైవసం చేసుకుంటోంది. తొలి విడత ఎన్నికలలో 2jagan-nimmagadda-elections;view;vishwa;telugu desam party;andhra pradesh;botcha satyanarayana;telugu;media;panchayati;tdp;news;ycp;nijam;partyజగడ్డ: ఆ విషయం లో రూటు మార్చుకున్న బాబోరూ.. ఈ ఎన్నికల్లో గెలుపు ఖాయమా?జగడ్డ: ఆ విషయం లో రూటు మార్చుకున్న బాబోరూ.. ఈ ఎన్నికల్లో గెలుపు ఖాయమా?jagan-nimmagadda-elections;view;vishwa;telugu desam party;andhra pradesh;botcha satyanarayana;telugu;media;panchayati;tdp;news;ycp;nijam;partyWed, 17 Feb 2021 09:00:00 GMTఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలు జరుగుతున్నాయి. పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఈ ఎన్నికలు పేరుకు మాత్రమే అన్నట్లు అయిపోయింది.లీడింగ్ లో ఉన్న పార్టీలు వారి అభ్యర్థులను ఎలాగైనా గెలిపించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు పూర్తి చేసుకున్నాయి. మిగిలిన పార్టీల తో పోలిస్తే వైసీపీ, టీడీపీ పార్టీలు మాత్రం నియోజక వర్గాల్లో గట్టి పోటీని ఇస్తున్నారు.ఈ క్రమంలో అధికారంలో ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సహజంగానే అత్యధిక సర్పంచ్‌ పదవులను కైవసం చేసుకుంటోంది. తొలి విడత ఎన్నికలలో 2,640 పంచాయతీలు వైఎస్సార్‌సీపీ కైవసం అయితే టీడీపీకి 518 వరకు వచ్చాయని ఒక లెక్క.



అయితే దీనిపై టీడీపీ కాస్త గందరగోళంగా లెక్కలు చెప్పింది. తొలుత 1,050 పంచాయతీలు గెలుచుకున్నామని ఒకసారి, అసలు పంచాయతీ ఎన్నికలు సరిగా జరపడంలో ఎన్నికల కమిషన్‌ విఫలం అయిందని, చాలా చోట్ల దౌర్జన్యాలు జరిగాయని మరోసారి ఆరోపించింది.ఇక ఈ విషయం పై ఎన్నికల కమీషన్ మాత్రం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని పేర్కొనడంతో మొన్నటి వరకు వెనకేసుకొచ్చిన టీడీపీ సడెన్ గా విమర్శించడం మొదలుపెట్టింది.రెండో విడత పోలింగ్‌లో కూడా వైఎస్సార్‌సీపీకి 2,504 పంచాయతీలు, టీడీపీకి 479 పంచాయతీలు వచ్చినట్లు వైఎస్‌ఆర్‌సీపీ తెలిపింది. ఈ మేరకు వారు సర్పంచ్‌ల పేర్లతో సహా ప్రకటించారు.



తెలుగుదేశం పార్టీ మాత్రం తమకు 666 వచ్చాయని సంబరాలు చేసుకున్నట్లు టీడీపీ అనుకూల మీడియా తెలిపింది..అక్కడితో ఆగని బాబు 38 శాతం సర్పంచ్ పదవులను దక్కించుకున్నట్లు చంద్ర బాబు డప్పులు కొట్టుకున్నారు.ఆంధ్రప్రదేశ్‌ ప్రజల గుండెచప్పుడు, ఆత్మ తామేనని చెప్పుకునే ఒక పెద్ద పత్రికకు తెలుగు రాష్ట్రాలలో మారుమూల ప్రాంతాలలో కూడా నెట్‌వర్క్‌ ఉంది. వారి ప్రతినిధులు ఉంటారు. నిజంగానే టీడీపీకి పెద్ద సంఖ్యలో పంచాయతీలు వచ్చి ఉంటే, ఆ విషయాన్ని వారు స్వయంగా సేకరించి వార్తలుగా ప్రచురించేవారు. వారు అలా చేయకుండా వైఎస్సార్‌ సీపీ పక్షాన బొత్స చేసిన ప్రకటనను, అలాగే టీడీపీ వారు ఇచ్చిన ప్రకటనను ప్రచురించి ఊరుకున్నారు.. ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు బాబు మూడో విడత పోలింగ్ తమకే అనుకూలంగా వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకోసం కొత్త వ్యూహాలు కూడా రచించారు. మరి ఈరోజు జరగనున్న ఎన్నికల్లో బాబు లెక్కలు ఏ మాత్రం వర్కౌట్ అవుతాయో చూడాలి..




జగడ్డ : విశాఖ ఏజెన్సీలో మధ్యాహ్నంతో సరి

హెరాల్డ్ సెటైర్ : వీళ్ళు ప్రజల కోసమే పోరాటాలు చేస్తున్నారట

జగడ్డ: ప్రశాంతంగా మొదలైన మూడో విడత పోలింగ్..!

సాయి కుమార్.. జీవితంలో చేసిన అతి పెద్ద మిస్టేక్‌ ఏంటో చెప్పేశాడు..!?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ః నిమ్మ‌గ‌డ్డ అస్సలు త‌గ్గ‌డం లేదుగా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డ వల్ల వైసీపీకి ఎంత మేలు జరిగిందో తెలుసా ?

అయ్యబాబోయ్ వైష్ణవ్ తేజ్ ఏంటీ స్పీడు.. మూడో సినిమా ఆ బ్యానర్ లోనే దుమ్ముదులిపేయడమే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>