PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpgకేసీఆర్ జన్మదినo సందర్భంగా దర్గాలో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట మునిసిపల్ పరిధి 8వ వార్డ్ నర్సాపురం, 2 వ వార్డ్ దొబిగల్లీలో కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరాలను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కెసిఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేది కాదని ఆయన అన్నారు. తెలంగాణ సోదరుడైన కేసీఆర్ మీద తెలంగాణ ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలు మరువలేనివి అని ఆయన వెల్లడించారు. తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తుharish rao;kcr;lakshmi;rakshita;tara;godavari river;telangana;chief minister;minister;aqua;siddipetకేసీఆర్ మాత్రమే సిఎం... హరీష్ క్లారిటీకేసీఆర్ మాత్రమే సిఎం... హరీష్ క్లారిటీharish rao;kcr;lakshmi;rakshita;tara;godavari river;telangana;chief minister;minister;aqua;siddipetWed, 17 Feb 2021 18:30:39 GMTకేసీఆర్ జన్మదినo సందర్భంగా దర్గాలో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట మునిసిపల్ పరిధి 8వ వార్డ్ నర్సాపురం, 2 వ వార్డ్ దొబిగల్లీలో కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరాలను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కెసిఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేది కాదని ఆయన అన్నారు. తెలంగాణ సోదరుడైన కేసీఆర్ మీద తెలంగాణ ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలు మరువలేనివి అని ఆయన వెల్లడించారు.

తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి అని ఆయన అభిప్రాయపడ్డారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను చాలా రాష్ట్రాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకున్నాయి అని ఆయన వెల్లడించారు.  తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచి అని ఆయన పేర్కొన్నారు.  సిద్దిపేట ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేసుకుంటున్నాము అంటే దానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ అని హరీష్ రావు అన్నారు. ఇంకా పది సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలతో ముఖ్యమంత్రి గా కేసీఆర్ ఏ కొనసాగుతారు అని ఆయన స్పష్టం చేసారు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కు తీరని అన్యాయం జరిగేది అని హరీష్ ఆక్షేపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే తెలంగాణ సాధ్యం అయింది అని స్పష్టం చేసారు. తెలంగాణ రావడం వల్లే గోదావరి జలాలు సిద్ధిపేట ను తాకాయి అని ఆయన అన్నారు. సిద్దిపేట రక్షిత మంచినీటి పథకం మిషన్ భగీరథకు స్ఫూర్తిగా మరి దేశానికే ఆదర్శంగా నిలిచింది అని హరీష్ అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆకాశాన్ని తాకేలా తీసుకెళ్లిన కేసీఆర్  పుట్టిన రోజు వేడుకలను గల్లీ గల్లీలో నిర్వహించుకున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు అని అన్నారు.


నన్ను క్షమించండి... రేవంత్ కీలక వ్యాఖ్యలు

ఈ వారం నాలుగు సినిమాలు.. గెలుపెవరిది ?

టాలీవుడ్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టపడే ఏకైక హీరో ఎవరో తెలుసా..??

పాపం సుమంత్ కి ఈసారైనా హిట్ వస్తుందా?

శృతి హాసన్ హాట్ పిక్ క్రాక్ ఎక్కించేస్తుందిగా..!

కోటీశ్వరులను కాదని రాశి ఒక అసిస్టెంట్ ని ఎందుకు పెళ్లి చేసుకుంది

సూపర్ స్టార్ మహేష్ బాబు మురారి కి 20 ఏళ్ళు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>