PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan0d584879-d19a-40ce-95e5-3d08154e56aa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan0d584879-d19a-40ce-95e5-3d08154e56aa-415x250-IndiaHerald.jpg విశాఖ ఉక్కు క‌ర్మాగారం కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ అని, ప్ర‌యివేటీక‌ర‌ణ అనేది వారిచేతిలోనే ఉంద‌ని ఆంద్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అన్నారు. కాక‌పోతే విశాఖ ఉక్కుతో తెలుగువారికి ఉన్న ప్ర‌త్యేక అనుబంధం, సానుకూల దృక్ప‌థంతోనే కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ‌రాశామ‌ని వెల్ల‌డించారు. విశాఖ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న‌ను క‌లిసిన ఉక్కు క‌ర్మాగారం జేఏసీ ప్ర‌తినిధులు, ఉద్యోగుల‌తో మాట్లాడారు.jagan;telugu;vishakapatnam;central government;jacవిశాఖ ఉక్కుపై వారికి ఎలాంటి హ‌క్కు లేదువిశాఖ ఉక్కుపై వారికి ఎలాంటి హ‌క్కు లేదుjagan;telugu;vishakapatnam;central government;jacWed, 17 Feb 2021 19:54:30 GMT
విశాఖ ఉక్కు క‌ర్మాగారం కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ అని, ప్ర‌యివేటీక‌ర‌ణ అనేది వారిచేతిలోనే ఉంద‌ని ఆంద్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అన్నారు. కాక‌పోతే విశాఖ ఉక్కుతో తెలుగువారికి ఉన్న ప్ర‌త్యేక అనుబంధం, సానుకూల దృక్ప‌థంతోనే కేంద్ర  ప్ర‌భుత్వానికి లేఖ‌రాశామ‌ని వెల్ల‌డించారు. విశాఖ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న‌ను క‌లిసిన ఉక్కు క‌ర్మాగారం జేఏసీ ప్ర‌తినిధులు, ఉద్యోగుల‌తో మాట్లాడారు. అంద‌రం క‌లిసి కేంద్ర ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేసి ప్ర‌యివేటీక‌ర‌ణ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకునేలా ఒప్పిద్దామ‌న్నారు.

పోస్కో సంస్థ ప్ర‌తినిధులు త‌న‌ను క‌లిసిన మాట వాస్త‌వ‌మేన‌ని, విశాఖ ఉక్కుపై వారికి ఎలాంటి హ‌క్కు లేద‌ని, క‌డ‌ప‌లో క‌ర్మాగారం ఏర్పాటు చేయ‌మ‌ని తాను వారికి సూచించిన‌ట్లు జ‌గ‌న్ తెలిపారు. క‌డ‌ప‌, కృష్ణ‌ప‌ట్నం, భావ‌న‌పాడులో ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేయ‌మ‌ని కోరాన‌ని,  ఆ సంస్థ ప్ర‌తినిధులు నిన్న కృష్ణ‌ప‌ట్నం వెళ్లార‌ని జేఏసీ నేత‌ల‌కు ముఖ్య‌మంత్రి చెప్పారు. ఈ మూడు ప్రాంతాల్లో ఎక్క‌డ క‌ర్మాగారం స్థాప‌న‌కు అనుకూలంగా ఉంటుంద‌నే నివేదిక రాగానే దాన్నిబ‌ట్టి నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. అంద‌రం క‌లిసి ఉక్కు క‌ర్మాగారం ప్ర‌యివేటీక‌ర‌ణ‌పై కేంద్రాన్ని ఒప్పిద్దామ‌న్నారు.  పోస్కో కంపెనీ పై మూడు ప్రాంతాల్లో క‌ర్మాగారం ఏర్పాటు చేయడానికి ముందుకువ‌స్తే సానుకూలంగా స్పందిస్తామ‌ని, దీనివ‌ల్ల వేల‌సంఖ్య‌లో ఉద్యోగాల క‌ల్ప‌న జ‌రుగుతుంద‌న్నారు.

విశాఖ ఉక్కు క‌ర్మాగారానికి 20వేల ఎక‌రాల భూములున్నాయ‌ని, అందులో 7వేల ఎక‌రాల భూములు నిరుప‌యోగంగా ఉన్న‌ట్లు జేఏసీ ప్రతినిధుల‌తో ముఖ్య‌మంత్రి అన్నారు. ఆ ఏడువేల ఎక‌రాల‌కు సంబంధించి ఉక్కు క‌ర్మాగార‌మే లేఔట్లు, ప్లాట్లు వేసి ఆదాయాన్ని ఆర్జించ‌వ‌చ్చ‌ని త‌ద్వారా వ‌చ్చిన సొమ్ముతో విశాఖ ఉక్కుకు  ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండ‌వ‌న్నారు. ల్యాండ్ యూజ్ క‌న్వ‌ర్ష‌న్‌కు ప్ర‌భుత్వం నుంచి ఎటువంటి అభ్యంత‌రం లేద‌ని, అది రాష్ట్ర ప్ర‌భుత్వం చేతిలోనే ఉంద‌ని, ఉక్కు క‌ర్మాగారం ప్ర‌యివేటుప‌రం కాకుండా ఉండేందుకు తాను చేయాల్సిందంతా చేస్తాన‌ని హామీఇచ్చారు. అంద‌రం  క‌లిసి సానుకూల దృక్ప‌థంతో కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఒప్పిద్దామ‌న్నారు.





చైనాను అమెరికా వదిలేలా లేదు.. ఆ విషయంలో తాజా వార్నింగ్

విశాఖ ఉక్కుపై హామీ ఇచ్చిన సి‌ఎం జగన్ !!

ఈ వారం నాలుగు సినిమాలు.. గెలుపెవరిది ?

టాలీవుడ్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టపడే ఏకైక హీరో ఎవరో తెలుసా..??

పాపం సుమంత్ కి ఈసారైనా హిట్ వస్తుందా?

శృతి హాసన్ హాట్ పిక్ క్రాక్ ఎక్కించేస్తుందిగా..!

కోటీశ్వరులను కాదని రాశి ఒక అసిస్టెంట్ ని ఎందుకు పెళ్లి చేసుకుంది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>