PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap939276c5-263f-4568-9723-ac151f0c9fc2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap939276c5-263f-4568-9723-ac151f0c9fc2-415x250-IndiaHerald.jpg వైసీపీ కీల‌క‌నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి ఈనెల 20వ తేదీన చేయ‌బోతున్న పాద‌యాత్ర ఎందుకు? అనే ప్ర‌శ్న ఇప్పుడు విశాఖ‌ప‌ట్నం న‌గ‌ర‌వాసుల్ని తొలిచేస్తోంది. విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్ర‌యివేటుప‌రం కాకుండా అడ్డుకునేందుకా? విశాఖ న‌గ‌ర‌పాల‌క సంస్థ ఎన్నిక‌ల్లో మేయ‌ర్ పీఠాన్ని ద‌క్కించుకునేందుకా? రాజ‌కీయంగా వైసీపీ బ‌లంపై అంచ‌నాకు వ‌చ్చేందుకా? అనేది విశాఖ వాసుల‌కు అర్థం కాకుండా ఉంది. ap;telugu desam party;telugu;vishakapatnam;assembly;ycp;partyసాయిరెడ్డి పాద‌యాత్ర ఎందుకంటే..సాయిరెడ్డి పాద‌యాత్ర ఎందుకంటే..ap;telugu desam party;telugu;vishakapatnam;assembly;ycp;partyWed, 17 Feb 2021 12:45:02 GMT
వైసీపీ కీల‌క‌నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి ఈనెల 20వ తేదీన చేయ‌బోతున్న పాద‌యాత్ర ఎందుకు? అనే ప్ర‌శ్న ఇప్పుడు విశాఖ‌ప‌ట్నం న‌గ‌ర‌వాసుల్ని తొలిచేస్తోంది. విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్ర‌యివేటుప‌రం కాకుండా అడ్డుకునేందుకా?  విశాఖ న‌గ‌ర‌పాల‌క సంస్థ ఎన్నిక‌ల్లో మేయ‌ర్ పీఠాన్ని ద‌క్కించుకునేందుకా?  రాజ‌కీయంగా వైసీపీ బ‌లంపై అంచ‌నాకు వ‌చ్చేందుకా? అనేది విశాఖ వాసుల‌కు అర్థం కాకుండా ఉంది. ఉక్కు క‌ర్మాగారం కోస‌మైతే రాష్ట్ర‌మంతా పాద‌యాత్ర చేయాలి. కానీ విశాఖ‌ప‌ట్నం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనే పాద‌యాత్ర అంటున్నారు కాబ‌ట్టి న‌గ‌ర‌పాల‌క సంస్థ ఎన్నిక‌ల్లో గెలుపుకోస‌మేన‌నే అభిప్రాయం రాజ‌కీయ విశ్లేష‌కుల నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది.

విశాఖ‌ప‌ట్నాన్ని పరిపాలనా రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో జీవీఎంసీ మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవడం వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఒకవేళ ఏమైనా తేడా జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపడంతోపాటు  ప్రతిపక్షాలు ఎదురుదాడి చేసే అవకాశం వుందని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు  న‌గ‌ర ప‌రిధిలోని నియోజ‌క‌వ‌ర్గాల‌ను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. అధికారంలో ఉన్నాం కాబ‌ట్టి ఎలాగైనా మేయ‌ర్ పీఠాన్ని ద‌క్కించుకోవ‌డ‌మ‌నేది వైసీపీకి ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. మేయ‌ర్ పీఠాన్ని గెల‌వ‌క‌పోతే ప‌రిపాల‌నా రాజ‌ధానికి ఆమోద‌ముద్ర ల‌భించిన‌ట్ల‌వ‌ద‌నేది ఆ పార్టీ భావ‌న‌. అంతే కాకుండా ఉత్త‌రాంధ్ర వైసీపీ బాధ్యుడు కూడా విజ‌య‌సాయిరెడ్డి. ప‌రిపాల‌నా రాజ‌ధాని, ఉక్కు క‌ర్మాగారం ప్ర‌యివేటీక‌ర‌ణ అంశం, న‌గ‌ర‌పాల‌క సంస్థ ఎన్నిక‌లు.. ఈ మూడు అంశాలు సాయిరెడ్డిని ఒత్తిడికి గురిచేస్తోన్న‌ట్లు తెలుస్తోంది.

రాజ‌కీయంగా లాభం క‌లిగేలా పాద‌యాత్ర చేయాలంటే ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉంటుందికాబ‌ట్టి విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప‌రిర‌క్ష‌ణ పేరుతో అయితే ఎటువంటి ఇబ్బంది ఉండ‌ద‌నే అంశాన్ని దృష్టిలోఉంచుకొనే పాద‌యాత్ర‌కు రూప‌క‌ల్ప‌న చేసిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ఉక్కు క‌ర్మాగారం ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌నేది భావ‌న విశాఖ వాసుల్లో నెల‌కొంది.  నష్ట నివారణ చ‌ర్య‌ల‌తోపాటు పార్టీకి మేలు జరిగేలా చూడాలన్న లక్ష్యంతో విజయసాయిరెడ్డి పాదయాత్రకు శ్రీ‌కారం చుట్టార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. 


చంద్రబాబు రాజీనామాకి సిద్ధపడ్డారా..?

జగడ్డ : ప్రతిపక్షాల ప్రజర్.. నిమ్మగడ్డ కు తప్పని తిప్పలు ?

జగడ్డ: చంద్రబాబు vs పెద్ది రెడ్డి... హీటెక్కిన పంచాయతీ పాలిటిక్స్...?

తెలంగాణ కోడలిగా షర్మిలకు ఆ హక్కు ఉందా..?

మంచు మనోజ్ ఆ స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడా..?

కాంగ్రెస్‌లో అంతే : స్వాతంత్ర్యం ఎక్కువ‌... స‌మైక్య‌త త‌క్కువ‌...

అన్నదమ్ముల హవాతో నిండిపోయిన టాలీవుడ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>