AutoSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/auto/scorpio_scorpio/raino-cars362bdd67-27f6-45d1-892c-154964f383a4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/auto/scorpio_scorpio/raino-cars362bdd67-27f6-45d1-892c-154964f383a4-415x250-IndiaHerald.jpgరెనో కారు యువత లో మంచి డిమాండ్ ను తెచ్చుకుంది. ఇప్పటివరకు ఈ కంపెనీ నుంచి వచ్చిన అన్నీ కార్లు కూడా మంచి మార్కెట్ ను సంతరించుకున్నాయి. ఇకపోతే ఇప్పుడు మరో కారు జనాల మనసును దోచుకునే ప్రయత్నం చేస్తుంది.నిస్సాన్‌ మాగ్నైట్‌, హ్యుందాయ్‌ వెన్యూ, కియా సోనెట్‌, మహీంద్రా ఎక్స్‌యూవీ 300, మారుతీ సుజుకీ విటారా బ్రెజాకు ఇది పోటీగా నిలవనుంది. ఇక ధర విషయానికి వస్తే వేరియంట్‌ను బట్టి రూ.5.45 లక్షల నుంచి రూ.9.55 లక్షల వరకు అందుబాటులో ఉంది.. raino cars;auto;manya;apple;petrol;vegetable market;mahindraఅతి తక్కువ ధరకే వస్తున్న ఆ కారు ఇదే.. ఎంతంటే?అతి తక్కువ ధరకే వస్తున్న ఆ కారు ఇదే.. ఎంతంటే?raino cars;auto;manya;apple;petrol;vegetable market;mahindraWed, 17 Feb 2021 04:00:00 GMTమార్కెట్ ను సంతరించుకున్నాయి. ఇకపోతే ఇప్పుడు మరో కారు జనాల మనసును దోచుకునే ప్రయత్నం చేస్తుంది.నిస్సాన్‌ మాగ్నైట్‌, హ్యుందాయ్‌ వెన్యూ, కియా సోనెట్‌, మహీంద్రా ఎక్స్‌యూవీ 300, మారుతీ సుజుకీ విటారా బ్రెజాకు ఇది పోటీగా నిలవనుంది. ఇక ధర విషయానికి వస్తే వేరియంట్‌ను బట్టి రూ.5.45 లక్షల నుంచి రూ.9.55 లక్షల వరకు అందుబాటులో ఉంది.. 


ఈ కారు ముంద భాగంలో సిగ్నేచర్ టూ స్లాట్ గ్రిల్, క్రోమ్ ఇన్సర్ట్స్, సన్నటి ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్‌, త్రీపాడ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో పాటు ఇరువైపులా ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్ ఆకట్టుకుంటున్నాయి.వీల్ ఆర్చెస్‌పై బ్లాక్ క్లాడింగ్, డోర్ ప్యానెల్స్‌పై బ్లాక్ ప్లాస్టిక్ ఇన్సర్ట్స్, రూఫ్ రైల్స్ మరియు 16 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, కారు వెనుక భాగంలో సి-ఆకారపు ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్, హైమౌంట్ స్టాప్ లైట్‌తో కూడిన స్పాయిలర్, వాషర్, వైపర్, సిల్వర్ స్కిడ్ ప్లేట్‌తో కూడిన డ్యూయల్ టోన్ బంపర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనిలో వివిధ రకాల సమాచారాన్ని డ్రైవర్‌కు వెంటనే తెలియజేసే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 


ఇంకా ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, పీఎస్2.5 ఎయిర్ ప్యూరిఫైయర్, 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ, ఆపిల్ కార్‌ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, వైర్‌లెస్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ప్రత్యేకంగా ఉన్నాయి. రెనో కైగర్ 1.0-లీటర్ నేచురల్ పెట్రోల్, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఈ రెండు ఇంజన్లు వరుసగా 71 బీహెచ్‌పీ, 100 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తాయి. సాధారణ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి గేర్‌బాక్స్‌లతో లభ్యం కానుండగా, టర్బో పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్, ఏఎమ్‌టీ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉండనుంది. ఈ కారు మొత్తం ఆరు రంగులలో మార్కెట్ లోకి విడుదల చేసింది.





అయ్యబాబోయ్ వైష్ణవ్ తేజ్ ఏంటీ స్పీడు.. మూడో సినిమా ఆ బ్యానర్ లోనే దుమ్ముదులిపేయడమే..!

హాస్యనటి జీవితమంతా విషాదమే...?

అఖిల్ కి వైష్ణవ్ తేజ్ పోటీనా?

చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!

బాబు వెనకాలే జగన్... అగ్గి రాజుకుందిగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>