PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections812175be-6d10-4145-9207-73009eadbcf2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections812175be-6d10-4145-9207-73009eadbcf2-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ రోజు మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే పంచాయతీ ఎన్నికలు మొదలైన మొదటి రోజు నుంచి వైసీపీ నేతలు గ్రామాల్లో పర్యటిస్తూ గ్రామస్తులను భయపెడుతున్నారని అధికార పార్టీకి ఓటు వేయకుంటే మీకు వచ్చే పథకాలను కట్ చేస్తామని బెదిరిస్తున్నారని ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి. దానికి ఊతమిస్తూ కన్నబాబురాజు జోగి రమేష్ లాంటి ఎమ్మెల్యేలు సైతం మీడియా ముఖంగానే బెదిరింపులకు పాల్పడిన కొందరు చిక్కుల్లో పడ్డారు. అయితే అలా ఎవరు మాట్లాడినా వారి elections jagan nimmagadda;chiranjeevi;jogi ramesh;jagan;andhra pradesh;kurasala kannababu;media;panchayati;village;cheque;etcherla;tdp;ycp;pettaజగడ్డ : తీరు మార్చుకోని వైసీపీ.. గ్రామస్తులను బెదిరిస్తూ దొరికిన మరో రాష్ట్ర స్థాయి నేత ?జగడ్డ : తీరు మార్చుకోని వైసీపీ.. గ్రామస్తులను బెదిరిస్తూ దొరికిన మరో రాష్ట్ర స్థాయి నేత ?elections jagan nimmagadda;chiranjeevi;jogi ramesh;jagan;andhra pradesh;kurasala kannababu;media;panchayati;village;cheque;etcherla;tdp;ycp;pettaWed, 17 Feb 2021 15:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ రోజు మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే పంచాయతీ ఎన్నికలు మొదలైన మొదటి రోజు నుంచి వైసీపీ నేతలు గ్రామాల్లో పర్యటిస్తూ గ్రామస్తులను భయపెడుతున్నారని అధికార పార్టీకి ఓటు వేయకుంటే మీకు వచ్చే పథకాలను కట్ చేస్తామని బెదిరిస్తున్నారని ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి. దానికి ఊతమిస్తూ కన్నబాబురాజు జోగి రమేష్ లాంటి ఎమ్మెల్యేలు సైతం మీడియా ముఖంగానే బెదిరింపులకు పాల్పడిన కొందరు చిక్కుల్లో పడ్డారు. అయితే అలా ఎవరు మాట్లాడినా వారి మీద ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చి చర్యలు ప్రారంభింస్తున్న క్రమంలో కాస్త ఆ దూకుడు తగ్గించారు అధికార వైసీపీ నేతలు. 

అయితే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు మాత్రం శ్రీకాకుళం జిల్లాలో ఒక గ్రామస్తులను బెదిరిస్తూ మీడియా కంటికి చిక్కారు. వైసిపి రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీ అయిన మొదలవలస చిరంజీవి ఎచ్చెర్ల మండలం బడి వాని పేట గ్రామంలో వైసిపి కార్యకర్తలతో సమావేశం అయ్యాడు. సమావేశమై టిడిపి మద్దతుదారులకి ఓటు వేస్తే గ్రామస్తులకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చెబుతూ ఆయన పలు సంచలన హెచ్చరికలు జారీ చేశారు. టీడీపీ మద్దతు దారుడు గెలిచినా వాడికి రెండు నెలలు చెక్ పవర్ తీసేస్తాం, ఎచ్చెర్ల మండల ఎంపిపి నేనే, నన్నే ఎమ్మెల్యేగారు డిక్లేర్ చేశారు అని ఆయన అన్నారు.


అలాగే జగన్ ఎక్కడో నొక్కాడు, మాకు నేరుగా పథకాలు పడిపోతాయి, మధ్యలో ఇక్కడి నాయకులు ఏమి చేస్తారు అని అనుకోకండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలా ఆపాలో నాకు తెలుసు, మొన్న ఫరీద్ పేట లో 45 పెన్షన్లు తీసేస్తే ఒక్కరు కూడా మాట్లాడలేకపోయాడు అంటూ ఆయన బెదిరించారు. మీరు గనుక వైసిపి మద్దతుదారుడుకు ఓటు వేయకపోతే మీకు వచ్చే అన్ని పథకాలు ఆపేస్తాను అంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. టీడీపీ మద్దతుదారుడు ప్రెసిడెంట్ గా గెలిచిన రెండు నెలల కంటే ఎక్కువ ఉండనివ్వమని ఆయన హెచ్చరించారు. అంతేకాక టిడిపి మద్దతుదారులకు ఓటేస్తే 21వ తేదీ తర్వాత మీ సంగతి తేలుస్తాను అని ఆయన బెదిరింపులకు పాల్పడిన అంశం చర్చనీయాంశంగా మారింది.


హీరోస్ ని మించిన డిమాండ్ ఈ సింగర్ కి నిజాంగానే ఉందా..? ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పిస్తున్నాడా..?

శృతి హాసన్ హాట్ పిక్ క్రాక్ ఎక్కించేస్తుందిగా..!

కోటీశ్వరులను కాదని రాశి ఒక అసిస్టెంట్ ని ఎందుకు పెళ్లి చేసుకుంది

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ష‌ర్మిల‌కు కాంగ్రెస్ నేతల స‌హ‌కారం... పార్టీ కూర్పులో వైవిధ్యం..

వైసీపీ ఎంపీ రఘురామరాజు జగనోరికి మేకై కుర్చున్నారుగా...?

చంద్రబాబు రాజీనామాకి సిద్ధపడ్డారా..?

జగడ్డ : ప్రతిపక్షాల ప్రజర్.. నిమ్మగడ్డ కు తప్పని తిప్పలు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>